Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-15 01:39 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 15 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి ఉ.06-25 వరకు తదుపరి చతుర్దశి | ఉత్తర నక్షత్రం రా.07-59 వరకు తదుపరి హస్త | వర్జ్యం: రా.01-25 నుంచి 02-55 వరకు | అమృత ఘడియలు ఉ.10-47 నుంచి 11-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-15 07:43 GMT

విజయవాడ...

-ఈ నెల 13న ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో మరికొన్ని కొండ రాళ్లు పడే విధంగా ఉన్నాయి..

-వాటిని తొలగిస్తున్న ఆలయ సిబ్బంది

-భక్తులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఘాట్ రోడ్ లో వాహనాలు నిలిపివేసిన అధికారులు..

-విరిగిన ఇనుప మెష్ తిరిగి ఏర్పాటు చేస్తున్న అధికారులు

2020-10-15 07:35 GMT

అమరావతి..

-పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం, లబ్దిదారులకు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ..

-రాష్ట్రంలో 85 వేలు ఇళ్ల నిర్మాణాలు పూర్తైన ప్రభుత్వం, పేదలకు ఇవ్వడం లేదని వాదనలు వినిపించిన న్యాయవాది..

-ఇప్పటి వరకు ఏపీకీ, కేంద్రం ఎంత వరకు నిధులు కేటాయించింది అని ప్రశ్నించిన హైకోర్ట్..

-ప్రధాని ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలు ఏంటని అడిగిన హైకోర్ట్..

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో అపడవిట్ దాఖలు చేయాలని‌ హైకోర్టు ఆదేశం..

-తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం

2020-10-15 07:27 GMT

అమరావతి..

-కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

-హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌

2020-10-15 07:24 GMT

విశాఖ...

-చోడవరం పట్టణంలోని దుడ్డి వీదిలో కోవిడ్ బాదితుల ఇంట్లో చోరి....

-7తులాల బంగారం,50వేల నగదు అపహరించిన దుండగులు....

-కుటుంబలో‌ఒకరి కోవిడ్ రావడంతో అంతా కేజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు...

-ఈ క్రమంలో దొంగతనానికి పాల్పడిన దుండగులు...

-తలుపులు పగలగొట్టి దొంగతనం చేసిన దుండగులు...

-విషయం తెలుసుకొని పోలీసులకు పిర్యాదు చేసిన ఇంటి యజమాని సత్యనారాయణ....

-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చోడవరం పోలీసు..

2020-10-15 07:21 GMT

విజయవాడ..

-ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఉన్మాది

-నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దివ్య తేజస్విని మెడపై పొడిచిన స్వామి

-తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రికి తరలింపు

-ఆ తర్వాత తనను తాను కత్తితో గాయపరచుకున్న నిందితుడు

-యువతి పరిస్థితి విషమం కావటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

-నిందితుడు పేరు కోటేశ్వర రావు..

-క్రీస్తు రాజపురం లో ఘటన...నిందితుడు పెయింటింగ్ పని చేస్తున్నాడు.

-కొంత కాలం గా తేజస్విని ని ప్రేమ పేరుతో వేధిస్తున్న నిందితుడు కోటేశ్వరరావు

2020-10-15 07:18 GMT

విశాఖ..

-రాజయ్యపేట గ్రామానికి సంభందించిన ఉప్పుటేరు లో చేపలు చనిపోయిన వైనం

-ఉప్పుటేరు చెరువులో 5000 వేల కుటుంబాలు బ్రతుకుతున్నామని మత్స్యకారులు ఆందోళన

-హెటేరో డ్రగ్స్ కంపెనీ పొల్యూషన్ వాటర్ ఉప్పుటేరు చేరువులలో వదలడం వల్ల చేపలు చనిపోయాయి అని మత్యకారులు ఆందోళన

-ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు అని మత్యకారులు ఆందోళన చెందుతున్నారు

2020-10-15 07:15 GMT

అమరావతి....

-ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల.

-ఉద్యోగులకు హెల్త్‌ స్కీం కింద 31.97 కోట్లు విడుదల.

-రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.

2020-10-15 05:53 GMT

విజయనగరం...

-మహారాజ కళాశాలను ప్రైవేటీకరణ చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయం వద్ద నిరసన..

-మాన్సాస్ కార్యలయం వద్దకు వెల్లేందుకు కోట లోపలికి అనమతించని పోలీసులు

-కోటలోకి వెళ్ళేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయుకులను, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.

2020-10-15 05:50 GMT

-విశాఖ జిల్లా...

-వర్షపాతం సెంటీ మీటర్ల లో

-చోడవరం 8.6

-బుచ్చయ్యపేట 8.8

-రావికమతం 7.6

-మాడుగుల 7.1

-దేవరాపల్లి 8.6

-కె.కోటపాడు 10.3

-చోడవరం:

-చోడవరం మండలం లోని గవరవరం వద్ద నిర్మించిన తాత్కాలిక కాజేవే వరద ఉధృతి కి దాదాపు 30 మీటర్ల మేర కొట్టుకు పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది....

-రైవాడ జలాశయం:

-కెపాసిటీ: 114 మీటర్లు

-ప్రస్తుత నీటిమట్టం: 113.80 మీటర్ల కు చేరడంతో జలాశయం నుండి దిగువకు 8842 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు .

-పెద్దేరు జలాశయం:

-గరిష్ట నీటిమట్టం: 137 మీటర్లు

-ప్రస్తుతం నీటిమట్టం: 136.20 మీటర్ల కు చేరడంతో 5204 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు...

-కోనాం జలాశయం..

-జలాశయం లోకి 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అదనపు నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేసిన అధికారులు..

2020-10-15 05:45 GMT

అనంతపురం:

-ఉరవకొండ పట్టణ శివారులో గుంతకల్లు రహదారిపై హంద్రీనీవా పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు.

-కాలువలో నీరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, స్వల్ప గాయాలతో బయట పడ్డ ప్రయాణికులు.

Tags:    

Similar News