Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-16 01:16 GMT
Live Updates - Page 5
2020-08-16 01:45 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ లో కురుస్తున్న భారీ వర్షాలు

- గత రెండురోజులుగా హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షం

- గత అర్థరాత్రి వరకు ములుగు జిల్లాలో 14 cm, కొమరమ్ భీం లో 11 cm, వరంగల్ లో 8 cm, హైదరాబాద్ లో 5 cm ల వర్షపాతం నమోదు

- మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన

- హైదరాబాద్ నగరంలో ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసిన జిఎచ్ ఎంసీ

2020-08-16 01:45 GMT

పెద్దపల్లి :

- ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కామెంట్స్-

- మంథని నియోజకవర్గం లోని లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తం ఉండాలి ...

- మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచిస్తోంది...

- మంథని నియోజకవర్గంలోని గోదావరి నది , మానేరు మరియు తదితర వాగులు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నాయి...

- అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని మనవి చేస్తున్నాను ...

*👉 నియోజకవర్గంలోని రైతులు మరియు ప్రజలు ఎవరు కూడా చేపలు పట్టడానికి గాని చెరువుల వద్దకు పంట పొలాల వద్దకు ఈ రెండు రోజుల పాటు వర్షాలు తగ్గేంతవరకు వెళ్లవద్దని ప్రకటన...

Tags:    

Similar News