Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-21 01:14 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-21 12:30 GMT

నిజామాబాద్ జిల్లా:

-నిజామాబాద్ జిల్లా వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో నిరహార దీక్ష

-శాసనసభలో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ,

-వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో నిరహార దీక్షలు చేపట్టారు

2020-09-21 12:28 GMT

-ఈనెల 27న తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం..

-ఎల్ రమణ అధ్యక్షులు గా దాదాపు 80 మందితో కూడిన రాష్ట్ర కమిటీ జాబితా సిద్ధం..

-ఆఖరి ప్రయత్నం చేస్తున్న ఎల్ రమణ వ్యతిరేక వర్గం.

-ఏడేళ్లుగా ఒక్కడే అదేక్షుడిగా ఉండడంతో పార్టీలో భారీగా వెతిరేకిస్తున్న నేతలు.

2020-09-21 12:25 GMT

ఈఎస్ఐ స్కామ్ అప్ డేట్స్....

-ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో దేవికారాని కి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్..

-దేవికారాని తో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసీస్ట్ వసంత, మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగుల కు బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్ట్...

2020-09-21 12:03 GMT

హైదరాబాద్.. 

-హైదరాబాద్ లో త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన ఆంద్రప్రదేశ్ బీసి వెల్పేర్ మంత్రి వేణుగోపాలకృష్ణ.

-రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితులను అడిగి తెలుసుకున్న చినజీయర్ స్వామి.

-అనంతరం చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నమంత్రి వేణుగోపాలకృష్ణ.

2020-09-21 11:49 GMT

కుమ్రంబీమ్ జిల్లా..

-మావోయిస్టులు సరిహద్దు దాటకుండా బారీగా పోలీసు బలగాల మోహరింపు..

-ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో కోనసాగుతున్నా కూంబింగ్..

-తప్పించుకున్న మావోయిస్టు నాయకుడు బాస్కర్, ‌కమీటి సభ్యులు పారిపోకుండా బలగాల మోహరింపు

2020-09-21 11:45 GMT

హైదరాబాద్..

-హైదరాబాద్ లో హైవే అథారిటీ ఇండియా రీజినల్ ఆఫీసర్ కృష్ణ కుమార్ తో సమావేశమైన మాజీ ఎంపీ నగేష్, పార్టీ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి

- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని 44వ జాతీయ రహదారులపై సర్వీస్ రోడ్, స్లీప్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరిన మాజీ ఎంపి

-సర్వీస్ రోడ్డు, స్లీప్ లు లేకపోవడం ప్రమాదాలు జరుగుతున్నాయి

-పనులు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చిన. మాజీ ఎంపి

2020-09-21 11:41 GMT

యూత్ కాంగ్రెస్ నేతలు..

-ఏజెన్సీలను కొనుగోలు చేసి మెంబర్ షిప్ చేసారని ఆరోపిస్తున్న సీనియర్ నేతలు.

-నలుగురు ప్రెసిడెంట్ అభ్యర్థులకు గట్టి పోటీ ఉండడంతో లక్షల్లో మెంబర్ చేసిన యూత్ కాంగ్రెస్ నేతలు.

-నిన్నతో మెంబర్ తేదీ ముగియడంతో ఆధారకార్డు ఉంటేనే మెంబర్ షిప్ అనుమతించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు.

-స్క్రోట్ని లో ఆధార్ కార్డు లింక్ లేకుండా మెంబర్ షిప్ రద్దు చేయాలని డిమాండ్.

-ఓ మాజీ కేంద్ర మంత్రి పార్టీ గాంధీ భవన్ లో అభ్యంతరం.

-టీపీసీసీ ఈ సమస్య పరిష్కరించకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక.

2020-09-21 11:17 GMT

సీఎం కెసిఆర్..

-దేశంలోనే మొదటి సారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా..

-రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

-ధరణి పోర్టల్ రూపకల్పన పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

-అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారం తో రావాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు.

2020-09-21 10:59 GMT

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ..

-ప్రస్తుత టీటీడీపీ అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్

-తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మార్చాలని ఇప్పటికే చంద్రబాబును కోరిన పలువురు సీనియర్లు

-నాయకత్వ మార్పుపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ

-7ఏళ్లుగా ఒక్కరే అధ్యక్షుడిగా ఉండటంతో పార్టీ పరిస్థితి దిగజారుతోదంటోన్న పలువురు నాయకులు

-తమ జీవితాలతో ఆడుకోవద్దంటోన్న పలువురు నేతలు

-నాయకత్వ మార్పు కోరుతూ.. చంద్రబాబుకు లేఖ రాసిన పార్లమెంటు పార్టీ ఇంఛార్జ్ లు, పలువురు నేతలు

2020-09-21 09:50 GMT

టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఆదేశాల మేరకు __

-YJS & VJS సంయుక్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు ఈ నెల 21 న "హాలో నిరుద్యోగి _ ఛలో అసెంబ్లీ" కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం     తెలిసిందే...

-ఈ సందర్భంలో నిన్న (సెప్టెంబరు 19 న) యువజన, విద్యార్థి జన సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జూమ్ లో జరిగింది...

-నిరుద్యోగ సమస్యపై భవిష్యత్తులో చేసే పోరాటంపై కూలంకషంగా చర్చించడం జరిగింది...

-పట్టభద్రుల ఎన్నికలలో నిరుద్యోగ అంశం ప్రధాన ఎజెండా ఉంచడం కోసం, ఎన్నికల వరకు నిరుద్యోగ సమస్యపై వరుస నిరసన కార్యక్రమాలు చేయాలనే   మెజార్టీ అభిప్రాయాలు రావడం జరిగింది...

-ఈ కార్యాచరణలో భాగంగా కొన్ని నిరసన కార్యక్రమాలను చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ...

-సెప్టెంబరు 22, 23, 24 తేదీలలో రెండవ విడత నిరుద్యోగుల బతుకుదెరువు సాధన యాత్ర చేయడం....

-సెప్టెంబరు 26 వ తేదీన రాష్ట్ర కార్యాలయంలో "నిరుద్యోగుల నిరసన దీక్ష" చేయడం. దీనికి కొనసాగింపుగా ఇదే రోజు అన్నీ జిల్లాలో నిరసన దీక్ష చేయడం....

-సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 1 వరకు "నిరుద్యోగుల శాంతి ర్యాలీ" విజయవంతం చేయడం కోసం ప్రచారం...

-గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న హైదరాబాదులో శాంతి ర్యాలీ....

-అక్టోబర్ 3 లేదా 4 న మళ్లీ YJS, VJS ముఖ్య నాయకులతో సమావేశం. భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన...

Tags:    

Similar News