Live Updates: ఈరోజు (04 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 04 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ పూర్తిగా | అశ్వని ఉ.10-48 వరకు తదుపరి భరణి | వర్జ్యం: ఉ..06-22 నుంచి 08-08 వరకు తిరిగి రాత్రి ౦9.26 నుంచి 11.22 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
విశాఖ జిల్లా..
-విశాఖ NAD ఫ్లైఓవర్ గోపాలపట్నం వైపు వెళ్లే మార్గాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ
-ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎం.పి ఎంవివి సత్యనారాయణ, జిల్లా అధికారులు.
తూర్పు గోదావరి....
అమలాపురం....
-అమలాపురానికి చెందిన డాక్టర్ పి ఎస్ శర్మ కు జాతీయస్థాయిలో TB నిర్మూలన కమిటీలో చోటు..
-2025 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యంగా నేషనల్ IMA ఆరుగురితో కమిటీ ఏర్పాటు..
-ఆ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ పి ఎస్ శర్మ కి చోటు..
-డాక్టర్ శర్మ ను అభినందించిన కీమ్స్ ఎండీ రవివర్మ.. డీన్ డాక్టర్ కామేశ్వరరావు
తూర్పుగోదావరి :
-పెద్దాపురం మం. కాండ్రకోట వద్ద ఏలేరు వరద ఉధృతికి డబ్బా కాలువ పై కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన
-కాండ్రకోట - తూర్పుపాకల మధ్య నిలిచిన రాకపోకలు..
-కాండ్రకోట, తూర్పుపాకల, తిమ్మాపురం, కట్టమూరు గ్రామాల రైతులు వినియోగించే వంతెన కూలిపోవడంతో అవస్థలు పడుతోన్న రైతులు..
విజయనగరం...
-గర్బిణి మహిళను వైద్యం కోసం 11 కిలోమీటర్ల డోలీలో తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు
-శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతి పొర్లు గామానికి చెందిన చంద్రమ్మ అనే గర్బిణి మహిళకు పురిటినొప్పులు రావడంతో గ్రామంలో వైద్య సదుపాయం లేకపోవడంతో డోలిలో దబ్బగుంట వరకు తీసుకు వచ్చిన బందువులు
-దబ్బగుంట నుండి 108లో శృంగవరపుకోట హాస్పిటల్ కు తరలింపు
తూర్పుగోదావరి:
-సూరంపాలెం వద్ద జరిగిన ఘటన
-లారీ బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
-వర్షం కారణంగా జారుడు వల్ల అదుపుతప్పి బోల్తా పడిన ట్యాంకర్
జాతీయం..
-కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరం.
-కరోనా పాజిటివ్‌గా తేలిన రోజే ట్రంప్‌కు కృత్రిమ శ్వాస కల్పించినట్లు వైట్‌హౌస్ వర్గాల సమాచారం.
-మిలటరీ ఆస్పత్రికి తరలించడానికి ముందే అధ్యక్ష భవనం వైద్యులు ట్రంప్‌నకు ఆక్సిజన్‌తో శ్వాస కల్పించారని వార్తలు
-రాబోయే 48 గంటల అత్యంత కీలమని వైద్యులు ప్రకటన.
-74 ఏళ్ల వయసు గల ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్ ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ధృవీకరణ.
-ప్రస్తుతం ఆయనకు రెమ్‌డెసీవీర్‌తో పాటు యాంటీబాడీలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు
విజయవాడ.
-టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కార్ అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు
-ఇంటి బయట పెట్టిన కార్ ముందు, వెనుక అద్దాలు పగలగొట్టి న దుండగులు
-సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
విజయనగరం ..
-పార్వతీపురం రెల్లివీధిలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు భారీగా పట్టుబడ్డ నాటుసారా
-650లీటర్ల నాటుసారా,9 బైక్ లు సీజ్, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నెల్లూరు :-
-- ఇన్ ఫ్లో 40వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 29,736 క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 74.14 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.
కర్నూలు జిల్లా...
-1 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 55,246 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 63,374 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.70 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 213.8824 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి