Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Guntur district updates: ముప్పాళ్ల మండలం వ్యాపారి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...
గుంటూరు:
-గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంచెందిన వ్యాపారి పుల్లాసాహెబ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ముప్పాళ్ల పోలీసులు...
-ఓ వ్యాపారి దగ్గర రూ.7 కోట్లు డబ్బులు తీసుకోని
-పరారైన పూల్లాసాహెబ్
-నిందితుని కోసం ఆరు రోజులుగా గాలింపు
-పిడుగురాళ్ల లో పట్టుబడ్డ నిందితుడు
-విచారిస్తున్న పోలీసులు
Anantapur district updates: విషాదంగా మారిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం..
అనంతపురం:
-గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన చిన్నారులు.
-మోక్షజ్ఞ(3), శశిధర్(6) అనే ఇద్దరు నిన్న ఉదయం నుంచి అదృశ్యం.
-పిల్లల బాబాయ్ వెంట బయటికి వచ్చిన చిన్నారులు కనిపించక పోవడం తో పోలీసులకు ఫిర్యాదు.
-కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
-ఆస్తి తగాదాలతో రాము అనే యువకుడు ఇద్దరిని చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసే ప్రయత్నం.
-ఓ చిన్నారిని కనేకల్ మండలం సొల్లాపురం వద్ద హంద్రీనీవా కాల్వలో పడేసిన దుండగులు.
-మరో చిన్నారిని ముళ్లపొడల్లో ప్రాణాపాయ స్థితిలో గుర్తించిన పోలీసులు ఆసుపత్రికి తరలింపు.
-నిందితుడు రాము ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-గ్రామం లో విషాద ఛాయలు
Srikakulam updates: జగనన్న విద్యా కానుక కార్యక్రమం..
శ్రీకాకుళం జిల్లా..
-జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురు పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం..
-పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్..
-హాజరైన జిల్లా కలెక్టర్ నివాస్, విద్యా శాఖ అధికారి చంద్రకళ..
Krishna district updates: పునాదిపాడు చేరుకున్న సీఎం జగన్..
కృష్ణాజిల్లా...
-ముందుగా స్కూలులో నాడు-నేడు పనులను పరిశీలించనున్న సీఎం
-అనంతరం జగనన్న విద్యాకానుక ప్రారంభం
-42లక్షలు పైగా విద్యార్ధులకు విద్యాకానుక ద్వారా లబ్ధి
-అదనంగా మరొక 3 లక్షల కిట్లు ఏర్పాటు
-ఏ విద్యార్ధికి అయినా ఒక్క వస్తువు తగ్గినా ఇచ్చేందుకు అదనపు కిట్లు
Gannavaram updates: గన్నవరం డిపోలో అధికారి వేధింపులు..
గన్నవరం..
-గన్నవరం డిపోలో( STI ) సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వేధింపులు
-గత కొంత కాలంగా జరుగుతున్న తంతు
-తన మాట వినని ఉద్యోగులపై దురుసు ప్రవర్తన
-ఉద్యోగపరంగా ఇబ్బందులకు గురిచేస్తున్న STI వీరభద్రరావు నాయక్
-మహిళా కండక్టర్లు అధికారులకు వ్రాత పూర్వకంగా ఫిర్యాదు
Visakha updates: చింతపల్లి మండలం లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు..
విశాఖ....
-విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
-ఏజెన్సీలో ప్రతిరోజు సంతలు జరుగుతుండడంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తనిఖీలు..
-తనిఖీల అనంతరమే మన్యంనకు ప్రధాన ద్వారం అయినా లంబసింగి లోనికి వాహనాలను అనుమతిస్తున్న పోలిసులు
Visakha updates: విశాఖలో పలు స్వీట్స్ షాప్స్ ను తనిఖీలు చేస్తున్న ఫూడ్ ఇనస్పెక్టర్స్..
విశాఖ...
-కోవిడ్ నేపధ్యంలో ఆహర స్వచ్చత పై ఏలాంటి జగ్రత్తలు తీసుకుంటున్నారాని ఆరా తీసిన అధికారులు..
-స్వీట్స్ షాప్స్ నుండి నమూనాలు సేకరిస్తున్న ఆహార తనిఖీ నిపుణల బృందం
Gannavaram updates: గన్నవరం ఆర్టీసీ డిపోలో కీచక పర్వం..
కృష్ణాజిల్లా..
-సూవర్ వైజర్ వేధింపులపై కంప్లైంటు
-ఏకంగా 14 మంది మహిళ కండక్టర్లు దిశా అధికారులకు, ఆర్టీసీ ఎండికి ఫిర్యాదు
-రంగంలోకి దిగిన దిశా అధికారులు విచారణ
Visakha Wheather updates: ఉత్తరాంధ్రకు వాయుగుండం...
విశాఖ...
-రేపు (శుక్రవారం) తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.
-ఇది అతి వేగంగా ప్రయాణిస్తూ మధ్యబంగాళాఖాతంలోకి వచ్చేసరికి పదో తేదీకి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా...
-ఈనెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్రలో, దక్షిణ ఒడిసాకి సమీపంగా తీరం దాటుతుందని అంచనా..
-దీని ప్రభావంతో రేపటినుంచీ కోస్తాంధ్రలో వర్షాలు...
-తీరందాటే పదకొండో తేదీన అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం..
-తెలంగాణ రాయలసీమల్లో కూడా ఈ వాయుగుండం ప్రభావంతో రేపటినుంచీ వర్షాలు..
-సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.. కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. వెళ్లినవారు రేపటికల్లా తిరిగి రావాలి
Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
అమరావతి..
-ఈఎస్ఐ స్కాంలో టిడిపి నేత అచ్చెన్నాయుడు గారిని కక్షసాధింపులో భాగంగా ఇరికించారని మేము మొదటినుండి చెబుతూనే ఉన్నాం.
-ఇప్పుడు స్వయంగా మంత్రి జయరాం గారే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారిని ఇరికించా అని అంగీకరించారు. బెంజ్ మంత్రి గారి పేకాట మాఫియా, ఈఎస్ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టాం.మరి చర్యలెక్కడ జగన్ రెడ్డి గారు?