Live Updates: ఈరోజు (సెప్టెంబర్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-19 02:09 GMT
Live Updates - Page 2
2020-09-19 06:51 GMT

Vijayawada: పాతబస్తీ జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ని అరెస్ట్ చేసిన పశ్చిమ పోలీసులు..

ఉద్రిక్తత నడుమ మహేష్ ని ఆటో లో తరలించిన పోలీసులు..

జనసేన మహిళ నేతలను కూడా అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు..

కోమలవిలాస్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులు..

2020-09-19 06:29 GMT

Maoist posters: విశాఖ‌లో మావోయిస్టు పోస్టర్ల క‌ల‌క‌లం

విశాఖ జిల్లా: పాడేరు. జి మాడుగుల మండలం మద్దిగరువు లో మావోయిస్టు ల వాలపోస్టర్లు .

సెప్టెంబర్ 21 నుండి 27 వరకు 16 వ వార్షికోత్సన్ని విప్లవో త్సాహంతో జరుపుకుందాం.

విప్లవోద్యమం పై ఫాసిస్ట్ పాలకవర్గాలు కొనసాగిస్తున్న సమాధాన్ దాడి నీ దృఢ సంకల్పంతో తిప్పికొడదాం.

నూతన ప్రజాస్వామిక విప్లవం న్ని విజయవంతం చేద్దాం.

సెప్టెంబర్ 13నకా,, జితిన్ దాస్ వర్ధంతి ని రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా జరుపుకుందాం.

విశాఖ ఈస్ట్ డివిజన్ లో గాలికొండ కోరుకొండ పెదబయలు ఈ మధ్య కాలం లో అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి..

విశాఖ ఈస్ట్ డివిజన్ సీపీఐ మావోయిస్టు పేరుతో జి మాడుగుల మండలం మారుమూల మద్ది గరువు గ్రామంలో వెలిసిన వాల్ పోస్టర్లు.

2020-09-19 06:23 GMT

Vijayawada: దసరా ఉత్సవాల‌ ఏర్పాట్లపై సమీక్ష

విజయవాడ: ప్రారంభమైన దేవాదాయశాఖ దసరా ఉత్సవాల‌ ఏర్పాట్లు రివ్యూ  దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి రివ్యూలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు 

- కోవిడ్ నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు, క్యూలైన్ల ఏర్పాటుపై జరగనున్న సమీక్ష 

- ఈసారి తలనీలాలు సమర్పించడం ఏర్పాటుపై నిర్ణయించనున్న మంత్రి

- అన్నదానం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అధికారులతో మంత్రి సమీక్ష 

- సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా, ట్రాఫిక్ నియంత్రణలపైన, పోలీసు డిపార్ట్మెంట్ తో చర్చ

2020-09-19 06:18 GMT

Jana Sena: జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: వన్ టౌన్ లో జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

*దేవాదాయ శాఖ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన

జనసేన పార్టీ నేత పోతిన మహేష్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు*

దుర్గమ్మ రథం పై వెండి సింహాల మాయం ఘటనపై నేడు నిరసనకు పిలుపునిచ్చిన జన సేన

పెద్ద ఎత్తున చేరుకుంటున్న జనసేన కార్యకర్తలు

వారిని అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసులు

2020-09-19 06:13 GMT

Pralhad Joshi : ఏపీలో ఎక్కడా బొగ్గు గని లేదు: ప్రహ్లాద్ జోషి

ఏపీలో ఎక్కడా బొగ్గు గని లేదు. గుర్తించలేదు

ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి కోసం ఒడిశాలోని నౌపారా బొగ్గు గని కేటాయించాం 

చత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని సులియారి బొగ్గు గనులను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించాం 

ఏపీఎండీసీ ఇక్కడ ఉత్పత్తయిన బొగ్గును విక్రయించుకోవచ్చు. 

టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు

(రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గనులు, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లిఖితపూర్వక సమాధానం)

2020-09-19 06:04 GMT

ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడాలి:టిడిపి ఇన్ చార్జ్ నసీర్

గుంటూరు: హిందూ దేవాలయాలపై దాడులను వ్యతిరేకిస్తూ టిడిపి నిరసన ప్రదర్శన.

- తూర్పు నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జ్ నసీర్ ఆధ్వర్యంలో లాలాపేట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిరసన .

- ఆలయం రధాన్ని పరిశీలన.

- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.

- ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడాలి

- లేని పక్షంలో ప్రజా గ్రహానికి గురికాక తప్పదు

2020-09-19 05:57 GMT

BJP YAMINI SHARMA: హిందూ దేవాలయాలపై అన్యమతస్తుల పెత్తనం సహించం: సాధినేని యామినీ శర్మ

తూర్పుగోదావరి : కాకినాడ బాలాత్రిపురసుందరీ అమ్మవారిని దర్శించుకున్న బిజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మ.. 

హిందూ దేవాలయాల పై అన్యమతస్తుల పెత్తనం సహించం..

కాకినాడ ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ గా క్రైస్తవ మతస్తుడిని నియమించే ప్రయత్నం విమరించుకోవాలి..

అన్యాక్రాంతమైన ఎమ్మెఎస్ఎన్ చారిటీస్, అంతర్వేది, పిఠాపురం సంస్థాన భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలి..

దేవుడి సొమ్ము తింటూ దేవాదాయ శాఖ మంత్రి ఇతర మతాల ప్రార్థనలకు వెళ్లడం తీవ్రంగా ఖండిస్తున్నాం..

హిందూ దేవాలయాల పరిరక్షణ కు బిజేపి, జనసేన సహా ఇతర పార్టీలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం..

అంతర్వేది ఘటన లాగే మిగిలిన హిందూ దేవాలయాలు పై జరిగిన అన్ని దాడుల పైనా సిబిఐ విచారణకు ఆదేశించాలి..

2020-09-19 04:46 GMT

Nellore Updates: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ధన్యవాదములు తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు:

- సింహపురి ధాన్యం రైతుల కష్టాలపై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ధన్యవాదములు తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

- ఇది నెల్లూరు జిల్లా రైతులపై మరో నెల పొడిగించడం, నెల్లూరు కోటాను పెంచడం సంతోషదాయకం.

- పెద్దాయన కృషిని జిల్లా రైతాంగం ఎప్పటికీ మరవదు.

- కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రైతులకు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాగానిదే.

2020-09-19 04:45 GMT

Heavy Rains In Prakasam District: జిల్లాలో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.

ప్రకాశం జిల్లా

- పలుప్రాంతాల్లో భారీ వర్షాలు.

- జలకళను సంతరించు కుంటున్న చెరువులు.

- పలు ప్రాంతాల్లో రోడ్లు జళమయం.

2020-09-19 04:42 GMT

Kadapa: మాజీ నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారుడు ఎం. శ్రీరామి రెడ్డి కన్నుమూత...

కడప :

- గత రాత్రి గుండెపోటు తో హైదరాబాద్ లో కన్నుమూసిన శ్రీరామి రెడ్డి...

- నీటి పారుదల శాఖ లో చీఫ్ ఇంజనీర్ గా రిటైరై.. రాష్ట్ర నీటి పారుదల శాఖ లో గౌరవ సలహాదారునిగా సేవలు అందించిన శ్రీరామిరెడ్డి..

- కడప నగరంలో పుష్పగిరి విద్యాసంస్థలు, భారతీయ విజ్ఞాన పీఠం వ్యవస్థాపకుడు శ్రీరామిరెడ్డి..

- ఈయన మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు...

Tags:    

Similar News