Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-15 01:41 GMT
Live Updates - Page 3
2020-08-15 09:39 GMT

బిజెపి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

గుంటూరు: రాష్ట్ర బిజెపి కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు....

జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ...

ఎంతో మంది మహానుభావుల త్యాగం ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.

గత ఆరు సంవత్సరాలు గా మహత్మా గాంధీ కనిన కలలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాకారం చేస్తున్నారు.

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

కోవిడ్ ప్రభలుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా.

బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

2020-08-15 09:38 GMT

 అనంతపురం : మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలోని తన స్వగృహంలో జెండా ఎగరేసి ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పిల్లలతో కలసి జరుపుకున్న మాజీ మంత్రి రఘువీరా దంపతులు....

2020-08-15 09:36 GMT

సీఎం కార్యాల‌యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం.

హాజరైన ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శులు కె ధనంజయ్‌ రెడ్డి, జె మురళీ, ఓఎస్డీ పి కృష్ణ మోహన్‌ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది.

2020-08-15 09:34 GMT

వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అమరావతి: వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి..

హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలు..

సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు

రాష్ట్ర ప్రజలకు, వైస్సార్సీపీ శ్రేణులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

ప్రపంచాన్ని కరోనా అతకుతలం చేస్తుంది..

కోవిడ్ ను సమర్ధవంతంగా మన రాష్ట్రం ఎదుర్కొంది..

దేశంలో మిగతా రాష్ట్రాలు కంటే మిన్నగా కోవిడ్ నియంత్రణకు సీఎం జగన్ చర్యలు చేపట్టారు..

కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై దేశ విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి..

కోవిడ్ పరిస్థితి ని సీఎం జగన్ ప్రతి రోజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.. సమీక్షలు నిర్వహిస్తున్నారు..

కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు...

సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు..

సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రానికి స్వర్ణ యుగం ప్రారంభమైంది..

గత ప్రభుత్వంరాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ను చిన్న భిన్నం చేసింది..

గ్రామ సచివాలయం వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చారు..

ఏడాది కాలంలో పేదలను అనేక సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఆదుకున్నారు..

జనవరి నుంచి ఇప్పటి వరకు 36 వేల కోట్లు ప్రజలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశారు.

రైతులను, మహిళను అన్ని విధాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారు..

కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు..

రాజశేఖర్ రెడ్డి పాలనకు మూడు నాలుగు రెట్లు సంక్షేమ కార్యక్రమాలు జగన్ పాలనలో ప్రజలకు అందుతున్నాయి..

అభివృద్ధి పధంలో రాష్ట్రాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు..

సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ కుట్రలు కుతంత్రాలు ద్వారా అడ్డుకుంటుంది..

30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకుంది..

త్వరలోనే పేదలకు ఇళ్ళ పట్టాలు అందిస్తాము..

రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఉండకూడదని సీఎం జగన్ భావిస్తున్నారు.

2020-08-15 09:32 GMT

విశాఖ: పుట్టినరోజు సందర్భంగా సింహాచలం అప్పన్న స్వామి ని దర్శించిన దేవాదాయ శాఖ మంత్రి. వెల్లంపల్లి శ్రీనివాస్

2020-08-15 09:31 GMT

సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి

తూ.గో జిల్లా పెద్దాపురంలో 74 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 

సామర్లకోటమున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప....

ప్రభుత్వకార్యలయాలలో అధికారులచే జెండఆవిష్కరణలు..

పాల్గోన్నవైయస్ఆర్ సి పి ఇన్చార్జ్ దవులూరి దొరబాబు తదితరులు

2020-08-15 09:28 GMT

అనంతపురంలో అక్రమంగా మద్యం త‌ర‌లింపు ..ముగ్గురు అరెస్ట్.

అనంతపురం : అక్రమంగా 1020 కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్. రెండు బైక్ లు,కారు స్వాధీనం చేసుకున్న సెబ్ ఆధికారులు.

2020-08-15 09:27 GMT

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

గుంటూరు జిల్లా ; మాచర్ల రెవెన్యూ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పాల్గొన్న పలు శాఖల అధికారులు...

2020-08-15 09:24 GMT

కోవిడ్ వారియర్స్ ను సత్కరించిన మంత్రి కొడాలి నాని.

శ్రీకాకుళం జిల్లా: కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి సత్కారం..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కోవిడ్ వారియర్స్ ను సత్కరించిన మంత్రి కొడాలి నాని..

మంత్రి చేతులు మీదుగా సత్కారా మేమంటోలు తీసుకున్న పలువురు వారియర్స్..

2020-08-15 09:22 GMT

ధవళేశ్వరం వద్ద వ‌ర‌ద ఉధృతి

తూర్పుగోదావరి: ధవలేశ్వరం ఆఫ్టేడ్స్

గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 11.30 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం

9లక్షల 50వేల క్యూసెక్కులకు పైగా బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విదలవుతున్న వరద ప్రవాహం

కోనసీమలో పొంగుతున్న వశిష్ట, వైనతేయ, గౌతమీ గోదావరి పాయలు

బ్యాహా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన లంక గ్రామాలు  

అత్యవసరాలకై బోట్లపై లంకవాసులు రాకపోకలు

జలదిగ్భంధం దేవీపట్నం మండలం

ముంపు గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

దేవీపట్నం ముంపు బాధితులకు రంపచోడవరంలో పునరావాసకేంద్రం...

Tags:    

Similar News