Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూర్పుగోదావరి :
మాజీ ఎమ్మెల్యే కొండబాబు పిసి పాయింట్స్..
ఈ ప్రభుత్వంలో స్మార్ట్ సిటి ముంపు సిటిగా మారింది..
వర్షాలు, వరద రావడం సహజం కాని కాకినాడలో వరద నీరు బయటకి వెళ్లకపోవడానికి కారణం ప్రభుత్వమే..
డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచి ముంపు నకు గురి కాకుండా టిడిపి ప్రభుత్వం లో పని చేశాం..
కానీ మడ అడవులను నరికి వేయడం వల్ల ముంపు సమస్య తలెత్తింది..
ఇంతకన్నా పెద్ద తుఫాన్లు సంభవించినప్పుడు కూడా కాకినాడ నగరం ముంపు బారిన పడలేదు..
ఇంటి స్థలాల కోసం కాకినాడకు రక్షణ కవచంగా ఉన్న మడ అడవులను నరికి వేశారు..
మడ అడవులను నరకవద్దని ముందు నుంచి టిడిపి చెప్తునే ఉంది..
స్వప్రయోజనాల కోసం కాకినాడ ను ముంపు నగరంగా మార్చారు..
విశాఖ...
శారదాపీఠంలో ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవములు
దసరా వేడుకలకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర
తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తున్న శారద స్వరూప రాజశ్యామల అమ్మవారి రూపం
లోక కళ్యాణార్థం చండీ హోమం చేపట్టిన విశాఖ శ్రీ శారదాపీఠం
జనావళికి భోగమోక్షములు కలగాలని కాంక్షిస్తూ శ్రీమత్ దేవీ భాగవత పారాయణ
ఈ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ శ్రీ శారదాపీఠం లోగో ఆవిష్కరణ
విజయవాడ
దుర్గమ్మ దేవస్థానంలో ప్రారంభం అయ్యిన దసరా ఉత్సవాలు..
అమ్మవారి దర్శనముకి భక్తుల అనుమతి...
టైమ్ స్లాట్ ప్రకారం భక్తులకు అనుమతి
విశాఖ
3వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఫుట్ పాత్ పై ఉన్న షాపులు తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు
అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యాపారులు
పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమణ లు తొలగింపు
కర్నూలు జిల్లా....
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద
10 గేట్లు 25 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 5,62,850 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 6,02,800 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 884.40 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
ప్రస్తుతం: 211.9572 టీఎంసీలు
కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
విజయవాడ
నేటి నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు
నేడు అమ్మవారు శ్రీ స్వర్ణకావచలంకృత దుర్గాదేవి గా భక్తులకు దర్శనమ్
ఉదయం 9గంటల నుంచి అమ్మవారి దర్శనముకి భక్తులకు అనుమతి
దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోన నిబంధనలు పాటించాలి. మాస్క్ తప్పని సరి.
దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుండి రావాలి.
ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడి ఉంటేనే అనుమతి...
ఆన్లైన్ టికెట్ సమస్యలు ఉన్నా వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఏర్పాటు.
ఈసారి సామూహిక పూజలు రద్దు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి.
విఐపి లకు ఉదయం 7 నుండి 9 వరకు సాయంత్రం 3నుండి 5 గంటలు వరకే అనుమతి
విఐపి లు కూడా ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి..టైం స్లాట్ ప్రకారమే రావాలి
తిరుమల సమాచారం
తిరుమల సమాచారం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 15,397 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 5,126 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.63 కోట్లు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రెండవ రోజు
ఉదయం చిన్నశేష వాహనం పై.
రాత్రి హంస వాహనంపై దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి.