National updates: బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై మండిపడ్డ టిఆర్ఎస్ ఎంపీలు..
జాతీయం..
ఢిల్లీ:
(రంజిత్ రెడ్డి, టి.ఆర్.ఎస్, ఎంపీ)
• వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై బిజెపి సమాధానం ఇవ్వాలి.
• తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులు ఉంటున్నాయి.
• రాష్ట్రం నుంచి రూ. 50వేల కోట్లు ఇస్తే తిరిగి ఇచ్చేది కేవలం రూ. 23 వేల కోట్లే.
• రాష్ట్రాలకు ఇవ్వాల్సిన చాలా ఆదాయాల్లో కోత విధించారు.
• నిజామాబాద్ లో రైతులను అడుగితే, “రైతు బంధు” ఎవరు ఇస్తున్నారో చెప్తారు.
• “కరోన” నియంత్రణకు కేవలం రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చారు..
• మిగులు నిధులు ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి.
• జిఎస్టీ, వెనుకబడిన జిల్లాల నిధులు రూ. 9 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.
• బిజెపి ఎంపీలు వాటిని ఇప్పించేందుకు కృషి చేయాలి.
Pragathi Bhavan: ప్రగతి భవన్ లో రెవెన్యు పై సీఎం కేసీఆర్ సమీక్ష..
ప్రగతి భవన్..
- ప్రగతి భవన్ లో రెవెన్యు పై సీఎం కేసీఆర్ సమీక్ష..
- రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ధరణి వెబ్ సైట్ పై అధికారులతో సమావేశం..
- పాల్గొన్న సి ఎస్..ఉన్నతాధికారులు.
Tammineni Veerabhadram: వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు రైతాంగ ఉద్యమాలకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుంది...తమ్మినేనీ వీరభద్రం..
తమ్మినేనీ వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి..
-కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు చేస్తున్న ఆందోళనలు పక్కదారి పట్టించడానికి ఆరు రబీ పంటల మద్దతు ధరలు పెంచింది..
-గతంలో 23 పంటలకు మద్దతు ధర ప్రకటించేది ఇప్పుడు కేవలం రబీ పంటలకు మాత్రమే మద్దతు ధర కల్పించి రైతులకు మేలు చేసినట్లు భ్రమలు కల్పిస్తుంది...
-ఈ మూడు చట్టాలు రైతులకు తీవ్ర నష్టం చేసేవిగాను ,కార్పొరేట్ ల ప్రయోజనాల కాపాడే విధముగా ఉన్నాయి..
-తెలంగాణ లో అత్యధికంగా పండించే పంటల్లో వరి 2 వ స్థానం లో ఉంది జొన్న వేరుశనగ, మొక్కజొన్న ,వరి, మిరప ,ఉల్లి, ఆముదం పంటలకు మద్దతు ధరలు ఎందుకు ఇవ్వలేదు...?
-రైతులు పండిస్తున్న అన్ని పంటలకు శాస్త్రీయ ఉత్పత్తి ధరను బట్టి లెక్కకట్టి స్వామినాథన్ ఫార్ములా ప్రకారం 50 శాతం అదనంగా చేర్చి మద్దతు ధర ప్రకటించాలి...
Talasani Srinivas Yadav Comments: నాంపల్లి, కార్వాన్ సంబంధించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను భోజగుట్ట లో కడుతున్నాం..తలసాని శ్రీనివాస్ యాదవ్..
అసెంబ్లీ మీడియా పాయింట్..
తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి..
-కాంగ్రెస్ కోర్ట్ లలో కేసులు వేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆపుతుంది ..
-హైదరాబాద్ అబివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర
-కేటీఆర్ పెర్ఫార్మన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసు
-మధిర లో రైతు బంధు, రైతు బీమా , కళ్యాణ లక్ష్మీ చెక్కులు భట్టి పంపిణీ చేస్తారు
-లక్ష బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అప్జల్ సాగర్ లేదు
-150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరు
-జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు
-కాంగ్రెస్ నేతలు టీవీ సీరియల్ డ్రామాలు ఆపాలి
Khammam updates: కారేపల్లి పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన గేట్ రేలకాయలపల్లి గ్రామస్థులు..
