Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-07 01:18 GMT
Live Updates - Page 2
2020-08-07 11:25 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజ్

- జయశంకర్ భూపాలపల్లి జిల్లా

- లక్ష్మీ బ్యారేజ్

- 30 గేట్లు ఎత్తిన అధికారులు

- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

- ప్రస్తుత సామర్థ్యం 98.70 మీటర్లు

- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

- ప్రస్తుత సామర్థ్యం 12.230 టీఎంసీ

- ఇన్ ఫ్లో 63000 క్యూసెక్కులు

- ఓట్ ఫ్లో 39900 క్యూసెక్కులు

2020-08-07 11:24 GMT

జిల్లాలో విషాదం.. నీటి తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

జగిత్యాల :

- జిల్లాలో విషాదం

- నీటి తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

- మేడిపల్లి మం. కేంద్రంలో సెప్టిక్ ట్యాంక్ కోసం నిర్మించిన నీటి తొట్టి లో పడి దుబ్బేటి రుతిక (7), వోల్పుల అశ్వంత్ (5) మృతి

- ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడిన చిన్నారులు

- ప్రాణాపాయ స్థితిలో జగిత్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యుడు.

- రాఖీ పండగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చి ప్రమాదంలో మృతి చెందిన రుతిక

2020-08-07 11:23 GMT

నిజామాబాద్ :

నగరంలోని డబ్బా ప్రాంతంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టర్ భవనాన్ని పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి.

2020-08-07 11:22 GMT

హైకోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్

- సచివాలయం కూల్చివేతల పనుల పరిశీలనకు అనుమతివ్వాలని హైకోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్

- పిల్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి

- అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి ఇవాళ విచారణ జరపాలని కోరిన న్యాయవాది

- అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు నిరాకరించిన హైకోర్టు

- గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందన్న పిటిషనర్ల న్యాయవాది

- నిరాధార, ఊహాజనిత అంశాలను పరిగణనలోకి తీసుకోలేమన్న హైకోర్టు

2020-08-07 11:19 GMT

భగవంతుడు ఇచ్చిన సంజీవని ప్లాస్మా ను దానం చేయండి, ప్రాణాలు కాపాడండి

- ఒకసారి కోవిడ్ వచ్చిన తరువాత రెండో సారి రావడం అనేది చాలా తక్కువ అని డాక్టర్స్ చెపుతున్నారు

- కోవిడ్ వచ్చిందని ఎంతో మంది భయం తో ఆత్మహత్య చేసుకుంటున్నారు

- అలాంటి వారి కి మనం అవగాహన చేయాల్సిన అవసరం ఉంది

- మా ఇంట్లో , నా దగ్గర పని చేసే వర్కర్స్ కి నలుగురికి కరోనా సోకింది

- వంట మనిషి సీను, స్విమ్మింగ్ లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరికి వచ్చింది

- ఇప్పుడు వారందరు కోవిడ్ నుండి కోలుకుని మరి ఇంట్లో వర్క్ చేస్తున్నారు

2020-08-07 11:19 GMT

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య 25 బెంగళూరులో ఇంట్లో అనుమానాస్పద మృతి

- కామారెడ్డికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య 25 బెంగళూరులో ఇంట్లో అనుమానాస్పద మృతి

- కామారెడ్డి నుంచి హుటాహుటిన బెంగుళూరుకు బయలుదేరిన పేరెంట్స్

- భర్త రోహిత్ చంపి ఉంటాడని లేదా

- వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని తల్లిదండ్రుల అనుమానం

- ఏడాది కిందటే ప్రేమ పెళ్లి చేసుకున్న శరణ్య రోహిత్..

- ఇద్దరిదీ కామారెడ్డి, పైగా క్లాస్ మేట్స్

- పెళ్ళైన కొన్నాళ్ల నుంచే రోహిత్ నిత్యం మద్యం సేవిస్తూ కొట్టడం వేధించడం చేశాడని పేరెంట్స్ ఆరోపణలు

2020-08-07 11:18 GMT

నిజామాబాద్:

- సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏ ఐ టి యు సి ఆద్వర్యం లో కలెక్టరేట్ వద్ద ధర్నా..

- వేతన సవరణ ముగిసి ఏడాది గడిసినా పట్టించుకోవడం లేదని ఆందోళన

- ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె కు పిలుపు

2020-08-07 11:17 GMT

నాగర్ కర్నూల్ జిల్లా:

కలెక్టరేట్ లో రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన జాతీయ బిసి కమిషన్ సభ్యులు ఆచారి.. కలెక్టర్ శర్మన్.

2020-08-07 11:16 GMT

వనపర్తి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి...

వనపర్తి జిల్లా:

- వనపర్తి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి...

- కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా..ఇతర అధికారులు.


2020-08-07 11:14 GMT

కోవిడ్ పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం

మెగాస్టార్ చిరంజీవి:

- రక్త దానం నుండి ఫ్లాస్మా దానం వరకు సైబరాబాద్ పోలుసులు చేస్తున్న సేవను గుర్తించుకోవాలి

- ఇలాంటి మంచి మార్గం లో నన్ను నడిపిస్తున్నందుకు సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు

- 22 ఏళ్ల క్రితం నాకు సామాజిక బాధ్యత తెలియని సమయంలో

- ఓ న్యూస్ పేపర్ లో ఒక వార్తా చూసి చలించి పోయాను

- ఆక్సిడెంట్ లో ఎంతో మంది మృతి చెందడం , రక్తం దొరక మృతి చెందుతున్నారు అని గమనించి

- నేను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేశాము

- దీనికి అభిమానులు సహకరిస్తూ , నిత్యం బ్లడ్ దానం చేస్తూ ముందుకు సాగుతున్నాం

- మాకు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చింది

- ఈ కోవిడ్ పరిస్థితిల్లో ఇప్పుడు అసలైన ఆయుధం ఫ్లాస్మా

- ఈ ఫ్లాస్మా దానం చేయడం తో మరో ప్రాణాన్ని కాపాడిన వారు అవుతాము

- రెండు రోజులు క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది

- వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు అనే వ్యక్తి ని ఫ్లాస్మా దానం చేయమని చెప్పాను

- అతను దానం చేయడం తోనే మా బందువు ప్రాణాలతో బయట పడ్డాడు

- ఈ ఫ్లాస్మా దానం పై ఎవరు అపోహలకు పోవద్దు

- మీరు ఫ్లాస్మా దానం చేయడం ద్వారా ఎలాంటి బ్లడ్ లాస్ జరగదు

Tags:    

Similar News