Live Updates: ఈరోజు (09 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 09 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి ఉ.12-22 వరకు తదుపరి షష్టి | ఆర్ద్ర నక్షత్రం రా.08-24 వరకు తదుపరి పునర్వసు | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు ఉ.09-56 నుంచి 10-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
నగర వ్యాప్తంగా కుండపోత గా కురుస్తున్న వర్షంఉరుకులు, మెరుపులతో కూడిన వర్షం తో పలు చోట్ల విద్యుత్ అంతరాయం
కామారెడ్డి :
జుక్కల్..
-జుక్కల్ నియోజకవర్గం లో ప్రశాంతంగా కొనసాగుతున్న శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్.
-నియోజకవర్గం లో ఓటు హక్కును వినియోగించుకోనున్న 74ఎంపిటిసి సభ్యులు, 6గురు జెడ్పిటిసి సభ్యులు.
నిజామాబాద్..
అర్మూర్...
--అర్మూర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
--క్యాంపు నుంచి నేరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
నిజామాబాద్..
-ప్రాజెక్టు వరద గేట్లు మూసివేత
-ఇన్ ఫ్లో 12303 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 12303 క్యూసెక్కులు
-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.
-నీటి సామర్థ్యం 90 టీఎంసీల
-జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 276 టీఎంసీలు.
-156 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు
హైదరాబాద్...
-ప్రొద్దుటూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండా రెడ్డి కేసు
-పదిహేను మంది అనుచరులతో డ్రిస్టిబ్యూటర్ శివగణేష్ ను బెదిరించిన కొండారెడ్డి
-బెదిరింపుల్లో పాల్గొన్న కొండారెడ్డి గన్ మెన్లు
-ప్రభుత్వ గన్ మెన్లను ప్రైవేట్ సెటిల్మెంట్ కు వాడిన కొండా రెడ్డి
-గన్మెన్లు ఇద్దరిని కడప లో అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పిఎస్ కు తరలింపు
-ఇద్దరు గన్ మెన్లను విచారించనున్న బంజారాహిల్స్ పోలీసులు
-గత నెల 26 న శివగణేష్ ను బెదిరించిన సమయంలోనూ స్పాట్ లో ఉన్న గన్ మెన్లు
-కొండా రెడ్డి గన్ మెన్ల పై ఏపీ పోలీస్ శాఖ సీరియస్
-కొండా రెడ్డి అండ్ గ్యాంగ్ కోసం బంజరాహిల్స్ పోలీసుల గాలింపు
హైదరాబాద్...
-మహిళలకు దసరా సందర్బంగా ప్రతి సంవత్సరం పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
-హైదరాబాద్ లో నేటి నుంచి మొత్తం 30 సర్కిళ్లలో బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభం
-జి హెచ్ ఎం సి లో ఉన్న 1360 FP షాపుల పరిధిలోని మహిళలకు 993 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ద్వారా 15,38,742 మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ
-FP షాపుల ప్రకారం మహిళలందరికి బతుకమ్మ చీరలు
-లబ్ధిదారులైన మహిళలందరికీ ముందుగా కూపన్లు అందజేత
ములుగు జిల్లా..
-మేడారం సమ్మక్క, సరక్కలను బతుకమ్మ చీరలను సమర్పించి మొక్కులు చెల్లించనున్న మంత్రి.
-మధ్యాహ్నం భోజనం అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనున్న మంత్రి సత్యవతి రాథోడ్.
-అనంతరం మహబూబాబాద్ లో రాత్రి బస చేస్తారు.
వరంగల్ అర్బన్...
-మొదటి బతుకమ్మ చీరను భద్రకాళి అమ్మవారికి సమర్పించనున్న మంత్రి సత్యవతి రాథోడ్.
-భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం ములుగు జిల్లాకు బయలుదేరానున్న మంత్రి .
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-23 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 98.10 మీటర్లు
-ఇన్ ఫ్లో 55,900 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 63,900 క్యూసెక్కులు