Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-14 01:46 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-14 18:22 GMT

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

‌భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

దేశభక్తుల నిస్వార్థ త్యాగానికి నిదర్శనమే మన స్వాతంత్ర్య దినోత్సవమన్నారు.

స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన దేశభక్తులను స్మరించుకునే రోజని గవర్నర్‌ చెప్పారు.  

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తామని  గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు. 


2020-08-14 17:50 GMT

కోవిడ్ బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణిస్తుంద‌నే వార్తలు రావడంతో  ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి లోనయ్యారు.

  బాలు ను ఉద్దేశించి ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

'బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...'అంటూ ఇళయరాజా  పిలుపునిచ్చారు.

 ఇద్దరి మధ్య స్నేహ బంధం సినిమాలకు ముందు నిర్వహించిన మ్యూజికల్ కచేరీల కాలం నుంచే మొదలైయ్యిందని గుర్తుచేశారు.

సంగీతం ఇద్దరికీ జీవితం, జీవనోపాధి అయ్యిందన్నారు. గాత్రం, సంగీతం ఒకటిచేరినట్లే...మన ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అలాంటిదేనన్నారు.

ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలున్నా...మనం ఎప్పటికీ స్నేహితులమేనని...ఆ విషయం మన ఇద్దరికీ తెలుసని ఇళయరాజా పేర్కొన్నారు.

నువ్వు తప్పనిసరిగా తిరిగి వస్తావని...తన అంతరాత్మ చెబుతోందని, అది నిజంకావాలని దేవుణ్ని తాను ప్రార్థిస్తున్నట్లు ఇళయరాజా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఇళయరాజా వీడియో సందేశాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 



2020-08-14 17:29 GMT

కరోనా మహమ్మారి బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్తిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయన త్వరగాకోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు.


2020-08-14 17:19 GMT

- కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో నాగరాజు..

- ఏ.ఎస్.రావు నగర్ లో తన ఇంట్లంలో లంచం తీసుకుంటూ దొరికిన నాగరాజు ..

- నాగరాజు ఇల్లు కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

- రాంపల్లి లో ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్లు పెద్ద మొత్తంలో లంచం..

- ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండు న్యూక్లియర్ చేసేందుకు కోటి పది లక్షల లంచం తీసుకున్న నాగరాజ్.

- మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.

- ఎమ్ఆర్ఓ నాగరాజ్ , రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్ ,కన్నడ అంజి రెడ్డి లను అదుపులోకి తీసుకున్న ఎసిబి..

2020-08-14 12:34 GMT

- కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్న 31 మంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలు..

- చంచల్గూడ జైలు నుంచి NSUI కార్యకర్తలు విడుదల అవుతున్న సందర్భంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళిన CLP నేత భట్టి విక్రమార్క, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు..

- 12 తేదీనా ప్రగతి భవన్ ముట్టడించడం తో కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు...

- 14 రోజుల పాటు రిమాండ్ విధించిన 14 వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.

- నిన్న బెయిల్ కు అప్లై చేయడం తో బెయిల్ ఇచ్చిన జడ్జి.

- ఇవాళ విడుదలవుతున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు.

2020-08-14 12:32 GMT

జాతీయం:

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా నెగిటివ్

- త్వరలోనే హాస్పటల్ నుండి డిశ్ఛార్జ్

2020-08-14 11:47 GMT

- కరోనా మహమ్మారి దృష్ట్యా లాక్ డౌన్ సమయం నుంచి మూసివేసిన కాన్సులేట్

- సోమవారం నుంచి ప్రారంభమయ్యే అమెరికన్ కాన్సులేట్ లో అందుబాటులో కి రానున్న విద్యార్థుల, ఉద్యోగ వీసా సేవలు

2020-08-14 11:17 GMT

వనపర్తిజిల్లా :

- వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన సాధీక్ అనే వ్యక్తి పెబ్బేరు దగ్గర ఉన్న కాలవలో ప్రమాదవశాత్తూ పడి మృతి...

- నిన్న నే తన కూతురు వివాహం జరిపించిన సాదిక్...

2020-08-14 11:14 GMT

కామారెడ్డి :

- కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎరువుల దుకాణాలపై ఏకకాలంలో కొనసాగుతున్న దాడులు

- దుకాణాలలో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న వ్యవసాయ అధికారులు

- జిల్లా కేంద్రంలో అధికారుల దాడులతో కొన్ని ఎరువుల దుకాణాలను మూసివేసిన వ్యాపారులు

- రికార్డుల తనిఖీలో అవకతవలలతో జిల్లా కేంద్రంలోని ఒక ఎరువుల దుకాణం హోల్ సేల్ లైసెన్స్ రద్దు చేసిన అధికారులు

2020-08-14 11:09 GMT

జాతీయం:

- రాజస్థాన్ అసెంబ్లీ లో మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్ష నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కార్

- ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు చేసిందని బిజెపి ఆరోపణలు చేసిన అశోక్ గెహ్లాట్

- రాజీ ఫార్ములా ఫలించిన అనంతరం రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో భేటీ అయిన మరుసటి రోజు సచిన్‌ పైలట్‌ శుక్రవారం అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్ పైలెట్

- రాజస్తాన్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గహ్లోత్‌కు దూరంగా విపక్షాలకు దగ్గరగా పైలట్‌కు సీటు కేటాయించడం చర్చనీయాంశం.

- తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై తనదైన శైలిలో స్పందించిన సచిన్ పైలెట్ .

- తనకు బోర్డర్‌లో సీటు కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి రేపుతోందని వ్యాఖ్యలు

- సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని పైలట్‌ వ్యాఖ్య

- రాజస్తాన్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష బీజేపీ ప్రకటించగా, పైలట్‌ రాకతో బలోపేతమవడంతో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గెహ్లాట్

- 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్‌ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు

- ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం

-విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు.

Tags:    

Similar News