Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05
ఈరోజు తాజా వార్తలు
- భూసర్వే చేపట్టడం మంచి పరిణామం ఆస్ట్రేలియా ,ఇజ్రాయిల్ లో చేసిన విధంగా డిజిటల్ లో చేసి రికార్డులు భద్రపరచాలి..
- అసైన్డ్ ,ఇనాం,సీలింగ్ అటవీ భూములలో అనేక సంవత్సరాలు గా కస్థుల్లో ఉంటున్నప్పటికీ రికార్డులో లేవు వాటిని సరిచేసి అర్హులకు ఇవ్వాలి...
- అన్యాక్రాంతమైన చెరువులు కుంటలు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ల్యాండ్ బ్యాంక్ కింద రిజర్వు చేసుకోవాలి...
- మిగిలి ఉన్న సాదాబైనామా ల క్రయ విక్రయాల క్రమబద్ధీకరణ తక్షణమే పూనుకోవాలి...
- అటవీశాఖ రెవెన్యూ శాఖలోని స్వాధీనంలోని భూముల హద్దులు తక్షణమే సరిచేయాలి..
- రికార్డులు తారుమారు చేసిన తప్పులతో నమోదు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి...
- ఎల్ఆర్ఎస్ లో జీవో నెం 58,59 లను ప్రామాణికంగా తీసుకోవాలి..
- ఎక్కడ చూసినా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే..
- ప్రతి రోజు వందల సమస్యలు సీఎం దృష్టి కి రావడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు..
- కొంత మంది తీరు వల్ల ఈ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది అని సీఎం ఆలోచన చేశారు..
- రైతులకే కాదు పేదలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి కొత్త చట్టం వచ్చింది..
తెలంగాణ భవన్:
- దేశంలోనే కొత్త రెవెన్యూ చట్టం తెలంగాణ తీసుకొచ్చింది..
- ఇప్పటికి వరకు ఏ రాష్ట్రం తీసుకురాలేదు..
- భూముల పరిష్కారం కోసం కొత్త చట్టాన్ని సీఎం కేసీఆర్ తెచ్చారు..
- పేదలకు సామాన్యులకు లాభం చేకూరుతుంది..
- రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ చట్టం కోసం మూడేళ్ళుగా కృషి చేసారు సీఎం కేసీఆర్
- రాష్ట్రంలో ఎంతోమంది కి లాభం చేకూరుతుంది..
- దేశం తెలంగాణ వైపు తిరిగి చూస్తుంది..
- వీఆర్ఏ లను రేగులార్ చేస్తామని చెప్పడం బడుగు బలహీన వర్గాల ఉద్యోగులకు భరోసా ఇచ్చారు..
- రాష్ట్ర ప్రభుత్వని ఇస్తేనే నిధులు ఇచ్చినట్లా..? ప్రజలకు ఇస్తే ఇచ్చినట్లు కదా..?
- ఈటెల రాజేందర్ ఒక్కడే కరోన కట్టడికి కష్టపడుతున్నాడు
- కేసీఆర్ కు సచివాలయంపైన ఉన్న దృష్టి కరోన కట్టడిపై లేదు
- ముద్రా లోన్స్, ఆత్మనిర్బర్ భారత్ పథకాల ద్వారా నగదును నేరుగా లబ్ది దారాలు ఖాతాలో జమ చేస్తున్నాం..
- హెలికాప్టర్ మని సాధ్యం కాదు..
- స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు నగదు ముద్రించి ప్రజలకు ఇవ్వలేదు..
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న దేవికారాణి అవినీతి లీలలు.
- రెండు కోట్లు 47 లక్షల రూపాయలు సీజ్ చేసిన ఏసీబీ..
- బినామీల పేరుమీద పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసిన దేవికా..
- సైబరాబాద్ లో కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు ప్రయత్నం..
- బినామీల ద్వారా డబ్బులు బదిలీ చేసిన దేవికారాణి..
- కోటి 29 లక్షల రూపాయలను దేవికారాణి బదిలీ..
- 35 లక్షల రూపాయలు బినామీల ద్వారా బదిలీ చేసిన నాగలక్ష్మి..
- దేవికారాణి డైరెక్ట్ గా 65 లక్షల రూపాయలు బదిలీ..
- దేవికారాణి పై మరో కేసు నమోదు చేసిన ఏసీబీ
నల్గొండ :
-8 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
-ఇన్ ఫ్లో :1,57,613 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :1,57,613 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 311.7462 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులు
ఇంటర్ బోర్డ్..
ఉమర్ జలీల్ ...సెక్రటరీ ఇంటర్మీడియట్ బోర్డ్..
-ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం చర్యలు
-క్వాలిఫైడ్ టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందుబాటులో లేకపోతే 2020- 21 అప్లికేషన్ దరఖాస్తును తిరస్కరిస్తాం
-రెండేళ్ళ ఇంటర్ మీడియట్ కోర్సును అందిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
-నిబంధనలు పాటించని యాజమాన్యానికి తాత్కాలిక గుర్తింపు రద్దు చేయబడుతుంది
నల్గొండ :
-4 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
-ఇన్ ఫ్లో :1,78,220క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :95,220 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 311.4474 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.80
ఇందిరా భవన్..
-సమావేశం లో పాల్గొన్న
-టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ఏఐసీసీ కార్యదర్శులు వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, బలరాం నాయక్, దుబ్బాక నాయకులు.
ఉత్తమ్..
-కాంగ్రెస్ కార్యకర్తల దృఢ సంకల్పంతో క్రమశిక్షణ తో పని చేయాలి...
-దుబ్బాక ఎన్నికలలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించాలి.. గెలుపే ధ్యేయంగా పని చేయాలి.
-కార్యకర్తలకు అండగా ఉంటాము పోరాటం చేయాలి, నిర్మాణాత్మకంగా పని చేయాలి..
-దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..
-టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి టిఆర్ఎస్ నేతలను నిలదీయాలి..
-మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏమయ్యాయి..
-గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అన్ని కమిటీలు పూర్తి చేయాలి.
హైదరాబాద్..పాతబస్తి..
-భర్తను హత్య చేసిన భార్య....
-పెళ్లి జరిగి 20 రోజులు
-పెళ్ళి జరిగిన తర్వాత భార్యను వేధించడంతో విసుగు చెంది రోకలిబండతో భర్తను కొట్టి చంపిన భార్య...
-సంఘటన స్థలానికి చేరుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు...
-చికిత్స పొందుతూ భర్త మృతి.
-పోలీసుల అదుపులో నిందితురాలు..