Nirmal District: కడెం ప్రాజెక్టు లో బారీగా చేరుతున్న వరదనీరు
నిర్మల్ జిల్లా:
- కడెం ప్రాజెక్టు లో బారీగా చేరుతున్న వరదనీరు
- ప్రస్తుతం నీటిమట్టం 697.000Ft
- ప్రస్తుతం నీటినిల్వ 6.843TMC
- ఇన్ ప్లో: 5463.7 c/s
- అవుట్ ప్లో: 6315.10c/s
- ఒక గెట్ ను ఎత్తి6109 క్యూసెక్కుల
- వరదనీరు బయటకు వదులుతున్నా అదికారులు
కామారెడ్డి :
జుక్కల్. నిజాంసాగర్ మండలం సింగీతం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో ఒక గేట్ ను ఎత్తివేసి425క్యూసెక్కుల నీటిని దిగువన గల నిజాంసాగర్ ప్రధాన కాల్వ లోకి విడుదల చేసిన నీటిపారుదల అధికారులు.
Hyderabad: హైదరాబాద్లో కరోనా వైరస్ వ్యాప్తిపై సంచలన పరిశోధన చేసి సీసీఎంబీ
హైదరాబాద్:
- హైదరాబాద్లో కరోనా వైరస్ వ్యాప్తిపై సంచలన పరిశోధన చేసి సీసీఎంబీ
- మురుగు నీటిలో వైరస్ వ్యాప్తిపై సీసీఎంబీ పరిశోధన
- సీసీఎంబీ అంచనా ప్రకారం హైదరాబాద్లో 6 లక్షల మందికి వైరస్ సోకి ఉండొచ్చు
Taliperu Reservoir: చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్ కు మళ్లీ వరద ఉదృతి..
భద్రాద్రి కొత్తగూడెం:
- చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్ కు మళ్లీ వరద ఉదృతి.
- ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమయిన చత్తీస్‌గఢ్ అటవీప్రాంతం లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రిజర్వాయర్ లోకి భారీగా వరద వచ్చిచేరుతోంది
- దీంతో అప్రమత్తమయిన అదికారులు ప్రాజెక్ట్ కు చెందిన 17 గేట్లను ఎత్తి 74 వేల 870 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.
- ప్రాజెక్ట్ రిజర్వాయర్ లోకి 74 వేల 160 క్యూసెక్కుల వరద వస్తుడటంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
నల్గొండ జిల్లా:
- రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమా విడుదల నిలిపివేత పిటిషన్‌పై తీర్పును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసిన నల్గొండ కోర్టు
Coronavirus: మల, మూత్రాల నుంచి కరోనా వైరస్ విసర్జితమవుతుంది.
- మల, మూత్రాల నుంచి కరోనా వైరస్ విసర్జితమవుతుంది.
- హైదరాబాద్లో మురుగు నీటిని పరీక్షించిన సీసీఎంబీ
- వ్యాధి సోకిన వారి నుంచి సుమారు 35 రోజుల వరకూ విసర్జితాల్లో వైరస్ ఉంటుంది.
- ఈ పరిశీలనల వల్ల నెలరోజుల్లో ఎందరికి వ్యాధి సోకిందో గుర్తించవచ్చు
- హైదరాబాద్లో 1800 మిలియన్ల నీటిలో 40 మురుగు నీటిని శుభ్ర పరుస్తారు
- సీసీఎంబీ, ఐఐసీటీలు కలసి పరిశోధన చేశాయి
- మురుగు నీటిలో వైరస్ ఉంది కానీ, అది శుద్ధి చేసిన తరవాత వైరస్ లేదు
- మురుగు నీటిలో వైరస్ వల్ల వేరే వారికి వ్యాధి రాదు
- ఈ పరీక్షలు 80 శాతం మురుగునీటి కేంద్రాల్లో చేశారు. దాని ఆధారంగా సుమారు 2 లక్షల మందికి వైరస్ వచ్చినట్టు అంచనా.
- n40 శాతం మురుగు నీరే శుద్ధి చేస్తారు కాబట్టి, ఆ ప్రకారం లెక్కిస్తే సుమారు 6.6 లక్షల మంది హైదరాబాదీలకు వైరస్ సోకి తిరిగి కోలుకుని ఉంటారని అంచనా.
- ఈ పరిశోధనలను మెడ్ రెక్సివ్ లో ప్రచురించారు.
- లక్షణాలు లేకుండా ఎక్కువ మందిలో వైరస్ ఉంటోంది.
- వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా సరైన చర్యలు తీసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ అన్నారు
Kamareddy: పిట్లం లో అనుమతి లేకుండా తిరుమల ఆసుపత్రి నిర్వహణ..
కామారెడ్డి :
- పిట్లం లో అనుమతి లేకుండా తిరుమల ఆసుపత్రి నిర్వహణ.
- హాస్పిటల్ లో వైద్య శాఖ అధికారులు తనిఖీలు.
- వైద్యుని వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్ , అనుమతి లేకుండా ల్యాబ్ నిర్వహణ పై ఆగ్రహం.
- ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స చేయవద్దని ఆదేశాలు.
మెదక్;
- తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 28 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా తూప్రాన్ కు చెందిన ఒకే కుంటుంబానికి చెందిన 7గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
నాగర్ కర్నూల్ జిల్లా:
- బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ను విదులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శర్మన్
Leopard: నిర్మల్ జిల్లా తనూర్ మండలం బెళ్తారోడ్ గ్రామంలో శివారులో చిరుతలు...
నిర్మల్ జిల్లా:
- నిర్మల్ జిల్లా తనూర్ మండలం బెళ్తారోడ్ గ్రామంలో శివారులో చిరుతలు....
- గ్రామ శివారులోని పత్తి చెనులో రెండు కుక్కలను తిన్న చిరుతపులి పులియొక్క రెండు పిల్లలు, చెనుకు కావాలి గా కుక్కలు.
- ఉదయం చెనుకు వెళ్లిన రైతులు కుక్కలని తిన్న అనవాళ్లను చూసి భయాందోళనకు గురై ఆడవిశాఖ అధికారులకు సమసారం ఇవ్వగా, కుక్కలని చిరుతలుగా చంపినట్లుగా వెల్లడించిన అడవి శాఖ అధికారులు..