Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
విజయనగరం జిల్లా: దత్తిరాజేరు మండలం కె కొత్తవలసలో జరుగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి
.
38 వేల రుపాయలు నగదుతో పాటు 19 మంది పేకాటరాయుళ్ళను అదుపులోకి తీసుకున్న భూర్జవలస పోలీసులు .
కర్నూలు జిల్లా: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఎస్ఐ శ్రీనివాసులు ఆద్వర్యంలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం.
938 మద్యం బాటిళ్లు, రెండు బిందెలు నాటుసారా , ట్రాక్టర్, రెండు బైక్ లు స్వాధీనం,
నలుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్నూల్: డోన్ స్మశానం లో మృతి చెందిన వారి మృతదేహాలను పీక్కుతింటున్న పందులు.
కరోనా వైరస్ ప్రబలుతున్న వేల తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్న డోన్ వాసులు
స్మశానం పరిసరాల్లో రైతులు పంటలు వేసుకొని జీవనం తాజా పరిస్థితి తో తీవ్ర ఆందోళన...
కర్నూల్: గోనెగండ్ల మండలం నెరుడుప్పల గ్రామం లో గత నెల 28 న దళిత పెద్ద అంజినయ్య గుడిసె తొలగింపు.
గత పదిరోజులుగా దళితులకు న్యాయం చేయడం లేదని గోనెగండ్ల పొలుసు లను ఆశ్రయించిన దళిత నాయకులు.
దళితుల పట్ల SI నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలీసు స్టేషన్ ముందు దళిత నాయకుల నిరసన.
ఫిర్యాదు వ్రాస్తుండ గా ...దళిత నాయకులకు, సివిల్ డ్రస్ లో ఉన్న కానిస్టేబుల్ మధ్య వాగ్వివాదం.
నేను దళితుడినే నన్నెమే చేసుకోలేరు అంటున్న కానిస్టేబుల్ తో వాగ్వివాదం
దీంతో పరిస్థితి ఉద్రిక్తం.. తోటి సిబ్బంది సర్దిచెప్పడంతో సద్దుమణిగిన వివాదం
పూర్తి వివరాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని దళిత నేతలు
విశాఖ : పాయకరావుపేట వై జంక్షన్ వద్ద స్కూటీపై 35 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. వ్యక్తి అరెస్ట్ , గంజాయి, స్కూటీ స్వాధీనం . కేసు నమోదు.
అమరావతి: అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తివేతకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
గత ప్రభుత్వంలో సీఆర్డీఏ పరిధిలో నాలుగు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు.
మందడం, తుళ్ళూరు, అనంతవరం, ఉండవల్లి గ్రామాలలో ఆఫీసులు ఏర్పాటు.
కొంతకాలంగా రిజిస్ట్రేష న్లు జరగకపోవడం తో ఏమాత్రం ఆదాయానికి నోచుకోని కార్యాలయాలు
దీంతో కార్యాలయం మూసి వేతకు ప్రభుత్వ యోచన. లో
అనంతపురం : గుంతకల్లు మండలపరిధిలోని ప్రముఖ దేవాలయం కసాపురం శ్రీ నెట్టికంటిఆంజనేయస్వామి దేవస్థానంలో పది మందికి కరోనా పాజిటివ్..
నేటి నుండివారం పాటు ఆలయం మూసివేత,
15వ తేదీన శానిటేషన్ తరువాత ఆలయ తలుపులు తెరుస్తామన్న అధికారులు.
తూర్పుగోదావరి :
- రావులపాలెం మం. గోపాలపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
- పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొన్న కారు.. ఒకరు మృతి ముగ్గురికి గాయాలు
- కొత్తపేట మం. మోడేకుర్రు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వివాహానికి వెళ్తున్న పెళ్లి బృందం..
తూర్పుగోదావరి:
- అన్నవరం: ఈ నెల 9 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు సత్యదేముని ఆలయంకు భక్తుల అనుమతి నిషేధం.
- దేవస్థానం ఉద్యోగులకు అధికంగా 29 మందికి కరోనా.పాజిటివ్..
- ఇటీవల దేవస్థానం ఉద్యోగులకు 10 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ దరిమిలా దేవస్థానంలో వివిధ విభావాలలో పనిచేసే 300 మంది సిబ్బందికి నేడు కోవిడ్ 19 పరీక్షలు.
తూర్పుగోదావరి :
- పి.గన్నవరం అంబాజీపేట మం. చిరతపూడిలో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- సుమారు రూ. 30వేలు విలువైన 180 క్వార్టర్ బాటిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అమలాపురం రూరల్ పోలీసులు..