Live Updates: ఈరోజు (సెప్టెంబర్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 06 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చవితి (సా.4-11వరకు) తదుపరి పంచమి | అశ్విని నక్షత్రం (తె.3-44 వరకు) తదుపరి భరణి | అమృత ఘడియలు: రా.7-45 నుంచి 9-31 వరకు | వర్జ్యం: రా.11-18 నుంచి 1-04 వరకు | దుర్ముహూర్తం: సా.4-29 నుంచి 5-18 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు |సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-08
ఈరోజు తాజా వార్తలు
సిద్దిపేట;
👉ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి ఎన్ని మాట్లాడి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు ఓట్లు వేసేది మాత్రం టిఆర్ఎస్ పార్టీకే...
👉దుబ్బాక నియోజకవర్గం ముఖ్యమంత్రి జిల్లా అని, సిద్దిపేట జిల్లా అభివృద్ధి చెందింది అంటే అది ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాతే...
👉 ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. గజ్వేల్, సిద్దిపేట మాదిరిగానే త్వరలో దుబ్బాక కూడా అభివృద్ధి చెందుతుంది...
పెద్దపల్లి :
--సుమారు రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.
-సుల్తానాబాద్ రైల్వే వాగన్ లో పనిచేసేందుకు రైల్వే లైన్ లో భూములు కోల్పోయిన స్థానికులకే హమాలీలుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్
-ఘటన స్థలానికి చేరుకొని నిరసన కారులతో చర్చలు జరుపుతున్న పోలీసులు.
హైదరాబాద్...
-ఎగిసి పడుతున్న మంటలు
-మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది...
-అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమీపంలో దట్టంగా అలుముకున్న పొగ స్థానికుల భయాందోళన...
హైదరాబాద్...
-ఎగిసి పడుతున్న మంటలు
-మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది...
-అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమీపంలో దట్టంగా అలుముకున్న పొగ స్థానికుల భయాందోళన...
వరంగల్ అర్బన్ జిల్లా:
-వేలేరు మండలంలోని పీచర గ్రామంలో అమానుషం.
-మారబోయిన లచ్చమ్మ (82) కు కరోనా పాజిటివ్,
-కన్నతల్లి కి కరోనా పాజిటివ్ రావడంతో తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేసిన కొడుకులు
-బాధితురాలికి నలుగురు కుమారులు, ఒక కూతురు.
-మానవత్వాన్ని మంట కలుపుతున్నా కరోనా..
నిజామాబాద్ :
-ఎడపల్లి మండలం లోని
-సిండి కేట్ బ్యాంకు లో 2కోట్ల 50 లక్షల పంట రుణాలు పొందిన 145 మంది
-ఫోర్జరీ పత్రాల తో రుణాలు పొందటం పై పోలీసులకు పిర్యాదు చేసిన బ్యాంక్ ఉన్నతాధికారులు.
-ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఓ ఫీల్డ్ ఆఫీసర్ సహకరించారని బ్యాంక్ అధికారుల పై కేసు.
ఖమ్మం జిల్లా ;-
*నేలకొండపల్లి మండలం రాయిగూడెం సమీపంలో భారీగా గుట్కా పట్టివేత...
* బీదర్ నుంచి అక్రమ వ్యాపారం కోసం కారులో తీసుకువచ్చిన 10లక్షల విలువ చేసే గుట్కా పట్టుకున్న ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు ...
వరంగల్ రూరల్ జిల్లా.
-మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్..
-గత కొద్దిరోజులుగా మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాట్లు.
-వాహనాల తనిఖీలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు
-సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం.
-గ్రేటర్ హైదరాబాద్ , దుబ్బాక , ఎమ్మెల్సీ ఎన్నికలు చర్చ.
-కోర్ కమిటీ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ,ప్ర చారకమిటీ చైర్మన్ విజయశాంతి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 90.90 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 0.915 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,55,500 క్యూసెక్కులు