Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-06 01:30 GMT
Live Updates - Page 2
2020-10-06 09:53 GMT

అమ‌రావ‌తి అంటే చంద్ర‌బాబే గుర్తు వ‌స్తుంది : వర్లరామయ్య

విజయవాడ: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య.

- మనపోరాటం ప్రభుత్వం మీద కాదు.. ఒక వ్యక్తి మీద అనేది గమనించాలి..

- అహంకారం కలిగిన, రాజ్యాంగం పట్లగౌరవం లేని వ్యక్తి..

- పాలేగాళ్లకుప్రతినిధిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిపై మనం పోరాటం చేయాలి ..

- జగన్మోహన్ రెడ్డి కి అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తున్నారు..

-దళితులు నోట్లో మట్టి కొట్టిన జగన్మోహన్ రెడ్డి కి దళితులు ఉసురు తగులుతుంది.

- పలికిమాలినసలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పగలరా.

-  జగన్మోహన్ రెడ్డి బహుజన, బలహీనవర్గాలు వారిని ఎందుకు తొక్కుతున్నారు..

- ఇందుకా మా వర్గాలు వారు మీకు ఓటు వేసింది

- తెలంగాణ ఉద్యమంకు ఏ మాత్రం తీసుకొని పోరాటం అమరావతి కోసం. చేస్తున్నారు...

2020-10-06 09:49 GMT

NELLORE: కండలేరు జలాశయంను పరిశీలించిన నెల్లూర్‌ కలెక్టర్

నెల్లూరు స్క్రోలింగ్:రాపూరు (మం) తెలుగుగంగ అంతర్భామైన కండలేరు జలాశయంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు..

- లో లెవెల్ స్లూయిస్,ఎడమ కాలువ,హెడ్ రెగ్యులేటర్ లను స్వయంగా పరిశీలించి నీటి ని సరఫరా చేస్తున్న అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్..

-కృష్ణ బోర్డ్ నిర్ణయం ప్రకారమే గంగ నీరు చెన్నైకి పంపిణీ

-నీటివాటాల విషయం మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ తో చర్చ జరుగుతోంది.

-పునరావాస బాధిత నిరుద్యోగులకు త్వరలో తగిన న్యాయం చేస్తామ న్న కలెక్టర్ చక్రధర బాబు

2020-10-06 09:42 GMT

ENGLISH MEDIUM: ఆంగ్లమాధ్యమం పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

జాతీయం: ఆంగ్లమాధ్యమం అంశంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

- విచారణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం

- ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వాదనలు

- ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిందన్న విశ్వనాథన్

- ఒక సబ్జెక్ట్ గా తెలుగును కూడా ఉంచారని వాదన

- ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విశ్వనాథన్

-అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంగ్లీష్ తో పాటు మాతృభాషలో విద్యాబోధన్ కోమసాగుతుందన్న సీజేఐ

-96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లీష్ కోరుకుంటున్నారన్న విశ్వనాథన్

- తెలుగు కావాలనుకునే వారికోసం మండల కేంద్రంలో స్కూల్ ఉంటుంది ఉచిత బస్ సర్వీస్ సౌకర్యం కల్పిస్తున్నాం విశ్వనాథన్

-ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డ సీజే

-చిన్నారులకు ఫౌండేషన్ బాల్యం.. ఆస్థాయిలో మాతృభాషలో విద్య ఉండాలన్న సీజే

-  వేరే ధర్మాసనం నుంచి పిటిషన్ వచ్చినందున వచ్చే వారం వివరంగా విచారిస్తామన్న సీజే

2020-10-06 09:36 GMT

THAMMINENI SITHARAM: శ్రీ‌కాకుళంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప‌ర్య‌ట‌న‌

శ్రీకాకుళం జిల్లా..

- బూర్జ మండలంలో పర్యటించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. 

- చిన్నలంకం, మామిడివాలస గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తమ్మినేని..

2020-10-06 09:33 GMT

APEX MEETING: ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం

#సుమారు రెండు గంటలపాటు సాగిన సమావేశం

#జల వివాదాలపై తమతమ అభ్యంతరాలను, వివరణలను అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

#మరికాసేపట్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ మీడియా సమావేశం

#జల వివాదాల పరిష్కారానికి కేంద్రం తీసుకొనున్న చర్యలను వివరించనున్న కేంద్ర జనశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

2020-10-06 09:31 GMT

AP CONGRESS: రాష్ట్రాన్ని కాపాడటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సుంకరపద్మశ్రీ

విజయవాడ: కాంగ్రెస్ లీడర్ సుంకరపద్మశ్రీ

- అమరావతి రాజధానిగా కొనసాగితేనే రాష్ట్రభవిష్యత్ బాగుంటుంది..

- అమరావతి రాజధానిగా నిలబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.

- రాహుల్ గాంధీ ఈ విషయంపై త్వరలోనే స్పందిస్తారు..

- రాష్ట్రాన్ని కాపాడటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది

- ఎప్పుడూ రమ్మంటే అప్పుడు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు

- ప్రభుత్వం అమరావతి ఉద్యమం చేసే వారిపై భౌతికదాడులు చేయడంతో పాటు ఆక్రమకేసులు నమోదు చేస్తున్నారు..

- ఢిల్లీలో మద్దతు కూడగొట్టినతరువాత న్యాయస్థానంలో మనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది..

- కోవిడ్ కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయాము..

