Amaravati Updates: ఏపీలో అడుగు కదపకుండానే 87 రకాల పోలీస్ సేవలు
అమరావతి
- రాష్ట్రంలోని 964 పోలీస్ స్టేషన్లను అనుసంధానం
- ‘ఏపీ పోలీస్ సేవ’ మొబైల్ యాప్ సిద్ధం
- పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది
- త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం
అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు యాప్ ద్వారా చేసి, రశీదు పొందచ్చు
- దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, వెరిఫికేషన్లు ఈ యాప్ ద్వారా జరుగుతాయి
- ఈ యాప్ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు
- అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేస్తే పోలీస్ కంట్రోల్ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది
- సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే అవకాశం కూడా ఉంది
Chalamalasetty Ramanujaya Death: కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మృతి
అమరావతి
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామానుజయ
- కాపు కార్పొరేషన్ కు తొలి ఛైర్మన్ గా పని చేసిన రామానుజయ
- కరోనా లక్షణాలతో కొద్దిరోజుల క్రితం విజయవాడ జీజీహెచ్ లో చేరిన రామానుజయ
- 4రోజుల నుంచి వెంటిలేటర్ పై వైద్యం అందించిన వైద్యులు
- ఈ ఉదయం ఆసుపత్రిలో నే మృతి చెందిన రామానుజయ
Andhra Pradesh Updates: వ్యాధి నిరోధక టీకాలలో ఏపీ నంబర్ వన్
అమరావతి
- ఏపీలో టీకాలు వేయించుకున్న 97శాతం చిన్నారులు
- 8 రకాల టీకాలు వేయించుకుంటున్న వారు 73.6 శాతం
- దేశంలో టీకాలు వేయించుకుంటున్న వారి సగటు 59.2%
- నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి
- జాతీయ స్థాయిలో 74.2 మంది గ్రామాలలో టీకాల కోసం సబ్ సెంటర్లకు
- పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మంది సబ్ సెంటర్, అంగన్‌వాడీలకు
- టీకాల కోసం దేశంలో 9.1 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు, 2.6 శాతం మంది ఎన్జీవోలకు
- ఏపీలో టీకాలు వేయించుకుంటున్న వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ
Weather Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం.
వాతావరణం:
- ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం...
- అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం..
- దీనిప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు...
- తూర్పు-పడమర గాలుల వల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత..
Rajahmandry Updates: సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు హారతులకు పిలుపునిచ్చిన జనసేన
తూర్పుగోదావరి:
రాజమండ్రి: దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన తెలుపుతూ, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు హారతులకు పిలుపునిచ్చిన జనసేన
- నేటి సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య ఇళ్ళవద్దనే దీపాలను వెలిగించాలని మహిళలకు జనసేన పిలుపు
East Godavari Updates: ఆర్డీవో కార్యాలయాల ఎదుట బిజేపీ -జనసేన ధర్నాలకు సంయుక్త పిలుపు
తూర్పుగోదావరి:
రాజమండ్రి : హిందూ దేవాలయాలపై వరుస దాడులు నిరసిస్తూ జిల్లా కలెక్టరు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట నేడు 12 గంటలకు బిజేపీ -జనసేన ధర్నాలకు సంయుక్త పిలుపు
- అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి రథం దగ్ధం ఘటనలను ప్రశ్నించిన వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
- అరెస్టు చేసిన హిందువులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు పై ధర్నాలో నిరసన తెలపనున్న బిజేపీ -జనసేన
Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
కర్నూలు జిల్లా:
- 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
- ఇన్ ఫ్లో: 1,98,239 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 1,68,000 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.8450 టీఎంసీలు
- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి