Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రోక్లోరిక్ యాసిడ్
నరసరావుపేట నుంచి విశాఖపట్నం వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్
లీకైన ట్యాంకర్ నుంచి మరొక ట్యాంకర్ లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను పంపాలని నిర్ణయించిన అధికారులు
విజయవాడ
పొంచి ఉన్న భారీ తూఫాన్
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
మరో రెండు రోజులు ఏపీ కోస్తాప్రాంతం అంతా కురవనున్న వర్షాలు
రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం
లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి
రెవెన్యూ, ఫైర్, రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
తీర ప్రాంతాల జాలర్లు వేటకు వెళ్ళరాదు
తిరుమల
కాలినడకన తిరుమలకు చేరుకున్న టీటీడీ నూతన ఈవో జవహార్ రెడ్డి
శ్రీవారి దర్శనానంతరం 11:30 నుంచి 12 గంటల మద్య ఆలయంలో బాధ్యతలు స్వీకరించనున్న జవహార్ రెడ్డి
అనంతరం వివిధ విభాగాల అధికారులతో అన్నమయ్య భవనంలో సమావేశం
తిరుపతి
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సియం జగన్ ఫోన్
ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఫోన్ లో పరామర్శించి జాగ్రత్తలు సూచించిన సియం
రెండవ సారి కోవిడ్ సోకి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూమన
తిరుమల
శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం
పన్నీర్ సెల్వం.
పన్నీరు సెల్వంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రులు వేలుమణి, సంపత్, సరోజా
స్వామి వారి దర్శనంతరం ఆలయ పెద్ద జీయ్యంగార్ల ఆశీర్వాదం పోందిన పన్నీరు సెల్వం.
అమరావతి
దసరా సందర్భంగానైనా ఆంధ్ర, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలి
కోవిద్-19 కారణంగా 6 నెలలకు పైగా అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు నిలిపి వేయడం జరిగింది.
లాక్ డౌన్ సడలింపుల తదుపరి ఆంధ్ర, తెలంగాణల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు 5 దఫాలుగా అధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదు.
ఆంధ్ర, తెలంగాణల మధ్య ఆర్టీసీ సర్వీసులు లేకపోవడం ప్రైవేట్ ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చేదిగా ఉంది.
👆రామకృష్ణ.
తిరుమల
అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు నడచి వెళుతున్న టీటీడీ నూతన ఈవో కె ఎస్ జవహర్ రెడ్డి
ఇవాళ ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో ఈవోగా భాద్యతలు స్వీకరిస్తారు..
Tirumala: తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 16,130 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 5,821 మంది భక్తులు
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.45 కోట్లు
శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం.
- పన్నీరు సెల్వంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రులు వేలుమణి, సంపత్, సరోజా
- స్వామి వారి దర్శనంతరం ఆలయ పెద్ద జీయ్యంగార్ల ఆశీర్వాదం పోందిన పన్నీరు సెల్వం.