Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-22 01:00 GMT
Live Updates - Page 2
2020-10-22 11:54 GMT

Maha Prasthanam updtaes: మహాప్రస్థానం చేరుకున్న నాయిని అంతిమ యాత్ర..

 //మహా ప్రస్థానానికి చేరుకున్న నాయిని నర్సింహా రెడ్డి అంతిమ యాత్ర

//నాయిని పాడే మోసిన మంత్రి కేటీఆర్, ఈటెల, శ్రీనివాస్ గౌడ్, బొంతు రాంమోహన్, బాబా ఫసియుద్దీన్

2020-10-22 11:28 GMT

Hyderabad updates: జాహిరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ..

//కరోనా లక్షణాలు ఉండటంతో నిన్న కోవిడ్ -19 టెస్ట్ చేసుకున్న ఎంపీ

//పాజిటివ్ రిపోర్ట్ రావడంతో హోం ఐసోలేషన్ కు వెళ్లిన ఎంపీ

//మూడు రోజుల క్రితం కామారెడ్డి కలెక్టరేట్ లో జనహిత హాల్ లో దిశ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ

//మీటింగ్ లో పాల్గొన్న కలెక్టర్ శరత్, జిల్లా అధికారులు

//నేను క్షేమంగా ఉన్నా, వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో ఉన్న, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్న

//ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారందరు టెస్ట్ లు చేసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్లో ఉండాలి - ఎంపీ బీబీ పాటిల్

2020-10-22 11:19 GMT

Hyderabad updates: బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసాము...

-సీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

-ఈనెల 9న బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో బ్యాగ్ లో నగలు మాయమైన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసాము.

-వారి నుంచి 143 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నాం.

-వీటి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుంది.

-ప్రధాన నిందితుడు నిరంజన్ తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరొకరు పరారీలో ఉన్నారు.

-ఏఆర్ శ్రీనివాస్, పశ్చిమ మండల డీసీపీ

-ఈనెల 9న సాయంత్రం ప్రదీప్ వీఎస్ జ్యూవెల్లరి నుంచి జూబ్లీహిల్స్

-వర్షం వల్ల వరద వచ్చింది బైక్ క్రింద పడి బాగ్ కొట్టుకుపోయింది.

-బ్యాగ్ పడిన తర్వాత రెండు మూడు మీటర్లు కొట్టుకుపోయింది.

-అక్కడ గుడిసెల్లో నివసిస్తున్న నిరంజన్ కి బ్యాగ్ దొరికింది.

-బంధువులతో కలిసి నగలతో అక్కడ నుంచి నాగర్ కర్నూల్ వెళ్లారు.బ్యాగ్ అక్కడే వదిలి వెళ్లారు.

-మొబైల్ స్విచ్ ఆఫ్ టెక్నాలజీ సహాయంతో నిందితులను పట్టుకున్నాం.

2020-10-22 11:07 GMT

Telangana updates: నాయిని నర్సింహారెడి గారికి ప్రొ. కోదండరాం నివాళులర్పించారు...

//తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం

//నాయిని నర్సింహారెడి గారికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ. కోదండరాం నివాళులర్పించారు.

//నాయిని నర్సింహారెడ్డి గారు తొల దశ ఉద్యమం నుంచి తెలంగాణ కోసం పోరాడారు

//సోషలిస్టుగా రాజకీయ జీవితం ఆరంభించి కార్మిక నాయకుడిగా నాయిన నర్సింహా రెడ్డి గారు ఎదిగారు...

//ఎమ్మెల్యే అయినప్పటికీ మోటర్ సైకిల్ పై వారు తిరిగేవారని అలాంటి నిరాడంబరైన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం..

//వారు నుంచి ప్రతీ ఒక్క రాజకీయ నాయకుడు నిరాడంబరతను నేర్చుకోవాలి...

//ఇప్పటి రాజకీయ నాయకులందరూ వారిని చూసి ప్రజల సమస్యలను తీర్చటంలో వారికున్న చిత్తశుద్ధిని నేర్చుకోవాలని కోరుకుంటున్న

వారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పాత్రి పోశించారు....

2020-10-22 10:32 GMT

Hyderabad updates: ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే హైద్రాబాద్ లో ఇలాంటి ఉపద్రవం ఏర్పడింది...

  మర్రి శశిధర్ రెడ్డి..మాజీ మంత్రి.

-తక్షణం రక్షణ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం విఫలం అయ్యింది.

-రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టాలి.

-మనకు సముద్రం లేకున్నా.. మానకు కూడా విపత్తులు వస్తాయి..ముందస్తు చర్యలు.తప్పకుండా ఉండాలి.

-ఒక శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలి..

-ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోంది.. మనం చేసేది చేయకుండా దేవుడు కూడా సహకరించారు..

-నాలలలో పూడిక కూడా తీయకుండా వ్యర్థాలను తొలగిచకుండా వరదలు ఎలా ఆపగలుగుతాము.

-హైదరాబాద్ నుంచి అత్యధిక ఆదాయం ఉన్న..సౌకర్యాలు మాత్రం ఏమి లేవు

-65 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. సుందరికరణ కాదు, మౌలిక సదుపాయాలు చాలా అవసరం..

-6 ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది. గత ప్రభుత్వాలు ఏమి చేయలేదంటున్నారు. ఇది అబద్ధం..

-బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించారు. అందరికి సహాయం అందించాలి. ప్రజలకు రాజకీయాలు అంతగట్టకుండా ప్రతి బాధితుడికి అందేలా అధికారులు చర్యలను తీసుకోవాలి.

