East Godavari updates: పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం...
తూర్పు గోదావరి..
-డెలివరీ సమయంలో బిడ్డ మృతి
-మరికాసేపటికి తల్లి చింతలపూడి పూజిత (22) మృతి...
-పూజిత పరిస్థితి విషమంగా ఉందని ఎవ్వరు చెప్పలేదు..
-ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే తల్లి,బిడ్డ మృతి చెందారు...
-బంధువుల ఆందోళన..
-ఆపరేషన్ కోసం రెండ్రోజుల క్రితం గర్భిణిని ఆసుపత్రికి తీసుకొచ్చారు..
-స్కానింగ్ లో బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో నిన్న గర్భిణికి ఇంజక్షన్స్ ఇచ్చాం.
.-24 గంటల తర్వాత ఆపరేషన్ చేయాల్సి ఉంది...
-ఉదయం అకస్మాత్తుగా నొప్పులు రావడంతో నార్మల్ డెలివరీ అయ్యి బిడ్డ మృతి చెందింది
-మరికాసేపటికి పొలమనరి ఎంబాలిజం కండిషన్ తో తల్లి మృతి చెందారు...డాక్టర్లు..
East Godavari updates: కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి - జనసేన నాయకుల ఆందోళన..
తూర్పుగోదావరి :
-ఆందోళన లో పాల్గొన్న జనసేన పిఏసి సభ్యులు పంతం నానాజీ, బిజెపి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్..
-అంతర్వేది ఆందోళన లో జనసేన, బిజెపి నాయకులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్..
-దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ నినాదాలు..
Prakasam-Ongole updates: హిందువులపై ధాడికి నిరసనగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన బీజేపీ జాతీయ యువమోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరీ..
ప్రకాశం జిల్లా..
పురందేశ్వరీ కామెంట్స్..
-అంతర్వేధీ ఘటనలో హిందువులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలి,
-అంతర్వేదీ ఘటనలో ప్రభుత్వం హిందూ దేవాలయాల పరిరక్షనలేదనే భావనతో భక్తులు, పీఠాధిపతులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు.
-ముస్లిం, క్రిష్టియన్స్ యాత్రలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నా హిందువులు మానస సరోవర్ కు కల్పించమని ఏరోజు ప్రశ్రించలేదు.
-హైంధవులు పరమత సహనం పలాటిస్తరని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
-అంతర్వేదీ ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి ఎపీ ప్రభుత్వం ఆహ్వానించడం ద్వారా తాము రక్షణ కల్పించలేమనే విషయం చాటుకున్నట్లు తేలిపోయింది.
-గతంలో టీడీపీ దేవాలయాలను కూల్చినప్పుడు బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదన్న దేవదాయ శాఖమంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను వెన్నక్కి తీసుకోవాలి.
-రథానికి ఉన్న తేనె తెట్టును కాల్చబోయి నింపు అంటుకోవడంతో రధం దగ్ధమైందన్న నిర్లక్షపు సమాదానాన్ని ఈ ప్రభుత్వం చెబుతొంది.
Ongloe updates: ఎంపీ రఘురామ కృష్ణమరాజుపై మంత్రి బాలినేని కామెంట్స్..
ప్రకాశం జిల్లా..
మంత్రి బాలినేని కామెంట్స్,
-ఎంపీ రఘురామ కృష్ణమరాజు ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో..ఏపార్టీలో ఉంటాడో ఎవ్వరికి తెలియదు.
-అతను కూడా వైసీపీపై ఆరోపనలు చేస్తూ అతర్వేధి ఘటనపై మాట్లాడుతున్నాడు.
-చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారాడు.
-జగన్ బొమ్మతో ఎంపిగా గెలిచిన రఘరామ కృష్ణమరాజు దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలనుండి పోటీ చేసి గెలిచి చూపిస్తాడో నిరుపించుకోవాలి.
-ఉచిత విధ్యుత్ నూతన సంస్కరణలపై కావాలనే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నాడు.
-ముపై సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విధ్యుత్ విషయంలో ఎటువంటి డోకాలేదు.
-ఉచిత విధ్యుత్ పథకం విషయంలో కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకునేందుకేనన్న చంద్రబాబు ఇప్పుడు ఉచిత విధ్యుత్ పై మాట్లాడుతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి.
నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
హైద్రబాద్ లో కూర్చోని నీచరాజకీయాలు చేయడం కాదు ప్రజలల్లోకి వచ్చి మాట్లాడాలి.
తండ్రి తెచ్చిన పథకాన్ని సిఎం జగన్ ఎందుకు ఎత్తివేస్తారు.
అందులో లోపాలను సవరించేందుకే ఈ నూతన సంస్కరణలు తెచ్చారు.
గతంలో తనపై 5కోట్ల రూపాయలు అక్రమంగా తరలించానని ఆరోపనలు చేశాడు..విచారణలో ఆ డబ్బు ఎవరిదనేది తేలిపోవడంతో ఇప్పుడు సమాదానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.