- ఇకనుండి బహిరంగంగా ప్రజల్లోకి, రోడ్లుపైకి వచ్చి ఉద్యమం చేపట్టాలి.

- ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి.

- ఇది రాజకీయపార్టీలకు సాధ్యమవుతుంది

- కేంద్రప్రభుత్వం అమరావతి విషయంలో బాధ్యతతీసుకోవాలని తీర్మానం చేయాలి

2020-10-06 09:25 GMT

AP PCC Working President Tulasi Reddy: వ్యవసాయ మీటర్లు రైతుల మెడలకు ఉరితాళ్లు…

కడప : పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కామెంట్స్

- వ్యవసాయ మీటర్లు రైతుల మెడలకు ఉరితాళ్లు…

- వ్యవసాయ చట్టాలు తేనే పూసిన కత్తులని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ధ్వజం…

- రైతు వ్యతిరేక, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని పులివెందుల నియోజకవర్గంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాం...

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు దుష్మన్ పార్టీలు...

- వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా ను ఎత్తివేసే పన్నాగం...

- మోటార్ల కు మీటర్లు బిగించే జీవో నంబర్ 22 ను వెంటనే ఉపసంహరించుకోవాలి

- రైతు వ్యతిరేక, వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి...

2020-10-06 09:22 GMT

THIRUMALA BLACK TICKETS: తిరుమలలో వీఐపీ దర్శన టికెట్ల దందా

తిరుమల బ్రేకింగ్: తిరుమలలో విఐపీ దర్శన టికెట్లను బ్లాక్ విక్రయించే మహిళ దళారీ ఆరెస్ట్

- 4 విఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను రూ 20 వేలకు బ్లాక్ లో విక్రయించిన మహిళ దళారీ

- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ వింగ్ సిబ్బంది

- ఓ ప్రజాప్రతినిధి లెటర్ పై టిక్కెట్లు పొందినట్లు గుర్తించిన విజిలెన్స్ వింగ్

- పోలీసులకు అప్పగించిన విజిలెన్స్ వింగ్ అధికారులు,

- నిందితురాలపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు

2020-10-06 09:17 GMT

Vizak port: విశాఖ పోర్టులో రికార్డు స్థాయిలో సరుకు రవాణా

విశాఖ: విశాఖ పోర్టు ఛైర్మన్ కె.రామ్మెహన్ రావు కామెంట్స్

- 2019-  20 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ 72.72 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి సరుకును రవాణా చేసింది

- 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ 65.30 మిలియన్ టన్నులతో పోల్చుకుంటే 2019 20 ఆర్ధిక సంవత్సరంలో చేసిన సరుకు రవాణా 11 శాతం అధికం

-  సరుకు రవాణాపై కోవిడ్ -19 ప్రభావం  

- భారతదేశంలోని మేజర్ పోర్టులు అన్నీ కలిపి 2020 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 245 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేశాయి

- ఇదే 2019 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 294 మిలియన్ టన్నుల సరుకును 12 మేజర్ పోర్టులు కలిసిచేశాయి.

- గత ఏడాది ఇదే సమయానికి ( ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధభాగం ) సరుకు రవాణా తో పోల్చుకుంటే 16.5 శాతం తక్కువగా నమోదైంది

- విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగంలో 32.77 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది

 - గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయానికి 34.75 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది.

- గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 1.98 మిలియన్ టన్నుల తక్కువ సరుకు రవాణా జరిగింది

- గత ఏడాది తొలి అర్ధభాగంతో పోల్చుకుంటే ఇది 5.7 శాతం తక్కువ

- సరుకురవాణాలో తగ్గుదలపరంగా చూసుకుంటే మిగిలిన అన్ని మేనేజర్పోస్టుల కంటే కూడా విశాఖపట్నం పోర్టు ట్రస్టు కు తక్కువ తగ్గుదలను నమోదుచేసింది

- 2019 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధభాగంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు 1056 వెసిల్స్ను హ్యాండిల్చేసింది

- అదే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 1016 వేసాల్స్ ను చేసింది

- స్టీమ్విభాగంలో స్టీమ్కోల్ , పెట్రోలియం సెక్టార్లో కుకింగ్కోల్ , పెట్రోలియం రంగంలో ముడిచమురు కంటైన వాణాలో తగ్గుదల నమోదైంది

2020-10-06 09:08 GMT

ఎన్డీఏలో చేరికపై ప్రధానితో చర్చించిన సీఎం జగన్

- ప్రధానితో భేటీ ముగియగానే జోరందుకున్న ప్రచారం

- దాదాపు 40 నిమిషాల పాటు ప్రధానితో జగన్ భేటీ

- న్డీయేలో చేరికపై ఇప్పటి వరకు ధృవీకరించని వైసీపీ

- ఎన్డీఏ చేరితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుందటుందని భావిస్తోన్న వైసీపీ

- NDAలో చేరితే రెండు క్యాబినెట్ బెర్తులు..

ఒక సహాయ మంత్రి ఖాయం

- రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

- 15రోజుల క్రితం అమిత్‌షాతో భేటీ అయిన సీఎం

- ఏపీ సీఎం జగన్‌.. ప్రధానితో భేటీపై జోరు అందుకున్న ఊహగానాలు

- భేటీ విషయాలు బయటకు రాకపోవడంతో.. అనేక అనుమానాలకు తావు ఇస్తోంది.

- ప్రధానితో సీఎం జగన్ 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం

Tags:    

Similar News