Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-09 00:17 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-09-09 15:51 GMT

తూర్పుగోదావరి: 

- అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌కు బాధ్యతలు అప్పగించారు.

- అంతర్వేదిలో పరిస్థితి పర్యవేక్షించాలని దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది

-. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాలని, కొత్త రథం నిర్మాణం సహా పరిస్థితులు కొలిక్కి తీసుకురావాలని దేవదాయ శాఖ సూచించింది.

- అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఆలయ ఇన్‌చార్జి ఈవో ఎన్‌ఎస్. చక్రధరరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే

- కొత్త ఇవో గా ఎర్రంశెట్టి భద్రాదీజీ నేడు బాధ్యతలు స్వీకరించారు

- ఆలయ సిబ్బందిపైనా చర్యలకు రంగం సిద్ధమైంది.

2020-09-09 15:48 GMT

విజయనగరం:

- నెలల నిండిన గర్భిణిని డోలీపై కొండ దించిన గిరిజనులు.

- శృంగవరపుకోట మండలంలోని దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడ గ్రామానికి చెందిన కస్తూరి దేవుడమ్మకు పురిటినొప్పులు రావడంతో వైద్యం కోసం ఇక్కట్లు

- కుటుంబ సభ్యులు బందువుల సాయంతో డోలీలో పదకొండు కిలోమీటర్ల తీసుకువచ్చి కొండ దిగువనున్న దబ్బగుంట గ్రామం నుండి ఆటలో హస్పలకు తరలించిన కుటుంబ సభ్యులు

- 108 వాహనానికి రెండు గంటలకు పైగా ఫోను చేసి నెట్వర్క్ కలవకపోవడంతో ఆటోలో ఎస్ కోట హస్పటలకు తరలింపు.

2020-09-09 12:15 GMT

విశాఖ..

అవంతి శ్రీనివాస్ పిసి

-వ్యవసాయానికి‌ మీటర్లు బిగించవద్దని‌ కేంద్రానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయరు.

-హిందువుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు

-మాది సెక్యులర్ ప్రభుత్వం...అందరి మత విశ్వాసాలని‌మా ప్రభుత్వం పట్టించుకుంటుంది

-కృష్ణా పుష్కరాలలో చంద్రబాబు ఎన్ని ఆలయాలు పడగొట్టించారో గుర్తు లేదా

-చంద్రబాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది

-పేద రైతులకి ఉచిత విద్యుత్ ని నాడు చంద్రబాబు వ్యతిరేకించారు.

-అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే మూడు రాజధానులు

-అమరావతిని‌ కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలనా రాజధానిగా చేస్తాం..

-పోలీస్ కుటుంబం‌ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పోలీసులపైనమ్మకం లేదనటం దారుణం...

-లోకేష్ ని జైలుకి వెళ్లకుండా చూసుకోమనండి

2020-09-09 11:32 GMT

అమరావతి..

-వందశాతం మేర ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్

-కేంద్రం ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుల అమలు ఏజెన్సీగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్

-ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ షగిలి షన్మోహన్ కు ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా కార్పోరేషన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు

2020-09-09 11:20 GMT

అమరావతి..

-ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ మేనేజ్మెంట్, ల్యాండ్ టైటిలింగ్ మరియు రీసర్వే పై అధ్యయనం చేసి సమస్యలకు సూచనలు చేయనున్న సబ్ కమిటీ

-నలుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు

-కమిటీ సభ్యులుగా డెప్యూటీ సీఎం రెవిన్యూ, ఆర్థిక, ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ మంత్రులు

2020-09-09 11:17 GMT

శ్రీకాకుళం జిల్లా..

-స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

-ప్రజలు ఆదరించి మాకు ఎంతకాలం అధికారం ఇస్తే అంతకాలం ఈ పథకం అమలు జరుగుతుంది..

-మంచిని ప్రోత్సహించే ప్రతిపక్షం దేశంలో కారువైనందుకు బాధగా ఉంది..

-విద్యుత్ ఆదా చేసేలా మీటర్లు ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగకుండా పథకాన్ని ప్రారంభించాం..

-గత ప్రభుత్వం చేసిన 8 వేల కోట్ల బకాయిలు కూడా చెల్లించి ఈ పాలసీ ప్రవేశపెడుతున్నాం..

-ఉచిత విద్యుత్ అనేది వైసిపి ప్రభుత్వం జీవం..ఊపిరి..

-ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని కొనసాగిస్తాం..

-ఉచిత విద్యుత్ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం నుంచి ప్రారంభించడం సంతోషకరం..

2020-09-09 11:13 GMT

కడప :

-రాయచోటి సి.డి.పి.ఓ కార్యాలయంలో 20 వేల మంది బాలింతలకు, పిల్లలకు, గర్భిణీలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్స్ పంపిణీ చేసిన ప్రభుత్వ ఛీప్ విప్   శ్రీకాంత్ రెడ్డి....

-వైయస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ఆరోగ్య రక్ష...

-వైయస్సార్ సంపూర్ణ పోషణ పధకం ద్వారా అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి...

2020-09-09 11:01 GMT

తూర్పుగోదావరి...కాకినాడ...

-14 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని కోరుతూ కళ్యాణ మిత్రలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు   ని కలసి విన్నవించుకున్నారు.

-యూనియన్ జిల్లా నాయకురాలు అరుణ మాట్లాడుతూ తమకు వేతనం రెట్టింపు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని , కానీ కొత్త ప్రభుత్వం   అధికారంలోకి వచ్చాక తమకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

-కళ్యాణమిత్రలు ఉద్యోగం ఉందో...లేదో... తెలీక ఆందోళన చెందుతున్నారన్నారు.

-ఆందోళన చెందవద్దని, ముఖ్యమంత్రి తో మాట్లాడి , సమస్య పరిష్కారం చేస్తాన మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు...

-అంతకు ముందు కళ్యాణ మిత్రలు కలెక్టరెట్ ముందు దర్నా నిర్వహించారు..

2020-09-09 10:48 GMT

శ్రీకాకుళం జిల్లా..

-ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

-వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలని ఉద్దేశ్యం తో రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు..

-దీన్ని కూడా తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు..

-చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు..

-వైఎస్ ఉచిత విద్యుత్ అంటే , తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చంద్రబాబు అపహాస్యం చేశారు..


2020-09-09 10:29 GMT

జాతీయం..

-రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేసిన పరిమల్ నత్వాని

-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా ఉంది

-రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు నా కృతజ్ఞతలు.

-ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి ఎదురు చూస్తున్నాను

Tags:    

Similar News