Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-19 01:32 GMT
Live Updates - Page 5
2020-08-19 07:24 GMT

తిప్పాపూర్ పంప్ హౌస్ లో జలకళ

రాజన్న సిరిసిల్ల జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టు లోని తిప్పాపూర్ పంప్ హౌస్ లో మరో పంప్ తో నీళ్లు ఎత్తిపోత

తిప్పాపూర్ పంప్ హౌస్ లో మొత్తం మూడు పంప్ లని రన్ చేస్తున్న అధికారులు

ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి మూడు పంప్ ల ద్వారా 8500 క్యూసెక్కుల నీటి ఎత్తిపోత.


2020-08-19 07:21 GMT

కరీంనగర్ పర్యటిస్తున్న సిపిఎం రాఘవులు

కరీంనగర్ : జిల్లాలో పర్యటిస్తున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు

భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరామర్శ

నీట మునిగిన పొలాలని పరిశీలించిన రాఘవులు బృందం

2020-08-19 07:19 GMT

రాయలసీమ ఎత్తిపోతలపై హైకోర్టు విచారణ

టిఎస్ హైకోర్టు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పై విచారణ చేపట్టేందుకు అంగీకరించిన తెలంగాణ హైకోర్టు.

సోమవారం వంశీ చంద్ రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లు లిస్ట్ చేసేందుకు అంగీకరించిన జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు నేతృత్వంలోని బెంచ్

కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించిన ఎపి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది బెంచ్ కు వివరించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది.

ఎపి పునర్విభజన చట్టం సెక్షన్ 84కు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషనర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిందని, శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

సుప్రీంకోర్టు విచారణ తర్వాత సోమవారం విచారణ చేపట్టాలని ఎపి న్యాయవాది కోరారు.

దీంతో కేసును సోమవారం 24.8.2020 లిస్ట్ చేసేందుకు హైకోర్టు అంగీకరించింది.

2020-08-19 07:15 GMT

కామారెడ్డి లో క‌రోనా క‌ల్లోలం

కామారెడ్డి జిల్లా: జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2419 కరోనా పాజిటివ్ కేసుల నమోదు.

కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 28 కాగా 719మంది డిశ్చార్జ్, 1672 యాక్టివ్ కేసులు.  

2020-08-19 07:13 GMT

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కు స్వల్ప వరద

కామారెడ్డి జిల్లా: కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కు స్వల్ప వరద, ఇన్ ఫ్లో 370 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటి మట్టం 458 మీటర్లు

ప్రస్తుత నీటి మట్టం 456.70 మీటర్లు

2020-08-19 07:11 GMT

నిండు కుండలా నిజాం సాగర్‌

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్  ప్రాజెక్ట్ కు 1115 క్యూసెక్కుల వరద నీరు 

పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు

ప్రస్తుతం నీటి మట్టం 1379.74

అడుగులు: 17.8 పూర్తి టి ఎం సి 

ప్రస్తుత టి ఎం సి 1.253

2020-08-19 05:11 GMT

Warangal: ట్రై సిటీస్ లో తగ్గుముఖం పట్టిన వరద.

వరంగల్ అర్బన్..

- ట్రై సిటీస్ లో తగ్గుముఖం పట్టిన వరద.

- రాత్రి నుండి పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుంది.

- 42 కాలనీల్లో 4 వెలమందికి 13 కేంద్రాల్లో పునరావాసం కల్పించిన gwmc అధికారులు.

- నగరంలోని ప్రధాన నాలలపై అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగిస్తున్న అధికారులు.

- అధికారికంగా 137 గుర్తింపు..

- కొనసాగుతున్న ndrf, Drf బృందాల సహాయక చర్యలు.

- మళ్ళీ కురుస్తున్న వర్షానికి అప్రమత్తంగా ఉన్న అధికారులు.

- వరంగల్ లోని శివనగర్, హంటర్ రోడ్ ప్రాంతంలో బురదమయం ..

- హన్మకొండ లోని అమరావతి నగర్ కాలనీ, వివేకా నగర్ కాలనీ, సమ్మయ్య నగర్ కాలనీల్లో బురదమయం..

2020-08-19 05:09 GMT

Kamareddy: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల

కామారెడ్డి :

- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్.

- కోర్సులో చేరేందుకు 2020_21 విద్య సంవత్సరానికి గాను ప్రవేశాలు

2020-08-19 05:08 GMT

Heavy Rains in Kamareddy: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షలు

కామారెడ్డి :

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షలు

గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 39.6 మి.మి.వర్షపాతం నమోదు

అత్యధికంగా బాన్సువాడ లో 38.9 మి.మి.వర్షపాతం నమోదు

ఏడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 443 ఇల్లు పాక్షికంగా దెబ్బతినగా 25 గృహాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.

జిల్లా వ్యాప్తంగా 17 కి.మి అర్ అండ్ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

2020-08-19 05:06 GMT

Road Accident: దామరచర్ల మండలం కొండ్రపోల్ లో లారీ ని డీ కొట్టిన అంబులెన్స్

నల్లగొండ జిల్లా :

దామరచర్ల మండలం కొండ్రపోల్ లో లారీ ని డీ కొట్టిన అంబులెన్స్ ఇద్దరు మృతి, డ్రైవర్ తీవ్ర గాయాలు..

మృతులు నెల్లూరు కి చెందిన కమలకర్ రెడ్డి (48),తండ్రి నందగోపాల్ రెడ్డి(75) గా గుర్తింపు..

తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న తరుణం లో హైదరాబాద్ కి ఆస్పత్రికి తీసుకొని తీసుకోవెళ్తుండగా లారీ ని డీ కొట్టిన అంబులెన్స్ ..

Tags:    

Similar News