Tirumala Updates: తిరుమలలో నేడు పార్వేటి మండపం వద్ద కార్తీక వనభోజన మహోత్సవం..
తిరుమల
* కోవిడ్-19 కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులు, ఉద్యోగులకు అనుమతి
* గజవాహనం పై మలయప్ప పల్లకీపై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఊరేగింపుగా పార్వేటి మండపానికి చేరుకుంటారు.
* ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
* పూజా కైంకర్యాలు అనంతరం సహపంక్తి కార్తీక వనభోజనం, భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన టీటీడీ.
* పలు ఆర్జిత సేవలు రద్దు
Amaravati Updates: రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల తీరును ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ...
అమరావతి..
* రాజమండ్రిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టీ మధులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
* గుంటూరులో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గృహనిర్బంధం.
* కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలలో పలువురు సిపిఐ నాయకుల ముందస్తు గృహ నిర్భందాలు, అరెస్టులు.
* ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరు పరిశీలనకై రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ ప్రతినిధి బృందం పోలవరం వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తు అరెస్టులు.
Anantapur Updates: జిల్లాలో తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్...
అనంతపురం:
* ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు కొనసాగుతున్న తనిఖీ లు.
* అక్రమ కర్నాటక మద్యం, నాటు సారా తయారీ, విక్రయాలపై నిఘా వేసి దాడులు.
* బృందాలుగా ఏర్పడి తండాలు, అటవీ ప్రాంతాలు, అనుమానితుల ఇళ్లు, గడ్డి వాముల ప్రాంతాలు, పశవుల పాకలు, దుకాణాలు, పొలాలు, కర్నాటక సరిహద్దు గ్రామాలు, రహదారుల్లో కొనసాగుతున్న సోదాలు.
Anantapur Updates: రబీలో వేరుశనగ విత్తన కాయలు సరఫరా...
అనంతపురం:
* రబీలో వ్యవసాయ సాగుకు కదిరి-6 రకం వేరుశనగ విత్తన కాయలు సరఫరా.
* జిల్లాకు 16,665 క్వింటాళ్ల కేటాయింపు.
* క్వింటాలు ధర రూ.8 వేలు గా నిర్ధారణ, రూ. 4,500 రాయితీ పోను రైతు వాటా 3,500.
Anantapur Updates: నేడు సత్యసాయి విశ్వవిద్యాలయం 39వ స్నాతకోత్సవం....
అనంతపురం..
* 17 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఏడుగురికి డాక్టరేట్లు ప్రధానం.
* కోవిడ్ నేపథ్యంలో పథకాలు, డాక్టరేట్ అందుకునే విద్యార్థులు మాత్రమే హాజరు.
* సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం.
Prakasham Updates: ఒంగోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...
ప్రకాశం జిల్లా...
* ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.
* ఇద్దరు మృతి వాహనంలో చిక్కుకున్న మరికొందరి పరిస్థితి విషమం.
* మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
* సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.
* కొనసాగుతున్న సహాయక చర్యలు.
Srikakulam Updates: రెల్లి వీధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్..
శ్రీకాకుళం
* వీరఘట్టం మండలం రెల్లి వీధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్
* స్థానిక పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో ఈ సెర్చ్ నిర్వహిస్తుంన్నారు
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
తిరుమల సమాచారం
* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 31,552 మంది భక్తులు.
* నిన్న తలనీలాలు సమర్పించిన 11,026 భక్తులు.
* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు.
Kurnool District Updates: ప్రభుత్వ తీరును ,అధికారుల ప్రవర్తన ఎండగడుతూ హిందూ ధార్మిక సంస్థల ఆందోళన...
కర్నూలు జిల్లా...
* తుంగభద్ర లో పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా చలో తుంగభద్ర కు పిలుపునిచ్చిన వీహెచ్ పి, భజరంగ్ దళ్
* విశ్వహిందూ పరిషత్ - భజరంగ్ దళ్.. కర్నూల్ శాఖ పిలుపునిచ్చిన "చలో తుంగభద్ర" కార్యక్రమాని కి అనుమతులు లేవంటూ నేతలను కార్యకర్తలను హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు
* పుణ్య స్నానాలకు అనుమతులు ఇవ్వకుండా తమను "అక్రమ అరెస్టు లు" చేయటం ఎంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు