Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-21 03:25 GMT
Live Updates - Page 3
2020-10-21 09:58 GMT

Tirumala updates: ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళం..

తిరుమ‌ల‌..

 -ఎస్వీబీసీ ట్రస్టుకు  రూ.10 ల‌క్ష‌లు విరాళం

 -ఒడిశా‌కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్ర‌తినిధి తిరుప‌తికి చెందిన వై.రాఘ‌వేంద్ర  రూ.10 ల‌క్ష‌లు ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా అందించారు.

-అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డికి డిడిన అందచేశారు.

2020-10-21 09:54 GMT

Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

అమరావతి..

-- సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన సేవలు     అందించే పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం.

--  అరాచక శక్తులను అణచివేసే ప్రయత్నంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఎందరో పోలీసులు ప్రజల హృదయాల్లో చిరంజీవులై   నిలిచారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల స్మృతికి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.

2020-10-21 09:51 GMT

Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..

అమరావతి..

-- "ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకొని తిరగగలడో...  ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా       స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు”  అని ప్రార్థించారు విశ్వకవి ఠాగూర్.

-- అటువంటి స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులే. 

-- అంతటి నిస్వార్ధమైన, అంకిత భావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరికీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం   సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.

2020-10-21 09:40 GMT

Vijayawada updates: కరోనాను తరిమేయండి అంటూ ర్యాలీ ప్రారంభించారు ఏపీ సీఎస్ నీలంసాహ్నీ..

విజయవాడ..

-ఏపీ సీఎస్ నీలంసాహ్నీ..

-మాస్క్ ధరించండి కరోనాను తరిమేయండి అంటూ ర్యాలీ ప్రారంభించారు ఏపీ సీఎస్ నీలంసాహ్నీ

-మాస్క్ సరిగా ధరించండి

-శానిటైజేషన్ చేసుకోండి

-సామాజిక దూరం పాటించండి

-ప్రజల్లో అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాలీలు రాష్ట్రమంతా జరుపుతోంది

-ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే కరోనాను పూర్తిగా నిర్మూలించవచ్చు

-కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్

-జిల్లాలో ప్రతీ మండలంలో కూడా ఈ కార్యక్రమం జరపాలని ఆదేశించాం

-ప్రతీ హెల్త్ అధికారి, వర్కర్ కూడా ఈ ర్యాలీలో భాగస్వామ్యం కావాలి

-ప్రజలందరూ కరోనా నియంత్రణ పట్ల అవగాహన కలిగి ఉండాలి

2020-10-21 09:20 GMT

Anantapur district updates: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై ఫిర్యాదు!

అనంతపురం:

-దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తకు, డీజీపీకి ఫిర్యాదు.

-కర్ణాటక రవాణాశాఖ అధికారులు జేసీ సోదరులకు సహకరించారని విచారణ జరపాలని కోరిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

-2017లో సుప్రీంకోర్టు నిషేధించిన బిఎస్ -3 వాహనాలను బిఎస్ -4 వాహనాలుగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారని ఆధారాలు సమర్పించిన పెద్దారెడ్డి.

2020-10-21 09:16 GMT

Vijayawada updates: క్షేత్రియ, ప్రాంతీయ కార్యాలయం శంకుస్థాపన!

విజయవాడ:

-APIIC కాలనీ లో ఆంధ్రప్రదశ్ కాలుష్య నియంత్రణ మండలి క్షేత్రియ, ప్రాంతీయ కార్యాలయం శంకుస్థాపన

-కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు.

-22.57 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మాణం.

-కార్యాలయాల నిర్మాణ బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ అప్పగింత.

-18 నెలల కాలంలో భవన నిర్మాణాలను పూర్తి చేయనున్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్

2020-10-21 08:51 GMT

Tirumala updates: శ్రీవారిని విశాఖపట్నం వైసిపి సత్యనారాయణ దర్శించుకున్నారు...

  తిరుమల..

-విశాఖ రాజధానిగా రావాలని నాతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.

-దేశంలోనే వివిధ రాజధానులతో పోటీపడి ఎదుగుతూ టూరిజం, సాఫ్ట్ వేర్, నావి లాంటి అపార వనరులున్న ప్రదేశం విశాఖపట్నం.

-రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు.

-రాజధాని తరలింపు హైకోర్టు స్టే ఇచ్చింది.

-గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో జరిగిన భూ కబ్జాలను ఆధారాలతో సహా బయటపెట్టాము.

-డ్రైవర్లు,ఇంట్లో పనిమనుషుల పేర్లతో అమరావతిలో భూములు కొన్నారు.

-విశాఖలో భూముల కబ్జా పై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఒక్క ఆరోపణను నిరూపించండి, దేనికైనా సిద్దం.

-నేను కూడా విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేస్తున్నాను.

-నాకు తెలిసి ఎవ్వరు కూడా భూములు కొనడం గాని, ట్రేడింగ్ చేయడం, భూకబ్జాలకు పాల్పడం జరగలేదు.

-ఎంవివి సత్యనారాయణ విశాఖపట్నం, వైసీపి ఎంపీ.

2020-10-21 04:59 GMT

ఏపీ సీఎం జగన్

1959 అక్టోబర్ 22న పోరాడిన ఎస్సై కరన్ సింగ్ ధైర్యాన్ని, పదిమంది పోలీసుల త్యాగాన్ని మన దేశం గుర్తు చేసుకుంటొంది

ప్రతీ పోలీసు అమరవీరుడికి జేజేలు

నాలుగు దిక్కుల నుంచీ ఎటువంటి ఆపద వచ్చినా కాపాడే ధైర్యసాహసాలు ధర్మచక్రం చెపుతుంది

అధికారం ఎంత గొప్ప బాధ్యతో సత్యమేవ జయతే అన్నది చెపుతుంది

దేశం అభివృద్ధి చెప్పే తలసరి ఆదాయం కన్నా ముఖ్యమైనది నేరాల రేటు తక్కువగా ఉండటం

అభివృద్ధి చెందుతున్న మనలాంటి సమాజలాలో నేరాలు అంత త్వరగా తగ్గుతాయని అనుకోవడం లేదు

లా అండ్ ఆర్డర్ ప్రధానమైన విషయం

పౌరుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించద్దు

కుల మత ఘర్షణలలో ఎలాంటి ఉపేక్ష లేకుండా పనిచేయాలని పోలీసులకు చెపుతున్నా

దిశ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయి

దిశ బిల్లు త్వరలోనే కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నాను

ఏపీలో మొట్టమొదటిగా హోంమంత్రిగా సుచరితను నియమించాం

ఇసుక, మద్యం దొంగదారి పడుతుంటే చట్టం పనిచేస్తున్నది నాకు తెలుసు

అదనపు సిబ్బంది అవసరాన్ని తెలుసుకుని డిసెంబరు లో నోటిఫికేషన్ ఇవ్వాలని, ఏడాదికి 6500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం

అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

2020-10-21 04:58 GMT

కడప :

కడప పోలీస్ పెరేడ్ గ్రౌండులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినొత్సవం..

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు..

జిల్లాలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఏడుగురు పోలీసు వారియర్లకు నివాళి..

అమరవీరుల స్తూపం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి, నివాళులు అర్పించిన జిల్లా కలెక్టరు హరికిరణ్, జిల్లా ఎస్పీ అన్బు రాజన్ లు..

పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులను సత్కరించిన కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బు రాజన్..

కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎసైలు ఇతర పోలీసు సిబ్బంది..

2020-10-21 04:57 GMT

విజయవాడ

వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ బస్సులు కూడా నడపక పోవటం ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల శాడిజానికి పరాకాష్ట కాదా? - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

పండుగ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య ఈ దసరా పండుగ నుంచైనా ఆర్టీసీ బస్సులు నడపాలి.

రైళ్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తెలంగాణ ఎపీల మధ్య రాకపోకలకై ఆర్టీసీ బస్సులే ఆధారం.

హైదరాబాద్ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా చార్జీలు వసూలు చేస్తున్నాయి.

పండుగల సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాలనుంచి ఏపీలోని స్వస్థలాలకు రావాలనుకున్న వారికి నిరాశ ఎదురవుతున్నది.

- రామకృష్ణ.

Tags:    

Similar News