ఖమ్మం జిల్లా..
- మృతుడు ధరంసోద్ సుదర్శన్ మృతిపై విచారణలో పోలీసులు జాప్యం వహిస్తున్నారని ఆగ్రహం
- కారేపల్లి సీఐ, ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్
- పోలీసు స్టేషన్ ఎదుటే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించిన మృతుడు సుదర్శన్ తండ్రి రాంబాబు
- అడ్డుకున్న పోలీసులు
Telangana Justice Department: చట్ట రూపం దాల్చిన బిల్లులు..
న్యాయశాఖ..
- గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్లు జారీ
- అమల్లోకి వచ్చిన భూమిహక్కులు - పట్టాదారు పాసుపుస్తకాలు, వీఆర్ఓ పోస్టుల రద్దు, టీఎస్ బీపాస్ చట్టాలు
- అమల్లోకి వచ్చిన పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, జీఎస్టీ సవరణ చట్టాలు
- ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ.
Medak updates: కొత్త రెవెన్యూ చట్టం కు మద్దతు గా ట్రాక్టర్ ర్యాలీ తీసిన మెదక్ నియోజకవర్గ రైతులు..
మెదక్..
-రైతుల శేయస్సు కోసం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం కు మద్దతు గా
-మెదక్ జిల్లా కేంద్రం ఐబీ గెస్ట్ హౌస్ నుండి కలెక్టరేట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ తీసిన మెదక్ నియోజకవర్గ రైతులు.
-ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.
Siddipet updates: కొత్త రెవెన్యూ చట్టం అమలు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించిన రైతులు...
సిద్దిపేట జిల్లా..
- సిద్ధిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలం లో కొత్త రెవెన్యూ చట్టం అమలు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
- చిన్నకోడూర్ మండల కేంద్రం నుండి పలు గ్రామాల మీదుగా 500 ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులు...
- ఈ ర్యాలీ లో ఉత్సాహంగా పాల్గొన్న రైతులు...
- సీఎం కెసిఆర్ చేపట్టిన కొత్త రెవెన్యూ చట్టం కు మద్దతుగా ప్రజ్ఞాపూర్ హరిత రెస్టారెంట్ నుండి గజ్వేల్ స్థానిక కోట మైసమ్మ గుడి వరకు భారీగా బైక్ ర్యాలీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కార్యకర్తలు, నాయకులు
N. V. S. S. Prabhakar: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ని కలిసిన బిజెపి నేతలు....
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్....బిజెపి మాజీ ఎమ్మెల్యే..
- రాబోయే ఎన్నికలు, ఓటర్ల నమోదుపై కమీషనర్ తో చర్చించాము.
- గతంలో అసెంబ్లీ, పాట్లర్లమెంట్, జి హెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ లో చాలా అక్రమాలు జరిగాయి.
- చాలామంది పేర్లు తొలగించారు....ఆ వివరాలను కమీషనర్ దృష్టికి తీసుకెళ్లాము.
- కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారికి కరోనాని దృష్టిలో పెట్టుకుని మరింత గడువు ఇవ్వాలి.
- కింది స్థాయి వరకు అవకాశం కల్పించాలి.
- రాబోయే జి హెచ్ ఎంసీ ఎన్నికలకు సంబందించిన ఓటరు లిస్ట్ పై అవగాహన కల్పించాలి.
- ఇష్టాను సారంగా డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు....దీనిపై ఎన్నికల కమీషనర్ దృష్టికి తీసుకెళ్లాము....
Suryapet Suryapet updates: పులిచింతల బ్యాక్ వాటర్ లో మొసళ్ళ సంచారం..
సూర్యాపేట :
- రోడ్లపైకొచ్చి జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న మొసళ్ళు.
- అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు.
- ఓ మొసలిని తాళ్లతో బంధించిన అధికారులు.
- వరద ఉధృతి పెరుగుతున్న నేపధ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.