Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-08 02:38 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 08 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి ఉ.11-43 వరకు తదుపరి సప్తమి | మృగశిర నక్షత్రం రా.07-18 వరకు తదుపరి ఆర్ద్ర | వర్జ్యం: తె.04-05 నుంచి 05-45 వరకు | అమృత ఘడియలు ఉ.09-55 నుంచి 10-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-00 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-08 12:49 GMT

హైదరాబాద్... 

-నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డి ని విచారించిన ఏసీబీ..

-కస్టడీ అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుండి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన ఏసీబీ..

-14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ చంచల్ గూడ జైలుకు తరలించిన ఏసీబీ...

-నర్సింహారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు , భినామిలను విచారించిన ఏసీబీ..

-నాలుగు రోజుల కస్టడీలో నర్సింహారెడ్డి ఆస్తుల పై కూపీ లాగిన ఏసీబీ..

-హైటెక్ సిటీ లో సర్వే నెంబర్ 64 లో ఉన్న 2 వేల గజాల భూమి తన పదవి అడ్డు పెట్టుకుని దక్కించుకున్నటు తేల్చిన ఏసీబీ..

-2 వేల గజాల భూమి ప్రభుత్వ భూమి గా తేల్చిన ఎసిబి..

-ప్రభుత్వ భూమిని రీజిస్టేషన్ చేసిన రెవెన్యూ అధికారులను విచారించిన ఏసీబీ..

-తన పదవిని అడ్డుపెట్టుకుని నర్సింహారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తుల కూడ బెట్టినట్టు గుర్తించిన ఏసీబీ.

-నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్, తో పాటు పలు హోటల్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించిన ఏసీబీ.

-నర్సింహారెడ్డి ని చంచల్ గూడ జైలు కు తరలించిన ఏసీబీ..

2020-10-08 12:46 GMT

కామారెడ్డి :

-బిచ్కుంద మండలం లోని ఖత్ గావ్ లో ఇసుక మాఫియా కు వ్యతిరేకంగా గ్రామస్థుల ఆందోళన.

-అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టిన గ్రామస్తులు.

-ఇసుక రవాణా ఆపకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక.

2020-10-08 12:43 GMT

సిద్దిపేట జిల్లా.......

-గజ్వెల్ మండలం ధర్మారెడ్డి పల్లి శోభ గార్డెన్స్ లో మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,

-ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సమక్షంలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ లో చేరిక.

2020-10-08 08:29 GMT

జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే


- ప్రజల ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్నాయి


- ధరణి అనే ప్రయివేటు యాప్ తో ఇబ్బందులు వచ్చే అవకాశం


- ఆస్తుల వివరాల సేకరణ లో అనేక అనుమానాలు ఉన్నాయి


- ప్రజలు చెప్తే ప్రభుత్వం వినాలా ?


ప్రభుత్వం చెప్తే ప్రజలు వినాలా ?


- గత ప్రభుత్వాలు కొత్త చట్టం తెచ్చే సమయంలో కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకునేవారు


- ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ పై చట్టం తెచ్చే సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ కమిటీ వేశారు


- ధరణి యాప్ ఆస్తుల వివరాల సేకరణకు ప్రభుత్వం ఎందుకు అభిప్రాయాలు తీసుకోలేదు


- అసెంబ్లీలో మాట్లాడటానికి కాంగ్రెస్ సభ్యులకు సమయం ఇవ్వలేదు


- ధరణి యాప్ ని సంగారెడ్డి ప్రజలు నమ్మడం లేదు


- ప్రజల ఆస్తులపై ప్రయివేటు ధరణి యాప్ అప్పులు తీసుకుంటు0దని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి


- ఇప్పటికే ఆస్తుల వివరాలు భద్రంగా ఉన్నాయి


- దేశంలో ఎక్కడా లేని ధరణి వ్యవస్థ తెలంగాణలో అవసరమా ?


- సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపీస్ అధికారుల వివరాలు ధరణిలో పెట్టి చూపిస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది


- వ్యాపారులు బ్లాక్ మనితో కొన్న ఆస్తులు ఎలా చూపించాలి ?


- ప్రభుత్వం దగ్గర వీటికి ఏమైనా సమాధాన0 ఉందా ?


- ఆస్తుల వివరాలు అడుగుతున్నారు ? అప్పుల వివరాలు ఎందుకు అడగడం లేదు ?


- గడ్డి పోచ తప్పు చేస్తే.... గడ్డి మోపు తగలబెట్టినట్లుంది ప్రభుత్వం తీరు


- ధరణి యాప్ ప్రభుత్వ నిర్ణయంపై భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తే అవకాశం


2020-10-08 08:29 GMT

కామారెడ్డి :


కామారెడ్డి మున్సిపాలిటీలో ఎమ్మెల్సి ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శరత్ కుమార్


ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం


కోవిడ్-19 నిబంధనల ప్రకారం జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు


పోలింగ్ స్టేషన్ల వారిగా ఓటర్ల జాబితా ఇప్పటికే అందజేసాం


సెక్షన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించాం


జిల్లాలో 341 మంది ఓటర్లు ఉన్నారు


ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద మెడికల్ ఆఫీసర్, సిబ్బంది అందుబాటులో ఉంటారు


ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది


పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న కార్యాలయాలకు సెలవు ప్రకటించడం జరిగింది


ఈ ఎన్నికను జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది


మీడియాతో కలెక్టర్ శరత్ కుమార్


2020-10-08 08:28 GMT

ఏసీబీ అప్ డేట్స్......