-కేంద్ర బృందం వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఇచ్చాక కేంద్ర బృందం వచ్చి పరిశీలించాలి. బీజేపీ కేంద్ర బృందం అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది.

-టిఆర్ఎస్, బీజేపీ లు వచ్చే ghmc ఎన్నికలు ఉన్నాయని ఆదరబాధర చేస్తుంది . కానీ ఇవి ప్రజలకు మేలు జరిగేవి కావు..

-హైదరాబాద్ ను కేంద్రం, రాష్ట్రం నిర్లక్ష్యం చేస్తుంది. కేవలం హైదరాబాద్ ను కొన్ని ప్రాంతాల్లో అందంగా తయారు చేయాలని చూస్తున్నారు. ఇది విపత్తుల నివారణకు దోహదం చేయదు.

2020-10-22 10:25 GMT

Mahabubabad updates: మహబూబాబాద్ సంఘటన చాలా బాధాకరం. దిగ్భ్రాంతికి గురి చేసింది...

మహబూబాబాద్.. 

//మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్, హత్య సంఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ   మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

//జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆ సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్న మంత్రి

//మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:

//దగ్గరి వారే కిడ్నాప్ చేసి చంపడం మరింత హృదయ విదారకరం.

//ఆ బాలుడి తల్లిదండ్రుల కడుపు కోతకు అంతులేదు.

//ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.

//ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించాను.

//ఆ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

//వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియచేస్తున్నాను

//సమాజంలో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను

2020-10-22 10:19 GMT

Keesara Case updates: మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు...

*కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు..

*నాగరాజు కు సంబంధించిన మరో లాకర్ ను ఓపెన్ చేసిన ఏసీబీ అధికారులు..

*అల్వాల్ లోని ఐసీఐసిఐ బ్యాంక్ లాకర్ ను ఓపెన్ చేసిన ఏసీబీ..

*లాకార్ల లో కేజీల కొద్దీ బంగారం గుర్తించిన ఏసీబీ.

*కీసర నాగరాజు బినామి నందగోపాల్ పేరుతో ఉన్న లాకర్..

*కేజీ కి పైగా బంగారం గుర్తించిన ఏసీబీ..

2020-10-22 10:17 GMT

Kamareddy district updates: కలెక్టరేట్ కు ర్యాలీగా తరలివచ్చిన వేలాది మంది రైతులు...

కామారెడ్డి :

*మూడు గంటల ధర్నా అనంతరం కలెక్టరేట్ కు ర్యాలీగా తరలివచ్చిన వేలాది మంది రైతులు

*బైపాస్ వద్ద రైతులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు

*కలెక్టర్ కార్యాలయ రహదారి వద్ద బారికేడ్లను అడ్డుపెట్టి రైతులను అడ్డుకున్న పోలీసులు

*పోలీసులు రైతులకు మధ్య తోపులాట

*పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించిన రైతులు

2020-10-22 09:18 GMT

Shamshabad updates: బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్...

శంషాబాద్

//ఎల్ రమణ టీడీపీ అధ్యక్షుడు

//గ్రేటర్ హైదరాబాద్ గగన్ పహడ్ అప్పచెరువు విషయంలో ప్రభుత్వం జ్యూడీషియల్ (మెజిస్టీరియల్) ఎంక్వయిరీ చేయించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ   రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ డిమాండ్ చేశారు.

//అప్పచెరువు దుర్ఘటన కు ఎవరు బాధ్యత వహిస్తారు... అధికారులా, స్థానిక ఎమ్మెల్యేనా, కెటిఆర్, కెసిఆర్ లలో ఎవరు బాధ్యత వహిస్తారు..?

//బాధిత కుటుంబాలకు 30 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్.

//గ్రేటర్ హైదరాబాద్ శివారు మైలార్ దేవుపల్లి డివిజన్ గగన్ పహాడ్ అప్ప చెరువు తెగి వరదల్లో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించిన టీడీపీ రాష్ట్ర   అధ్యక్షుడు ఎల్. రమణ.

//మృతుల కుటుంబాలకు 10000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేత

//ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది వరదల్లో మునిగి మృతిచెందారు..

//వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయలేదు..

//హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేస్తామని , నాళాలను విస్తరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదు..

//గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు..

//30000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ హామీలను విస్మరించింది..

//వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు 30 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందజేయాలి...

2020-10-22 07:49 GMT

సోష‌లిస్టు సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డిన వ్య‌క్తి నాయిని - జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి

నాయిని న‌ర‌సింహారెడ్డి గారి మ‌ర‌ణంతో తెలుగు ప్ర‌జ‌లు, భార‌త దేశం ఒక గొప్ప సోష‌లిస్టు యోధుడిని కోల్పోయింది. సోష‌లిస్టు సిద్ధాంతాల‌కూ, విలువ‌ల‌కూ క‌ట్టుబ‌డి ప‌నిచేసిన ఒక గొప్ప నాయ‌కుడు నాయిని. త్యాగానికీ, ప‌ట్టుద‌ల‌కూ ఆయ‌న ఒక చిహ్నం. పేద‌ల ప‌క్షాన పోరాడే ఒక గొప్ప నాయ‌కుడిని కోల్పోవ‌డం విచార‌క‌రం. సోష‌లిస్టు ఉద్య‌మంలో లోహియా అనుచరుడిగా, ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన జ్ఞాప‌కాలు విలువైన‌వి. ఆయ‌న కుటుంబానికీ, అభిమానుల‌కూ, ప్ర‌జ‌ల‌కూ నా ప్ర‌గాఢ సంతాపం.

Tags:    

Similar News