Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-15 01:41 GMT
Live Updates - Page 7
2020-08-15 04:36 GMT

74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని..

శ్రీకాకుళం జిల్లా:

- ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కొడాలి నాని..

- వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్..

- ఇంచార్జ్ మంత్రి కొడాలి నానికి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు..

- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శకటాలను పరిశీలించిన మంత్రి..

2020-08-15 04:36 GMT

కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు..

తూర్పుగోదావరి :

- మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్..

- ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం.. జోరు వర్షంలో తడుస్తూనే జెండాను ఆవిష్కరించిన డిప్యూటి సిఎం ధర్మాన..

- వర్షం కారణంగా వివిధ ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు..

- కోవిడ్ కారణంగా పరిమితి సంఖ్యలో హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు..

2020-08-15 04:35 GMT

విజయవాడ: 

- ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన సిఎం జగన్, సీ ఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్..ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు,.వైసీపీ ముఖ్యనేతలు.

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన సిఎం జగన్

- మాస్క్ తో కార్యక్రమానికి హాజరైన సీఎం

- వర్షం కురుస్తుం టే గొడుగు పట్టబోయిన సెక్యూరిటీ ని వద్దని వర్షంలోనే వందనం స్వీకరించిన సీఎం

2020-08-15 04:34 GMT

విశాఖ:

- పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభం అయిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- పతాక ఆవిష్కరణ చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్

- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి బొత్స సత్య నారాయణ, రాజ్య సభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన.

- ప్రధాన ఆకర్షణగా నిలిచిన శకటాలు

2020-08-15 02:00 GMT

మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ:

- మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చనున్న సిఎం జగన్

- ఆ తర్వాత సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించ నున్న ముఖ్యమంత్రి

- ప్రదర్శనలో పది శకటాలు

- కరోనా నేపథ్యంలో జనాన్ని జాగృతం చేసేలా పలు కార్యక్రమాలు రూప కల్పన

- అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించ నున్న సీఎం జగన్

- కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులు

- సాధారణ ప్రజలు, స్కూల్ పిల్లలకు ప్రవేశం లేదు

2020-08-15 01:48 GMT

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

కర్నూలు జిల్లా:

- ఇన్ ఫ్లో : 1,65,746 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో : 42,378 క్యూసెక్కులు

- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

- ప్రస్తుతం : 867.70 అడుగులు

- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు

- ప్రస్తుతం : 132.4436 టిఎంసీలు

- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-08-15 01:47 GMT

కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..

నెల్లూరు: 

- కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..

- వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద రెండు లారీలు స్వాధీనం చేసిన పోలీసులు.

- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.

- నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపినఎస్సై బాజిరెడ్డి

2020-08-15 01:46 GMT

విజయవాడ:

- రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

- కరోనా మహమ్మారిపై మానవాళి త్వరలోనే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు

- శాంతి, అహింస, సంఘీభావం, సోదరభావాన్ని పాటిస్తూ దేశ పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు

- కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు

- బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సామాజికదూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు

2020-08-15 01:45 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..

విశాఖ:

- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం....

- నేటి సాయంత్రం కు తీవ్ర అల్పపీడనం గా మారే అవకాశం..

- మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర లో భారీ వర్షాలు

- తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు

- సముద్రం అలజడి గా వుంటుంది

- మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు...

Tags:    

Similar News