Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Gunter district updates: యుటిఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు డిఈవో కార్యాలయం ఎదుట ధర్నా..
గుంటూరు...
ఉపాధ్యాయులు..
-పాపెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు డిఈవో కార్యాలయం ఎదుట ధర్నా
-ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఉపాధ్యాయులు.
Vijayawada updates: ఆంధ్రప్రదేశ్ అఖిలపక్ష సమావేశం ప్రారంభం..
విజయవాడ..
-అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ అఖిలపక్ష సమావేశం ప్రారంభం
-ఈ సమావేశానికి హాజరైన జేఏసీ నాయకులు, అఖిలపక్ష నేతలు..
-రాజధాని ఉద్యమం ప్రారంభమై 300 రోజులకు చేరనున్నడంతో రాజధాని రైతులకు మద్దతుగా కార్యచరణ ప్రకటించనున్న నాయకులు...
Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
అమరావతి...
-మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఇసుక కష్టాలు తీరలేదు.
-మీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది.
-లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.
-10 టైర్లలారీ ఇసుక గతంలో రు.6 వేలు ఉండగా ప్రస్తుతం రు.30 వేలకు చేరింది.
-ఇసుక మాఫియా కనుసన్నల్లో టన్నుల కొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతోంది.
-కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి వారి సంక్షేమ నిధులు రు.450 కోట్లు మళ్లించడం తగదు.
-తక్షణమే ఇసుకను ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టి, భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోండి.
Krishna updates: నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడులు..
కృష్ణాజిల్లా..
-సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి, అటెండర్ బండ్ల సుధీర్ ని తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు లంచం
-25 వేల రూపాయలు లంచం అడగగా ఏసీబీ ని ఆశ్రయించిన బండ్ల సుధీర్
-సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Kadapa district updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులొ సీబీఐ విచారణ..
కడప :
-రెండో దఫా సీబీఐ విచారణలో 7 మంది సీబీఐ అధికారులకు కరోనా నిర్దారణ కావడంతో ఐసోలేషన్ కేంద్రాలలో చికిత్స ...
-వివేకా కేస్ లో గత కొన్ని రోజుల నుంచి నిలిచిపొయిన సిబిఐ విచారణ...
-నేడు ఢిల్లీ నుంచి కడప కు కొత్త సీబీఐ బృందం వచ్చే అవకాశం...
-విచారణ కోసం ఢిల్లీ నుంచి కొత్తగా సీబీఐ అధికారులు వస్తారా? లేదా ఇప్పుడు ఉన్న అధికారులు ఢిల్లీ కి వెళ్లిపోయి తాత్కాలిక విరామం ఇస్తారా?
-నేడు క్లారిటీ వచ్చే అవకాశం...
-ఒకవేళ ఢిల్లీ నుంచి మరికొందరు అధికారులు వస్తే ....యధావిధిగా కొనసాగనున్న సీబీఐ విచారణ.
Krishna district updates:మైలవరం మండలం గణపవరంలో అర్ధరాత్రి హుండీ చోరీ..
కృష్ణాజిల్లా..
-గణపవరం ఊరు నడిబొడ్డులో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి ఆలయం
-గుడిలోని హుండీని ఎత్తుకెళ్ళిన గుర్తు తెలియని దుండగులు
-హుండి లో 25 వేల నుంచీ 30 వేల రూపాయలు ఉంటాయన్న గ్రామస్థులు
Visakha updates: కొండచరియులు విరిగి మూడేళ్ల బాలిక మృతి...
విశాఖ..
-మురళీనగర్ ,సాయిరాంనగర్ లో కొండచరియులు విరిగి మూడేళ్ల బాలిక గంగోత్రి మృతి.
-ఇటీవలే కురిస్తున్న వర్షాలు కారణంగా కొండచరియలు రేకులు షేడ్డుపై పడినట్లుగా స్థానికులు అంచనా.
-మరో నలుగురికి తప్పిన ప్రమాదం.
Kadapa updates: నేడు ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ప్రమాణం..
కడప :
-వైసీపీ నుంచి కొత్తగా ఏపీ శాసనమండలికి ఎన్నికైన జకియా ఖానమ్..
-మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ చాంబర్ లో ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీగా ప్రమాణం..
Anantapur updates: తాసిల్దార్ నీలకంఠారెడ్డి కి ఓ ఆగంతకుడు ఫోన్...
అనంతపురం:
-ఏసీబీ అధికారిఅంటూ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తాసిల్దార్ నీలకంఠారెడ్డి కి ఓ ఆగంతకుడు ఫోన్.
-కార్యాలయాల్లో దాడులు చేయకూడదు అంటే తనతో మాట్లాడుకోవాలని డిమాండ్.
-కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు
Anantapur district updates: గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ.
అనంతపురం:
-ఉరవకొండ పట్టణంలో లో31 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ.
-ఐదు గ్రామ సచివాలయంలో విధులకు హాజరు కాని వారికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి శ్యామల