విజయవాడ-రాజ్ భవన్
శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ వైపు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్.
భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు త్వరలో క్షేమంగా బయటకు వస్తారని గవర్నర్ హరిచందన్ ఆశాభావం వ్యక్తం చేసారు.
Vijayawada Swarna Palace fire Accident: మరోసారి పోలీసులకు కోర్టులో చుక్కెదురు
విజయవాడ: మరోసారి పోలీసులకు కోర్టులో చుక్కెదురు
స్వర్ణప్యాలెస్ ముగ్గురు నిందితుల కష్టడీ పిటీషన్ కొట్టేసిన కోర్టు
పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్సులతో ఫైల్ చేయమని చెప్పిన మేజిస్ట్రేట్
కృష్ణాజిల్లా
- జగ్గయ్యపేట జే.ఆర్.సి కళాశాల సమీపంలో 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
- ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1.5 కేజీల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు....
కృష్ణాజిల్లా:
- నందిగామ(మం) దాములూరు కూడలి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వైరా, కట్టలేరు వాగులు
- నందిగామ , వీరులపాడు మధ్య రాకపోకల కు తీవ్ర అంతరాయం
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం కేతనకొండవద్ద అదుపు తప్పి బోల్తా పడిన అంబులెన్స్....
కృష్ణా జిల్లా :
- ఇబ్రహీంపట్నం కేతనకొండవద్ద అదుపు తప్పి బోల్తా పడిన అంబులెన్స్....
- పాలకొల్లు నుండి కోవిడ్ పేషెంట్ లతో హైదరాబాద్ లో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం..
- ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
East Godavari: పోలవరం ప్రాజెక్టు లోని కాఫర్ డ్యాం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి..
తూర్పుగోదావరి:
- భద్రాచలం నుంచి వస్తున్న వరద నీటితో పోలవరం ప్రాజెక్టు లోని కాఫర్ డ్యాం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.
- 28.66 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం..
- బ్యాక్ వాటర్ రూపంలో దేవీపట్నం మండలాన్ని మరోసారి ముంచెత్తుతున్న వరద గోదావరి..
- గత ఎనిమిది రోజులు గా జలదిగ్బంధంలో ఉన్న దేవీపట్నం మండలం లోని 36 ముంపు గ్రామాలు.
- రెండు రోజుల క్రితం వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న ముంపు గ్రామాల వరద బాధితులు..
- నిన్న రాత్రి నుంచి మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి..
- భయాందోళనలో దేవీపట్నం మండలం లోని వరద బాధితులు..
- జలదిగ్బంధంలో దేవీపట్నం, పోశమ్మ గండి, పూడిపల్లి, తొయ్యేరు, అగ్రహారం, మంటూరు, పెనికెలపాడు, తున్నూరు, రమణయ్యపేట, దండంగి, చిన రమణయ్యపేట, కచ్చులూరు, కొండమొదలు, సహా 36 గ్రామాలు..
- ఎనిమిది రోజులుగా తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులు..
- పునరావాస కేంద్రం లో తప్ప గ్రామాలకు అందని వరద సహాయం, పునరావాస కార్యక్రమాలు..
- వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేవీపట్నం మండలం లో సెక్షన్ 144 విధించిన రంపచోడవరం ఐటిడిఏ పి ఓ ప్రవీణ్ ఆదిత్య..
- బయట వ్యక్తులు ఎవరూ ముంపు గ్రామాలకు వెళ్ళడానికి వీలు లేదని హెచ్చరిక..
- దేవీపట్నం మండలం లో వరద కవరేజీ విషయంలో మీడియా పైన కూడా ఆంక్షలు..
Ananthapur: జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకులు..
అనంతపురం:
- జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకులు.
- హిందూపురం మున్సిపాలిటీ 93వ ర్యాంకు, తాడిపత్రికి 99 ర్యాంకు, గుంతకల్లు 169, ధర్మవరంకు 205 వ ర్యాంకు.
- అనంతపురం నగర పాలక సంస్థ కు 268 వ ర్యాంకు.
- జనాభా 25 వేల నుంచి 50 వేల ఉన్న పట్టణాలలో పుట్టపర్తికి రెండో ర్యాంకు.
Tirumala: శ్రీ వరాహస్వామి జయంతి
తిరుమల:
- శ్రీ వరాహస్వామి జయంతి
- శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహణ
Swarna Palace Incident: స్వర్ణప్యాలెస్ ఘటనలో మూడు కేసులపై విచారణ నేడే
విజయవాడ:
- స్వర్ణప్యాలెస్ ఘటనలో మూడు కేసులపై విచారణ నేడే
- డాక్టర్ రమేష్ ముందస్తు బెయిల్ జిల్లా కోర్టులో
- ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లు జిల్లా కోర్టులో
- డాక్టర్ రమేష్, చైర్మన్ సీతారామ మోహనరావు స్క్వాష్ పిటీషన్ హైకోర్టులో
Vizianagaram: నాటుసార తయారి స్థావరాలపై పోలీసులు దాడి.
విజయనగరం:
- చీపురుపల్లి మండలం, అలజంగి గ్రామ పంచాయతీ, అర్ధివలస గ్రామంలో నాటుసార తయారి స్థావరాలపై పోలీసులు దాడి.
- నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 400లీటర్ల బెల్లం ఊటను ద్వంసం చేసిన చీపురుపల్లి పోలీసులు.