మల్కాజిగిరి మాజీ ఏసీపీ ని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ..


నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్తుల వివరాలు పై కూపీ లాగుతున్న ఏసీబీ..


మాదాపూర్ కు చెందిన మహిళ పై భారీగా ఆస్తులు పెట్టినట్టు గుర్తించిన ఏసీబీ..


మహిళ పై ఎక్కడెక్కడ ఆస్తులు పెట్టాడు అన్న అంశాల పై నర్సింహారెడ్డి ని విచారిస్తున్న ఏసీబీ.


ప్రస్తుతం మహిళ విదేశాల్లో ఉందన్న గుర్తించిన ఏసీబీ..


హైటెక్ లోని ప్రభుత్వ భూమి పై పలువురు రెవెన్యూ అధికారులను విచారిస్తున్నారు..


నగర శివార్లలో నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ఆధారాలు సేకరించిన ఏసీబీ.


నేటితో పూర్తి కానున్న నర్సింహారెడ్డి కస్టడీ..


కస్టడీ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న ఏసీబీ.


2020-10-08 08:28 GMT

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ...


ఆఫ్రోజ్,మహమ్మద్ అమీర్ ఇద్దరు పాత నేరస్థులు....


ఆఫ్రోజ్ పై వివిధ పోలీస్ స్టేషన్ లలో 16 కేసులు,మహమ్మద్ అమీర్ పైనా గతంలో 3 కేసులు నమోదయ్యాయి....


జైల్ నుండి బెయిల్ పై విడుదలై ఇద్దరు కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి దోపిడీలకు పాల్పడేవారు.


నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ వద్ద బ్యాగ్ లాక్కుని వీరిద్దరూ పారిపోవడం జరిగింది


మహిళ ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యడం జరిగింది.....


వీరి పై రెండు మోటార్ సైకిల్ దొంగతనాలు కేసులు,ఒక బ్యాగ్ లకుని పోయిన కేసులు నమోదయ్యాయి....


2020-10-08 08:28 GMT

వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచన.


జిహెచ్ ఎంసి చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హై కోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది.


దీని కోసం అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.


ఈ విషయంలో రేపు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం.


2020-10-08 08:27 GMT

మినిస్టర్ క్వార్టర్స్ లో హోమ్ మంత్రి ఇల్లు ను ముట్టదించిన సందర్బంగా సంపత్ తో పాటు వందలాది మంది కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి ఘోష మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..


సంపత్ కు ఫోన్ చేసి మాట్లాడిన హోమ్ మంత్రి మహమూద్ అలీ..


దోషులపై చట్ట పరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన హోమ్ మంత్రి..


ఉత్తర్ ప్రదేశ్ ల మారుతున్న తెలంగాణ..


దోషులకు ఉరి శిక్ష వేయాలి. సంపత్..


తెలంగాణ లో శాంతి బత్రతలు పూర్తిగా క్షీణించాయ్..


ఉత్తర్ ప్రదేశ్లో మారిదిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి..


దోషులకు ఉరి శిక్ష వేయాలి.


నిన్న కేసీఆర్ శాంతి భద్రాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి రాష్ట్రం ఆదర్శంగా ఉన్నదని అన్నారు. కేసీఆర్ కు సిగ్గు ఉందా..


మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టిఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేస్కున్నట్టు చిత్రీకరించారు


ఇది ఆదర్శంగా ఉందా..ఖమ్మంలో బాలికపై అత్యాచారం యత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు, ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరమర్శించారా..


ఇదేనా మీ ఆదర్శం.. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది.


హోమ్ మంత్రి రాజీనామా చేయాలి.


దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదు.. సంపత్ కుమార్


2020-10-08 08:26 GMT

(డా. లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ


మోర్చా, జాతీయ అధ్యక్షుడు)


• బీజేపీకి బీసీలు వెన్నుదన్నుగా ఉండబట్టే అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధ్యపడింది.


• ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలను బీజేపీకి చేరువ చేయాలన్నదే లక్ష్యం.


• సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రధాని ఎన్నో పథకాలు తెచ్చారు.


• స్వయంగా ప్రధాన మంత్రే బీసీ వర్గాల నుంచి వచ్చారు.


• అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను చైతన్యపరిచి బీజేపీవైపు తీసుకురావాలన్నదే లక్ష్యం.


• బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించి, ఆ వర్గాల అభ్యున్నతికి పాల్పడింది మోడీ సర్కారు.


• బీసీల్లో కూడా ఫలాలు కొందరికే అందుతున్నాయి.


• మిగతా బీసీ వర్గాలకు కూడా ఫలాలు అందేలా జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు.


• “రోస్టర్ సిస్టమ్” లో మార్పులు తీసుకొచ్చి, అనేక సంక్షేమ పథకాలు బీసీల కోసం అమలు చేస్తున్నాం.


• “కరోనా” సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలను ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చాం.


• బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీలో బీహార్ ఎన్నికలు, తెలంగాణ దుబ్బాక ఉపఎన్నికల గురించి కూడా చర్చించాం.


• లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలు రైతు చట్టాల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.


• టి.ఆర్.ఎస్ కూడా ఇలాగే చేస్తోంది.


• “కిసాన్ అభియాన్” ద్వారా రైతులకు వివరిస్తాం.


• కేసీఆర్ దోపిడీ ఎక్కడ ఆగిపోతుందనే ఉద్దేశ్యంతోనే రైతు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.


• తెలంగాణలో బీజేపీని కూడా అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తాం.


Tags:    

Similar News