Live Updates:ఈరోజు (ఆగస్ట్-09) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-08 23:45 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 09 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం షష్టి(మ. 4-36 వరకు) తదుపరి సప్తమి; రేవతి నక్షత్రం (ఉ. 8-23 వరకు), అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-08-09 14:29 GMT

నిషేధిత సిగరేట్లను సరఫరా చేస్తున్న సందీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు....

జిమ్మేరాత్ బజార్ లో గోదాం ఏర్పాటు చెసుకొని సిగరెట్లు నిల్వ ఉంచిన సందీప్....

ఢిల్లీ నుంచి నిషేధిత సిగరేట్లు తీసుకొచ్చి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న సందీప్...

16లక్షల విలువ చేసే సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు...

2020-08-09 12:22 GMT

నల్గొండ : 

- నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

- పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

- ప్రస్తుత నీటిమట్టం : 558.70 అడుగులు.

- ఇన్ ఫ్లో :40 259 క్యూసెక్కులు.

- అవుట్ ఫ్లో : 4458 క్యూసెక్కులు.

- పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

- ప్రస్తుత నీటి నిల్వ : 229.3671 టీఎంసీలు.

2020-08-09 12:20 GMT

- తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి... 

- నేను కరోన తో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న..

- ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది..నేను ఆరోగ్యంగా నే ఉన్న..

- నన్ను కలవడానికి ఎవరు రావొద్దు..నా ఆరోగ్యం విషయంలో ఎవరు ఆందోళన చెందొద్దు..

- మీ ప్రేమ తో మీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి మీ మధ్య కు వస్తాను..

- కరోన వచ్చిన వాళ్ళు అధైర్య పడకుండా స్వచ్చందంగా ముందుకొచ్చి చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న

- రోజు రోజు కి కరోన పెరుగుతుంది..

- తగిన జాగ్రత్తలు తీసుకోండి..

- మాస్క్ లు ధరించాలి..

- ఆరోగ్య సమాచారం పై ఆరా తీసిన మన సీఎం, మంత్రులు అందరికి పేరు పెరున ధన్యువాదాలు..

2020-08-09 08:34 GMT

తుంగభద్ర డ్యాంలో పెరుగుతున్న నీటి మట్టం

- ఇన్ ఫ్లో లక్ష 8 వేల 915 క్యూసెక్కులు

- అవుట్ ఫ్లో 9,357 క్యూసెక్కులు

- పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు

- ప్రస్తుత నీటి నిల్వ 63.102 టీఎంసీలు

- పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు

- ప్రస్తుత నీటి మట్టం 1621.75 అడుగులు

- తుంగ నది నుంచి 70,876 క్యూసెక్కుల వరద

2020-08-09 08:24 GMT

- క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు.

- సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.

- తెలంగాణ రాకముందు కృష్ణా జలాల విషయంలో పనికిరాని విషయాలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టారని మండిపడ్డారు.

- కేసీఆర్‌ తెలంగాణను అప్పుల ఊబిలో పడేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

- కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

- వలస కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్‌ సాయం చేసిందని అన్నారు.

- జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు. 

2020-08-09 06:56 GMT

గాంధీ భవన్: నంది ఎల్లయ్య కు కాంగ్రెస్ పార్టీ సంతాపం..

నందిఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు నందిఎల్లయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

రేపు సోమవారం నాడు సిద్దిపేట, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గాలలో సంతాప సభలు నిర్వహించాలని ఉత్తమ్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూమ్ ఆప్ ద్వారా నందిఎల్లయ్య సంతాప సభ నిర్వహించనున్నామని తెలిపారు.

2020-08-09 06:53 GMT

ఆదిలాబాద్: అడవి బిడ్డలందరికీ.. ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు*

ప్రకృతిని నమ్ముకుని జీవించే అడవి బిడ్డలే ఆదివాసులు...

తరాలు మారినా వారి తలరాతలు మారడం లేదు...

ఆదివాసుల పండుగలన్నీ ప్రకృతి పర్యావరణంతో మమేకమైనవే...

తెలంగాణలో ఆదివాసుల హక్కులు కనుమరుగవు తుండగా..

ఆధునికత ముసుగులో సంస్కృతి సాంప్రదాయాలు క్రమంగా అంతరించి పోయే ప్రమాదం ఉంది..

ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించి ఆదివాసి గిరిజనులకు పూర్తిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా జీవో నెంబర్ 3 ను పకడ్బందీగా అమలుపరచాలి.

. కొమరం భీం ..బిర్సాముండా... సూరు ఆశయాల స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ఆదివాసీలు ఉద్యమించాల్సిన తరుణం ఇది..

.

పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆదిలాబాద్ ఎంపి. సోయం బాపురావు

2020-08-09 06:47 GMT

కొమురం భీం జిల్లా: కౌటల ,చింతలమనేపల్లి, బేజ్జుర్ మండలలో ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకున్న ఆదివాసీ సంఘాల నాయకులు..

చింతలమనేపల్లి మం లోని పోలీస్టేషన్ లో ఆదివాసీ బిడ్డ మెంగరావు ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదివాసుల డిమాండ్.

విధుల్లో తీసుకొని పక్షంలో రాస్తా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చారించిన ఆదివాసీ సంఘాల నాయకులు.

2020-08-09 06:44 GMT

వరంగల్ అర్బన్: హన్మకొండ (డీసీసీ భవన్ ) కాంగ్రెస్ కార్యాలయంలో గ్రూపుల లోల్లి, కారు అద్దాలు, ఆఫీసు అద్దాలు ధ్వంసం,

హన్మకొండ పీఎస్ లో పరస్పరం ఫిర్యాదులు చేసిన నేతలు.

2020-08-09 06:36 GMT

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 248 నమోదైన కరోనా కేసులు.

- వరంగల్ అర్బన్ జిల్లాలో ఈరోజు నమోదు అయిన కరోనా కేసులు 71.

- వరంగల్ రూరల్ జిల్లాలో ఈరోజు నమోదు అయిన కరోనా కేసులు 40.

- మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు నమోదు అయిన కరోనా కేసులు 17.

- జనగామ జిల్లాలో ఈరోజు నమోదు అయిన కరోనా కేసులు 78.

- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు నమోదు అయిన కరోనా కేసులు 21

- ములుగు జిల్లాలో ఈరోజు నమోదు అయిన కరోనా కేసులు 21.

Tags:    

Similar News