Sangareddy district updates:మంజీరా బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న రైతు కుటుంబం..
సంగారెడ్డి జిల్లా:
- సదాశివపేట మండలం ఏటి గడ్డ సంగం లో మంజీరా బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న రైతు కుటుంబం..
- సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం తో మంజీరా బ్యాక్ వాటర్ తో జలమయమైన ఏటీగడ్డ సంగం గ్రామ శివారు ప్రాంతం..
- మంజీరా బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న రైతు శ్రీనివాస్ రెడ్డి కుటుంబం..
- మొత్తం ఏడు మంది కుటుంబ సభ్యులు
- సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పరిశీలిస్తున్న సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు..
- హెలికాప్టర్, బోట్ల సహాయంతో కుటుంబాన్ని రక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
Moosaram Bagh Bridge updates: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి..
-రెండు వైపులా ఉన్న కొట్టుకుపోయిన ఐరన్ ఫెన్సింగ్
-మూసారాం ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్
-ప్రమాదాల నివారణకు రెండు వైపులా బారికేడింగ్, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె టి ఆర్
loyar maneru dam updates: లోయర్ మానేర్ డ్యాం లోకి భారీగా వరద..
కరీంనగర్ జిల్లా.:
లోయర్ మానేరు రికార్డ్..
-నీటి ప్రవాహం పెరగడంతో 18 గేట్ల ద్వారా 84,036 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.
-ఒక్క మోయతుమ్మెద వాగు నుండే రికార్డ్ స్థాయి లో వరద
-ఈ వానాకాలం లో 6 సార్లు లోయర్ మానేరు గేట్లు ఎత్తిన అధికారులు
-ఈ వర్షాకాలం లో 90 టిఎంసి ల నీళ్లు లోయర్ మానేరు నుండి దిగువకు విడుదల
Hyderabad Weather updates: వాయుగుండం నిన్న ఉదయం తీరం దాటింది..
-రాజరావు వాతావరణ అధికారి @ హైదరాబాద్
-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న ఉదయం తీరం దాటింది..
-అది తెలంగాణ మీదుగా ప్రయాణించడం తో హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి..
-తీవ్ర వాయుగుండం క్రమ క్రమంగా బలహీనపడుతుంది ..
-హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది...
-పశ్చిమ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్,సంగారెడ్డి,మెదక్ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
-తీవ్ర వాయుగుండం తెలంగాణ మీదుగా కర్నాటక, మధ్య మహారాష్ట్ర మరట్వాడ వైపుప్రయనిస్తుంది..
-రాగాల కొన్ని గంటల్లో తెలంగాణ పై దీని ప్రభావం క్రమేపీ తగ్గుతుంది...
Nagarjuna Sagar Dam updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
-18 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
-ఇన్ ఫ్లో :3,45,113 క్యూసెక్కులు
-అవుట్ ఫ్లో :3,3,556 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 309.0570 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.00అడుగులు
Nizamabad updates: ఎం.ఎల్.సి. కవిత నేటి ప్రమాణ స్వీకారం వాయిదా..
నిజామాబాద్ :
-జగిత్యాల ఎం.ఎల్..ఏ. సంజయ్ కుమార్ కు ప్రైమరీ కాంటాక్టు లో ఉండటం తో
-ఐదు రోజుల పాటు హోం క్వారన్ టైన్ .
-క్వారన్ టైన్ పూర్తయ్యాక ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.
Musi River updates: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూసీ నది...
నల్గొండ :
-హైదరాబాద్ తో వర్షాలతో పాటు యాదాద్రి జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షం తో ....మూసీ నదిలోకి భారీ వరద...
-వలిగొండ దగ్గర మూసీ నదిలో కొట్టుకుపోయిన ధాన్యం లారీలు
-నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు దగ్గర బ్రిడ్జ్ మీదుగా ప్రవహిస్తున్న మూసీ నది ...నార్కెట్‌పల్లి మోత్కూర్ మధ్య నిలిచిన రాకపోకలు...
-చౌటుప్పల్ దగ్గర అలుగుపోస్తున్న పెద్ద చెరువు ...చౌటుప్పల్ లో పలు కాలనీలు జలమయం..
Hyderabad updates: పాతబస్తీ చంద్రాయనగుట్ట గౌస్ నగర్ విషాదం...
హైదరాబాద్...
-రెండు ఇండ్లు కూలి 9 మంది మృతి..
-మరో ఇద్దరికి గాయాలు వారిని ఓవైసీ ఆస్పత్రికి తరిలింపు...
-మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు...
-ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసి , పోలీసులు..
-ఏసిపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహయక చర్యలు...
Hyderabad Weather updates: నగరం లో కొనసాగుతున్న కుండపోత వర్షం..
హైదరాబాద్...
-ఇంకా జల దిగ్భందనం లోనే పలు కాలనీలు
-నగరంలో చాలా చోట్ల విద్యుత్ సబ్ స్టేషన్ లలోకి చేరుకున్న నీరు
-దీనితో విద్యుత్ ను నిలిపి వేసిన అధికారులు
-ఇంకా అంధకారంలో నే ఉన్న నగరంలోని పలు ఏరియా లు
Himayat Sagar updates: హిమాయత్ సాగర్ కు భారీగా వస్తున్న వరద నీరు...
-గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదులుతున్న నీరు
-మొత్తం పది గేట్లు ద్వారా నీళ్లు వదులుతున్న అధికారులు
-నీళ్ళ ను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల వాసులు