Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-21 01:50 GMT
Live Updates - Page 3
2020-08-21 10:49 GMT

AP High Court: లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

అమరావతి:

- లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

- ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

- గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందన్న హైకోర్టు

2020-08-21 10:19 GMT

Amaravati: ఆదివారం అమరావతి జెఏసి ఆందోళనలకు తెలుగుదేశం మద్దతు

అమరావతి:

- ఆదివారం అమరావతి జెఏసి ఆందోళనలకు తెలుగుదేశం మద్దతు

- రేపటి నిరసనల్లో పాల్గొని అమరావతి రైతాంగానికి సంఘీభావం చెప్పాలి

- రాజధాని 3 ముక్కలాటను, 13 జిల్లాల ప్రజలు నిరసించాలి

- టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు

- రాజధాని 3 ముక్కలాటకు వ్యతిరేకంగా అమరావతి జెఏసి ఆందోళనలు 250రోజుల సందర్భంగా ఆదివారం జెఏసి చేపట్టిన నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది.

- రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అన్నివర్గాల ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొనడం ద్వారా, రాజధానికి వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

- ఈ మేరకు ఆదివారం జరిగే నిరసన కార్యక్రమాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమరావతి రైతులు, మహిళలు, రైతుకూలీలకు సంఘీభావం తెలపాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

- అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించడం, తదితర కార్యక్రమాల్లో 13 జిల్లాల ప్రజలు చురుకుగా పాల్గొనాలని కోరారు.

- రాజధాని 3ముక్కలాట అంశంపై అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని టిడిపి చేసిన డిమాండ్ కు వైసిపి ముందుకు రాకపోవడాన్ని బట్టే, ఆ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాల ప్రజల మద్దతు లేదనేది వెల్లడైంది.

- అన్ని జిల్లాల ప్రజలు ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా రాష్ట్రప్రభుత్వానికి కనువిప్పు కలగక పోవడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి, అభివృద్ది వికేంద్రీకరణలో భాగమే

- అమరావతి అనేది అందరికీ రుజువైంది. ఏది అభివృద్ది, ఏది విధ్వంసం అనేది ప్రతిఒక్కరికీ తెలిసిపోయింది.

- గతంలో రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అన్ని జిల్లాలకు నడిబొడ్డున ఉండాలని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేకనే, రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నానని అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్దంగా ఇప్పుడు వ్యవహరించడం గర్హనీయం.

- రాష్ట్రంలో ప్రజలందరి ఆమోదంతోనే, 13వేల గ్రామాలు, 3వేల వార్డులలో పవిత్ర మట్టి, పుణ్యజలాలను ఊరేగింపుగా తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశామనేది మరిచిపోరాదు.

- యావత్ దేశం, మొత్తం పార్లమెంటు అమరావతికి అండగా ఉంటాయన్న ప్రధాని నరేంద్రమోది వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి.

- కేంద్రం చేసిన చట్టంతో, కేంద్రం నియమించిన కమిటి సిఫారసులతో రాజధానిగా అమరావతి ఎంపిక జరిగింది

- కేంద్రం ఇచ్చిన నిధులతో అమరావతి నిర్మాణం జరుగుతోంది అనేది అందరికీ తెలిసిందే.

- గత ప్రభుత్వాల అభివృద్దిని కొనసాగించాలే తప్ప నాశనం చేయడం గర్హనీయం.

- అభివృద్దిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు.

- రాజధాని 3ముక్కలు చేయడం అభివృద్ది కాదు.

- చేతనైతే అభివృద్దిలో పోటీబడాలి, పోటీబడి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టాలి, 13జిల్లాలను మరింతగా అభివృద్ది చేయాలి.

- అంతే తప్ప ఒకవ్యక్తి మీదో, పార్టీ మీదో, వ్యవస్థ మీదో కక్షతో సమాజాన్ని నాశనం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు సహించరు.

- ఇకనైనా వైసిపి ప్రభుత్వం మొండి పట్టుదల మాని, 3ముక్కలాట చర్యలకు స్వస్తి చెప్పాలి.

- అమరావతి రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి.

- తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కాపాడాలి, రాష్ట్రాభివృద్దికి పాటుబడాలి.

2020-08-21 10:14 GMT

Nara Lokdesh: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

అమరావతి:

- గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి.

- కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం.

- స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాలు లేకుండా చెయ్యడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చెయ్యగలమని సైకో మనస్తత్వంతో జగన్, వైకాపా నాయకులు అనుకుంటున్నారు.

- అది మీ తరం కాదు.

2020-08-21 09:49 GMT

Nara Lokesh: పవర్ హౌస్ ప్రమాద ఘటన పై స్పందించిన నారా లోకేష్‌

అమరావతి: శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

మంటల్లో చిక్కుకొని ఏఈ సుందర్‍నాయక్‍ తో పాటు మరో ఐదుగురు చనిపోవడం బాధాకరం.

వారి మృతి పట్ల సంతాపం.

మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

రెస్క్యూ ఆపరేషన్లో వారు క్షేమంగా బయటకు రావాలని దేవుడ్ని ప్రార్దిస్తున్నాను

2020-08-21 09:39 GMT

తమ్మిలేరు రిజర్వాయర్ లో కొనసాగుతున్న వరద..

ప‌శ్చిమ గోదావ‌రి: నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్ కు కొనసాగుతున్న వరద..

గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు..  

తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 355 అడుగులు..

ప్రస్తుత నీటిమట్టం 348.5 అడుగులకు చేరుకున్న వరద ..

తమ్మిలేరులో ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహం ఇన్ ప్లో 2600 క్యూసెక్కులు..

రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 3 TMC లు కాగా, ప్రస్తుత నీటినిల్వ 1.8 TMC.లకు చేరుకుంది

2020-08-21 09:36 GMT

BJP public warning: బీజేపీ బహిరంగ హెచ్చరిక

అమరావతి: వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో  - ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వంటి మీడియా, షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లపై - బిజెపి పార్టీ, కేంద్ర ప్రభుత్వం, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులకు వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర పార్టీకి తెలిసింది.

నకిలీ వార్తలు, వీడియోలు, పరువు నష్టం కలిగించే విషయాలను పోస్ట్ చేస్తున్న వారందరినీ, ప్రసారం చేస్తున్న వారందరినీ బిజెపి ఈ ప్రకటన ద్వారా హెచ్చరిస్తోంది.

2020-08-21 08:35 GMT

BJP Vishnu Vardhan Reddy fire on TDP: ఇదేం ఏం రాజకీయం ? : విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ

విజయవాడ: విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రా ఉపాధ్యక్షులు

కుల, కుట్ర రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి ఇంకెన్నాళ్లు? ఇంకేన్నేళ్ళు?

తెలుగుదేశంపార్టీఎమ్మెల్యేలు,నేతలు ఆ పార్టీ కార్యకర్తలు ప్రధాని, బిజెపి ఎంపీలు, నేతలపై మాట్లాడే తీరు మూర్చకోండి.

బాబు గారు ఏమో ఓకప్రక్క పోగుతూ లేఖ రాస్తారు .ఇక్కడ తమ్ముళ్ళన తిడుతూ ఉండమంటాడు !  

ఇదేం ఏం రాజకీయమేూ?

గతంలో పత్రికలు, టీవీలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా టి.డి.పి, చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.

ఆంధ్రాలో ప్రతిపక్షంగా మీరు విఫలం. మీరు చేయలేని పని మేం చేస్తున్నాం.

కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారిని, రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారిని,యంపి,జీ వియల్ గారిని కులరాజకీయంగా లక్ష్యంగాచేస్తున్నారా?

మీ విషప్రచారం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ పేరుకేమో జాతీయ పార్టీ. చేసేది వీధిరాజకీయాలు.

బురద కీజకీయాలతో మీరు పనిచేయండి.భారతీయ జనతా పార్టీ బురదలో నుంచి బయటకు వచ్చిన కమలం అనే విషయాన్ని మరిచిపోకండి.

తెలుగుదేశం పార్టీలను ప్రజలు మర్చిపోయారు .పేపర్ పులిగా నిలిచిపోయారు. ఇప్పుడు జూమ్, ట్విట్టర్ లకేపరిమితం అయ్యారు.

మీ పార్టీ ఆవిర్భావ నేత ఎన్టీ రామారావుగారితో మొదలుపెట్టి... 2020 లో కుట్ర రాజకీయాలేనా?

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడిపోతుందో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది.

ప్రతిపక్షనేత రాష్ట్రం వదిలేసి తెలంగాణలోనే ఎందుకున్నారు?

బుచ్చయ్య చౌదరి గారు చంద్రబాబు డైరెక్షన్ లో నడిచి, నిరాధార వ్యాఖ్యలు మాట్లాడి, నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం నాశనం చేసుకున్నారు.

ఇంకా ఆయన అడుగుజాడల్లో నడిచి భళికావడం మీకు అవసరమా?

జి వి యల్ ,గారికి కులకోణంలో క్రిస్టియన్ లతో అంటగట్టారు. నీవు నిరూపించగలవా?

బుచ్చయ్య చౌదరి గారు మీ అగ్రకులదుహంకారంబయ

పెట్టుకున్నారు.

రాజభవనాలు, రాచరిక వ్యవస్థ నుంచి చంద్రబాబు లోకేష్ బయటకు రండి.

ప్రజా సమస్యల పట్ల బిజెపి పోరాటాలను ఆదర్శంగా తీసుకోని పనిచేయండి.

బీసీ ప్రధానమంత్రి పట్ల తెలుగుదేశం నేతల విమర్శలు చూస్తుంటే బీసీలు, చిన్న కులాల పట్ల ఎంత చిన్నచూపో ప్రజలకు స్పష్టమవుతున్నది.

తెలుగుదేశం ఆంధ్రాలో బిజెపి కుంగిపోతుంటే, బీజేపీ విశ్వాసంతో ముందుకు పోతున్నదనే

విషయాన్ని మరిచిపోకండి.

తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి అనధికార వెబ్ సైట్ లు, సామాజిక మాధ్యమాల పేరుతో ప్రచారం ఎందుకు?

ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్ సైట్,లో అధికారిక ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయండి ?

చంద్రబాబు ,లోకేష్ గారు తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని బీజేపీ మీద సామాజిక మాధ్యమాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విషప్రచారం చేస్తారా?

రఘురామకృష్ణరాజు... మీకు వేరే వాళ్ళు చాలా పనులు అప్పజెప్పారు.

ఆ పనుల్లో బిజీగా ఉండండి .

భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఏం చేయాలో మేము చూసుకుంటాం మీరు ఇంకా బిజెపి సలహలు ఇచ్చే స్థాయికి ఎదగలేదు.

గతంలో మాకండువా కూడ కప్పుకున్నారు మరచిపోకండి రాజు గారు

వీలైతే బిజెపి కి కృతజ్ఞతలుగా ఉండండి .

తెలుగుదేశం నేతలు బీజేపీ మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం కి సిద్ధంగా ఉన్నాం.

మీరు సిద్ధమా ?

బీజేపీతో తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు బిజెపితో మీరు ఆడుతున్నది ప్రమాదకర ఆట అనే విషయాన్ని 2009 ఎన్నికల ను గుర్తు తెచ్చుకోని ఆడండి.

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అయితే అధికార పార్టీ వైసీపీని విమర్శించాలి ? బిజెపి మీదబడి ఎడవడం ఎందుకు?

ఆంధ్రలో అసలైన రాజకీయ బిజెపి మొదలుపెట్టింది.మీ విష ప్రచారం భయమే దీనికి ఊతమిస్తున్నాయి బాబుగారు.

మీ విష ప్రచారం,రాజకీయ పద్దతులు మార్చుకోకపోతే మరోసారి ప్రజలే బుద్దిచెబుతారు.

2020-08-21 08:23 GMT

Karnool Hospital: కర్నూలు ఆసుపత్రిలో మంట గ‌లిసిన మాన‌వ‌త్వం

కర్నూలు జిల్లా: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంటకలిసిన మానవత్వం

కోవిడ్ తో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించడానికి 85 వేలు తీసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది...

14 తారీకున ఛాతి నొప్పి తో ఆసుపత్రికి అంబులెన్స్ లో వచ్చిన సాయినాథ్ రావు అనే వెక్తి

ఆసుపత్రికి చేరుకొనే లోపే మృతి చెందిన సాయినాథ్ రావు

హాస్పిటల్ కు తీసుకెల్లి న కొద్దీ నిముషాల్లో నే మీ ఫాథర్ కోవిడ్ తో చనిపోయారు అంత్యక్రియలు చేయాలంటే 85 వేలు ఇవ్వలని డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ మరో ఇద్దరు వెక్తులు

ఆలోచించు కొనే సమయం కూడా ఇవ్వకుoడా ఆస్ట్రేలియా లో ఉన్న కొడుకు ను ఇబ్బంది పెట్టి డబ్బులు వాసూలు చేసిన వైనం

డెత్ సర్టిఫికేట్ లో కార్డియక్ అరెస్ట్ అని డాక్టర్ రేవతి స్లిప్ ఇచ్చిన వైనం

దీన్ని బట్టి చూస్తే కోవిడ్ తో మరనించక పోయిన కోవిడ్ అని చెప్పి 85 వేలు కొట్టేసిన డ్రైవర్లు..

తనకు జరిగిన ఈ అన్యాయం మరొకరికి జరగకూడదని ఆవేదన వెక్తం చేస్తున్న కొడుకు కాంతి కిరణ్

2020-08-21 08:19 GMT

Boat sinks in Godavari: శబరి నదిలో లాంచీ మునక

తూర్పుగోదావరి: చింతూరు శబరి గోదావరి లో నిన్న రాత్రి జరిగిన లాంచీ ప్రమాదంలో గల్లంతైన గోదావరి లాంచి సారంగు పెంటయ్య కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

పెంటయ్య కోడేరు అనే గ్రామం చేరెకున్నారన్న ప్రచారంతో అక్కడి చేరుకుని విచారణ చేస్తున్న చింతూరు సిఐ యువకుమార్..

2020-08-21 08:14 GMT

Srisailam Reservoir Overflows: నిండుకుండలా ‘శ్రీశైలం’

కర్నూలు జిల్లా: శ్రీశైలం జలాశయంలో 10 క్రేస్ట్ గేట్లు

తెలంగాణ పవర్ హౌస్ ప్రమాదానికి గురి కావడంతో ఔట్ ఫ్లో ను పెంచిన శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు

10 క్రేస్ట్ గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి నీటిని విడుదల

ఇన్ ఫ్లో : 4,18,970 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 4,59,254 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

ప్రస్తుత : 883.50 అడుగులు

నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

ప్రస్తుతం : 207.4103 టీఎంసీలు

కుడి జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

Tags:    

Similar News