East Godavari updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎం.పి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు...
తూర్పుగోదావరి -రాజమండ్రి:
-అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉంది
-రాజోలులో జనసేన రెబల్ ఎమ్మెల్యే ఉండటం వల్లే జనసేన, బి.జె.పి.లు అంతర్వేది రథం ఘటనని రాజకీయం చేస్తున్నాయి
-ఆర్.ఎస్.ఎస్ ద్వారా రాజోలు నియోజవర్గంలో కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారు
-బి.జె.పి మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయి
-సోము వీర్రాజుకి కులాభిమానం ఎక్కువ, చిరంజీవిని సి.ఎం చేయాలనేది ఆయన లక్ష్యం
-దళిత యువకుడికి శిరోమండనం చేయిస్తే సి.బి.ఐతో విచారణ ఎందుకు చేయించడం లేదు
-సి.ఎం జగన్ ఒక్కో కులానికీ, మతానికీ ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటున్నారు
-సి.ఎం జగన్ కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా సీతానగరం శిరోమండనం ఘటనపై కూడా సి.బి.ఐవిచారణ జరిపించాలి
Kadapa updates: సుండుపల్లి మండలంలో వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి...
కడప :
-సుండుపల్లి మండలంలో వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభించి, మహిళలకు చెక్కులను పంపిణీ చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి...
-పాల్గొన్న రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్ నాద్ రెడ్డి, సుండుపల్లి ఇంచార్జ్ మేడా విజయ్ శేఖర్ రెడ్డి, అధికారులు...
Vijayawada updates: మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించే సేవాకార్యక్రమల పోస్టర్ విడుదల చేసిన రావెల కిషోర్ బాబు..
విజయవాడ..
-రావెల కిషోర్ బాబు, బిజెపి ప్రధాన కార్యదర్శి
-ఈ నెల 17వ తేదీ ప్రధానమంత్రి మోదీ జన్మదినం
-ఈ నెల 14 వ తేదీ నుంచి 20 వతేదీ వరకు సేవా వారోత్సవాలు
-కోవిడ్ నిబంఫనలు పాటిస్తూ సేవాకార్యక్రమలు నిర్వహిస్తాం
-మొదటి రోజు రోగులు, పేదలకు పండ్లు, శ్యానిటైజర్స్ పంపిణీ
-రెండో రోజు ఒక్కో బూత్ కు 70 మొక్కలు నాటుతాం
-మూడవ రోజు మోదీ జీవిత చరిత్ర ను 70 వెబినార్ లను నిర్వహిస్తాం
-నాలుగో రోజు రక్తదాన శిబిరం, ప్లాస్మా సేకరణ చేసి కోవిడ్ రోగులకు అందిస్తాం
-ఐదో రోజు దివ్యగులకు అవసరమైన వాహనాలు అందిస్తాం
-చిరవరి రెండు రోజులు పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తాం.
Rajahmundry updates: చలమలశెట్టి రామానుజయ్య మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యాను....ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప,
తూర్పుగోదావరి..రాజమండ్రి:
-తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య మృతి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యాను.
-తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశాక తొలి చైర్మన్ గా రామానుజయ్య ఉత్తమ సేవలందించారు
-ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Visakha-Antarvedi: అంతర్వేది సంఘటన దురదృష్టకరం....అవంతి శ్రీనివాసరావు..
విశాఖ..
-అవంతి శ్రీనివాసరావు కామెంట్స్
-అంతర్వేది సంఘటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు.
-గతంలో చంద్రబాబు సి బి ఐ విచారణ అంటే బయపడేవారు.
-గతంలో రాష్ట్రం లోకి సి బి ఐ రాకుండా జి ఓ జారీ చేశారు.
-అంతర్వేది సంఘటన పై ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సి బి ఐ విచారణకు ఆదేశించారు.
-ప్రజలకు ఇబ్బంది కలిగిచే ఏ విషయం పైనైనా పార్టీలకు, మతాలకు,కులాలకు అతీతం గా చర్యలు తీసుకుంటాం.
-రాజధాని అంశం రాష్ట్ర పరిధి లో ఉన్న అంశం అని కేంద్ర ప్రభుత్వం స్వష్టంగా చెప్పింది.
Ongloe updates: నేడు చీరాలలో వైఎస్ ఆసర కార్యక్రమం..
ప్రకాశం జిల్లా..
-ఒకేవేదికపై పాల్గొననున్నవైసీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కర్ణం బలరాం కుమారుడు వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత,
-ఆమంచి వర్సెస్ కర్ణంల మద్య ఆదిపత్య వర్గపోరు నడుస్తున్న నేపద్యంతో అప్రమత్తమైన పోలీసులు.
-చీరాలలో భారీగా పోలీసుల మోహరింపు.
-ముగ్గరు నేతలను ఆహ్వానించిన చీరాల మున్సిపల్ కమీషనర్.