Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-19 01:29 GMT
Live Updates - Page 3
2020-08-19 11:37 GMT

AP Capital Issue: అమరావతి పరిరక్షణ సమితి

విజయవాడ:

- అమరావతి పరిరక్షణ సమితి

- 246 రోజుల నుంచీ సీఆర్‌డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ధర్మపోరాటం‌ చేస్తున్నాం

- మందడంలో దీక్షలు చేస్తున్న మహిళలను పోలీసులతో ఖాళీ చేయించారు

- దీక్షలపై పోలీసులతో ఉక్కుపాదం వేస్తోంది ప్రభుత్వం

- 23వ తారీఖు నాటికి దీక్ష 250 రోజులకు చేరనుంది

- ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు అమరావతి రాజధానిగానే ఉంటుంది

- 250వ రోజు దీక్షను దిగ్విజయంగా జరుపుకుంటాం

- ఈ రాష్ట్రాన్ని, రాజధాని అమరావతిని కాపాడుకుందాం... అనే స్లోగన్ తో దీక్ష చేస్తాం

2020-08-19 11:34 GMT

Amaravati: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై కమిటీ సమావేశం..

అమరావతి:

- 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై కమిటీ సమావేశం.

- తాడేపల్లి లోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయం లో సమావేశం.

- హాజరైన మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు.

- విగ్రహ ఏర్పాటు పై అధికారులతో సమీక్ష.

- ముఖ్యమంత్రి జగ న్ ఆలోచనలకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని మంత్రుల ఆదేశం.

- విగ్రహ ఏర్పాటుకు కేటాయించిన స్వరాజ్య మైదానం స్థలాన్ని ముందుగా స్వాధీనం చేసుకోవాలని అధికారుల్ని ఆదేశించిన మంత్రి సురేష్.

2020-08-19 11:33 GMT

Akhila Priya: కోవిడ్ సెంటర్లకు తరలించడం సరైనది కాదు

కర్నూలు జిల్లా:

- ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కలెక్టర్ కోవిడ్ బాధితులను హోమ్ క్వారంటైన్ రద్దుచేస్తూ ప్రభుత్వ కోవిడ్ సెంటర్లకు తరలించడం సరైనది కాదు... మాజీ మంత్రి అఖిలప్రియ

- కేసులు తక్కువగా ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది...

- అధిక సంఖ్యలో కేసులు ఉన్నపుడు నిర్ణయం ఎంతవరకు సబబు...

- ఆదోనిలో కోవిడ్ బాధితులకు సరైన భోజనాలు వసతి లేక రోడ్డు మీదకు వచ్చి గొడవ చేసిన సంగతి తెలిసిందే...

- కోవిడ్ కి సంబంధించి ప్రతి మండలంలో పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని ప్రభుత్వం త్వరగా చెల్లించాలి...

- ప్రభుత్వం మండలనికి ఒక క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తే కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడకుండా వుంటారు ...

- మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

2020-08-19 11:32 GMT

Kakinada: జిల్లాలో మొత్తం ఈ రోజు 1399 కోవిడ్ కేసులు నమోదు

తు.గో జిల్లా:

కాకినాడ: జిల్లాలో మొత్తం ఈ రోజు 1399 కోవిడ్ కేసులు నమోదు

- కాకినాడ అర్బన్ 218

- కాకినాడ రూరల్ 70

- రాజమండ్రి సిటీ 154

- రాజమండ్రి రూరల్ 89

2020-08-19 11:31 GMT

Peddireddy Ramachandrareddy: పంచాయతీ రాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్

అమరావతి:

- తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలపై జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్

- వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్

- సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ప్రారంభం

- వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ

- మొత్తం 10,63,168 అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు

- కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి

- అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ ద్వారా రవాణా సదుపాయం వుండేలా కలెక్టర్ లు జాగ్రత్తలు తీసుకోవాలి


2020-08-19 11:29 GMT

Amaravati: పశుసంవర్ధక శాఖ లో పనిచేసే సెక్షన్ ఆఫీసర్(52) కరోన తో మృతి.

అమరావతి:

- సచివాలయం లో పశుసంవర్ధక శాఖ లో పనిచేసే సెక్షన్ ఆఫీసర్(52) కరోన తో మృతి.

- హైదరాబాద్ లోని మాలక్ పేట యశోధ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి.

2020-08-19 11:28 GMT

Godavari: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

తూర్పుగోదావరి:

- రాజమండ్రి గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

- 17.75 అడుగులకు తగ్గిన గోదావరి వరద నీటిమట్టం

- 19 లక్షల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి విడుదల

- ఏజన్సీ ,కోనసీమలో లంక గ్రామాలలో కొనసాగుతున్న జలదిగ్భంధం

2020-08-19 09:51 GMT

Illegal Liquor: దాచేపల్లి మండలం పొందుగల వద్ద మద్యం పట్టుకున్న దాచేపల్లి పోలీసులు..

గుంటూరు జిల్లా:

- దాచేపల్లి మండలం పొందుగల వద్ద మద్యం పట్టుకున్న దాచేపల్లి పోలీసులు...

- ఒక టాటా ఏసీ వాహానం లో అక్రమంగా తరలిస్తున్న 1800 క్వార్టర్ బాటిల్స్ పట్టివేత...

- సుమారు 4లక్షల విలువ గల తెలంగాణ మద్యాన్ని పట్టుకున్ని ఇద్దరని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా పోలీసులు

- వాహనం సీజ్ చేసిన పోలీసులు....

2020-08-19 09:40 GMT

High Court Notice Order to Arrest: ఎమ్మెల్యే అరెస్ట్ కు హైకోర్టు నోటీసులు జారీ.

గుంటూరు: ఎమ్మెల్యే మద్దాలి గిరి, అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ.

శంకర్ విలాస్ సెంటర్ లోని డీ బీ ఫ్యాషన్ పై దౌర్జన్యం....

తాళాలు పగలగోట్టి కోటిన్నర సామాగ్రి అపహారణ...

ఫిర్యాదు చేసిన పట్టించుకోని అరండల్ పేట పోలీసులు...

గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన స్పందించని ఎస్పీ...

ఎమ్మెల్యే మద్దాలి గిరి ఒత్తిడి తోనే పోలీసులు మౌనం.

సామాగ్రి అపహరించిన వారికి ఎమ్మెల్యే మద్దాలి గిరి మద్దతు....

తన షాపులో అపహారణ పై హైకోర్టు ను ఆశ్రయించిన బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్... 

ఎమ్మెల్యే గిరితో సహా పోలీసులు, రెవిన్యూ సిబ్బందికి నోటీసులు జారీ.

తన పైన షాపు వారు నా షాపును ఆక్రమించుకుని వేదిస్తున్నారు.

వారికి మద్దతు ఎమ్మెల్యే గిరి అండగా ఉండి ఒత్తిడి చేస్తున్నారు

నా షాపు తాళాలు పగలగోట్టి సామాగ్రి తీసుకెళ్లారు. ..

స్దానిక పోలీసులు పూర్తి సహాకారం తోనే ఇదంతా జరిగింది- బాధితుడు కొప్పురావూరి శివ ప్రసాద్.

2020-08-19 09:32 GMT

Conflict between the two Groups: ఇరువర్గాల ఘర్షణ

తిరుపతి: రూరల్‌ మండలం ఉప్పరపల్లిలో ఇరువర్గాల ఘర్షణ

హథీరాంజీ మఠం భూముల ఎకరా స్థలం కోసం

ఇరువర్గాల మధ్య ఘర్షణ ఘర్షణలో పలువురు గాయపడగా..ఆరు బైకులు ధ్వంసమయ్యాయి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎమ్మార్ పల్లె పోలీసులు

Tags:    

Similar News