Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
తిరుమల...
-తిరుమలలో వివిధ ప్రాంతాలలోని అతిథి భవనాలను కాటేజి డోనేషన్ స్కీమ్ కింద టెండర్లు దాఖలు చేసిన దాతలకు కేటాయింపు ఖరారు
-గతంలో అతిథి భవనాలు నిర్మించిన దాతలకు నిర్థారించిన కాల పరిమితి ముగియడంతో టెండర్లు ఆహ్వానించిన టీటీడీ
-శ్రీపతి విశ్రాంతి భవనమునకు రూ. 7.11 కోట్లతో ( 7 కోట్ల 11 లక్షలు) హైదరాబాద్‌కు చెందిన ఫోనిక్స్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్,
-విద్యాసదన్ విశ్రాంతి భవనమునకు రూ. 7.89 కోట్లతో ( 7 కోట్ల 89 లక్షలు) హైదరాబాద్‌కు చెందిన జూపల్లి శ్వామ్‌రావు,
-స్నేహలత విశ్రాంతి భవనమునకు రూ. 7.87 కోట్లతో ( 7 కోట్ల 87 లక్షలు) చెన్నైకి చెందిన పిచమ్మై ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్,
-కారమ్ నివాస్ విశ్రాంతి భవనమునకు రూ. 6.8 కోట్లతో ( 6 కోట్ల 80 లక్షలు) హైదరాబాద్‌కు చెందిన భూదాతి లక్ష్మీ నారాయణ,
-వకుళా విశ్రాంతి భవనమునకు రూ. 6.5 కోట్లతో ( 6 కోట్ల 50 లక్షలు) ముంబాయికి చెందిన రాజేష్ శర్మ .
-గంబెల్ విశ్రాంతి భవనమునకు రూ.5.99 కోట్లతో ( 5 కోట్ల 99 లక్షలు) చెన్నైకి చెందిన శ్రీమతి ఎస్.భాగ్యశ్రీ
-శ్రీనికితన్ విశ్రాంతి భవనమునకు రూ. 5.98 కోట్లతో ( 5 కోట్ల 98 లక్షలు 50 వేలు) హైదరాబాద్‌కు చెందిన శరత్ చంద్ర రెడ్డి
-గోదావరి విశ్రాంతి భవనమునకు రూ. 5.5 కోట్లతో ( 5 కోట్ల 50 లక్షలు) హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్
-లక్ష్మీ నిలయం విశ్రాంతి భవనమునకు రూ. 5.25 కోట్లతో ( 5 కోట్ల 25 లక్షలు) ముంబాయికి చెందిన అఫ్‌కాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్
-బాలాజి కుటిర్ విశ్రాంతి భవనమునకు రూ. 5 కోట్లతో ( 5 కోట్ల 11 వేలు) హైదరాబాద్‌కు చెందిన ఓం ప్రకాష్ అగర్వాల్
-శాంతి సదన్ విశ్రాంతి భవనమునకు రూ. 5 కోట్లతో బెంగుళూరుకు చెందిన ఎమ్.ఎస్.రక్షరామయ్య, ఎమ్.ఎస్. సుందర్ రామ్
-టీటీడీ అధికారులు టెండర్లు ఖరారు చేశారు
జాతీయం..
డి కె అరుణా బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు...
-ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పతకం గురుంచి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమి మాట్లాడలేదు
-రాష్ట్ర ప్రజలు అందరూ ఈ విషయం గురుంచి ఎదురుచుసారు
-రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలను మరోసారి మోసము చేస్తున్నాడు
-దక్షిణ తెలంగాణ రైతులెనోట్లో మట్టి కొడుతున్నాడు
-కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు
-పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నిధులు లేవని చెవుతున్నావు ఎలా మళ్ళీ కొత్తది ప్రాజెక్టు కడుతావు
-పాలమూరు, రంగారెడ్డి ప్రజలపైన చిత్తశుద్ధి లేదు కేసీఆర్ కి
-రాయలసీమ ప్రాజెక్టు ముందస్తుగా మద్దతు ఇచ్చావు
-ఆంధ్రప్రదేశ్ అదనంగా 8 టి ఎమ్ సిల నీళ్లను తీసుకపోతున్నది
-ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఓ పంపలేదు
-దొంగలు దొంగలు కలిసినట్టు కాంట్రాక్టర్లతో జతకట్టి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
-30000 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లపైగా వ్యయం పెంచాడు
-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డతో కేసీఆర్ కి లోపాయకారి ఒప్పందం ఉంది
-599 టి ఎమ్ సీల నీళ్ల వాటా మనకు రావాల్సి ఉంది... కానీ ప్రస్తుతం 299 టి ఎమ్ సిల నీళ్లు మాత్రమే వస్తున్నాయి
విశాఖ..
-గీతం వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ కామెంట్స్...
-సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాం.
-123 కాలేజీలకు యూ జీ సీ ఇచిన యూనివర్సిటీ హోదా రద్దు చేయడం అవాస్తవం.
-గీతం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకొనే సమయం.
-ఇలాంటి సమయంలో ఈ యూనివర్సిటీ పై ద్రుష్పచారం చేయడం కరెక్ట్ కాదు.
అమరావతి..
ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు..
-జగన్మోహన్ రెడ్డి ప్రధానితో ఏం చర్చించారని ప్రజలంతా అనుకుంటున్నారు.
-40 నిమిషాలపాటు వారిద్దరూ ఏం చర్చించారో, ముఖ్యమంత్రి బయటకు చెప్పకపోతే ఎలా?
-జగన్ తోకముడిచుకొని వెనక్కురావడం చూస్తుంటే, రాష్ట్రానికి నయాపైసా ప్రయోజనం జరిగే అంశాలేవీ, ఆయన ప్రధానితో చర్చించినట్టుగా లేడనిపిస్తోంది.
-ముఖ్యమంత్రి తనపై ఉన్న 31 కేసులు గురించే మోదీతో చర్చించారా?
-ముఖ్యమంత్రి పదవితో వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ, కేసులు మాఫీ చేయించుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారా...?
-రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేకహోదా గురించి, పునర్విభజన చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదు..?
-కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా తెస్తాడనే, యువత జగన్ కు ఓట్లేశారు.
-రాష్ట్రప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టేలా జగన్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి.
-అధికారం ఇచ్చింది ప్రతిపక్షంపై కక్షసాధించడానికో, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడానికో కాదనే నిజాన్ని జగన్ గ్రహించాలి.
-వైసీపీ ఎంపీలు హోదాసహా, ఇతర అంశాలపై కేంద్రంతో పోరాడటానికి ముందుకొస్తే, వారికి టీడీపీ ఎంపీలు ఎప్పుడూ అండగా ఉంటారు.
తిరుమల..
-అక్టోబరు 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
-నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 15 నుండి 24వ తేదీ వరకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం
-ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి
అనంతపురం:
-కదిరి ( మ) చిప్పల మడుగు పోస్ట్ ఆఫీస్ లో ఇంచార్జ్ పోస్ట్ మాస్టర్ గంగాధర్ చేతివాటం,
-ఖాతాదారులు కట్టిన రూ. 5 లక్షల పైగా స్వాహా.
-కట్టిన డబ్బులు తమ అకౌంట్లో జమ చేయాలని పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన ఖాతాదారులు.
-పత్తాలేకుండా పోయిన ఉద్యోగి గంగాధర్..
కృష్ణాజిల్లా..
-గుడివాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జూనియర్ అసిటెంట్ కు కరోనా పాజిటివ్
-ఆగని రిజిస్టేషన్లు భయందోళనలో ఆఫీస్ సిబ్బంది, కక్షి దారులు
-శానిటేషన్ కూడా చేయని రెవెన్యూ అధికారులు
విజయవాడ..
-దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన పాలకమండలి సభ్యులు
-దసర ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ బాబు
-సోమినాయుడు దుర్గగుడి ఛైర్మన్, ఈవో సురేశ్ బాబు
-37 అంశాలు సమావేశంలో చర్చించాం
-17 నుండి 25 వరకు దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించాం
-ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తాం
-ఆరడుగులు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం
-మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు
-మూల నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కలెక్టర్ అనుమతితో ఆన్ లైన్ టిక్కెట్లు పెంచే ఆలోచన చేస్తాం
-ఈ సారి దసర ఉత్సవాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం
తూర్పుగోదావరి -రాజమండ్రి - పెద్దాపురం
- తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ కామెంట్స్
- కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఫైర్
- ఇఎస్ ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరామ్ ఇప్పడు మరో భూ కుంభకోణానికి తెరలేపారు.
- ఇట్టినా కంపెనీ లావాదేవీలతో సంబంధం లేని మంజునాధ్ ను అడ్డం పెట్టుకుని మంత్రి జయరాం ఆ కంపెనీ భూములను తన కుటుంబ సభ్యుల పేర అక్రమంగా బదలాయించుకున్నారు.
- తమకు భూములు విక్రయించేందుకు ఇట్టినా కంపెనీ యాజమాన్యం అంగీకరించినట్టు కంపెనీ బోర్డు తీర్మానాలు సృష్టించారు.
- ల్యాండ్ సీలింగ్ నిబంధనలతో బినామీల పేరుతో 115 ఎకరాలు భూమిని, కుటుంబ సభ్యుల పేరున 92 ఎకరాల భూమిని మొత్తం 203 ఎకరాలను ఈఏడాది మార్చి2న ఇట్టినా కంపెనీ నుండి తమ వాళ్ల పేర్ల మీద రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు.
- ఇట్టినా కంపెనీకి చెందిన భూమిని అక్రమంగా, దౌర్జన్యంగా మంత్రి కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు
- బదలాయించుకున్న అక్రమభూములపై వ్యవసాయ రూణాలను తీసుకునేందుకు కర్నూలు జిల్లా కో-అపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ధరఖాస్తుకున్నారు
- ఈ భూములు కొనుగోలు వ్యవహారంలో మాంత్రి జయరాం ప్రమేయం తదితర అంశాలపై సిబిఐ విచారణ జరిపించాలి
గుంటూరు: కృష్ణ,గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ స్వాతంత్ర్య ఎమ్మెల్సీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను - ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ .
- 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్దెనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచాను.
- ఆ సమయంలో అందరూ మద్దతు తెలిపారు.... స్వతంత్ర
- ఏఆశయాలతో అప్పటి ఉపాధ్యాయులు ఎన్నుకున్నారో వాటి సాధన కోసం కృషి చేశా.
- మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని కోరుతున్న నేపధ్యంలో మళ్ళీ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను....
- పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం పని చేశా...
- కృష్ణ,గుంటూరు ఉపాధ్యాయులు మళ్ళీ గెలిపిస్తే గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా.
- అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.....