Big Breaking: విజయవాడలో అన్ని కోవిడ్ సెంటర్ల లైసెన్సులు రద్దు!
బిగ్ బ్రేకింగ్..
విజయవాడ..
-బెజవాడ ప్రైవేట్ కోవిడ్ సెంటర్లలో భారీ కుదుపు
-బెజవాడలో ఉన్న అన్ని కోవిడ్ సెంటర్ల లైసెన్స్ రద్దు చేస్తూ ఆదేశాలు
-22 కోవిడ్ సెంటర్లలో 9 రద్దు చేసిన ప్రభుత్వం
-మిగతా 13 సెంటర్ల అనుమతి రద్దు చేసిన పాత DMHO
-4 రోజుల క్రితం (ఆగస్టు 31)న DMHOగా పదవీ విరమణ చేసిన డాక్టర్ రమేష్
-పదవీ విరమణ చేసే చివరి రోజున అన్ని కోవిడ్ సెంటర్ల అనుమతి రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన DMHO
-అనుమతులు ఇచ్చిన ఆయనే ఆయనే రిటైర్మెంట్ రోజున రద్దు ఆదేశాలపై దుమారం
-కోవిడ్ సెంటర్ల అనుమతుల్లో లక్షలు చేతులు మారినట్లు ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం
-ఈ నేపథ్యంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన పాత DMHO
Anantapur district updates: అనంతరావు మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో తరలించిన అధికారులు.
అనంతపురం: హెచ్ఎంటీవీ ఎఫెక్ట్
-లేపాక్షి మండల కేంద్రంలోని దేవాలయం వీధిలో అనంతరావు మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో తరలించిన అధికారులు.
-నిన్న రాత్రి ఇంటి ముందు మృతదేహం పడేసి వెళ్లిన సిబ్బంది.
-హెచ్ ఎంటివి వెలుగు లోకి తేవడంవతో ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు.
-కోవిడ్ నిబంధనల మేరకు మృతదేహం తరలింపు
Kurnool District updates: నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో దారుణం..
కర్నూలు జిల్లా..
-ప్రియుడి పై ఆసిడ్ దాడి కి పాల్పడ్డ ప్రియురాలు
-కాలిపోయిన ప్రియుడు ముఖం, చేయి ..పరిస్థితి విషమం..
-మూడు సంవత్సరాలు గా ప్రేమించుకుంటున్న సుప్రియ, నాగేంద్ర..
-తనను కాదని వేరొకరితో వివాహం చేసుకుంటున్నాడని యాసిడ్ దాడి చేసి పరారీ..
-కులాలు వేరే అని 3 నెలల క్రితమే బ్రేకప్ అయిందంటున్న ప్రియుడు..
-డిగ్రీ పూర్తి చేసిన సుప్రియ..5th class చదివిన నాగేంద్ర..
-నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స....కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Nellore district updates: నెల్లూరు జిల్లాలో మరో కిడ్నాప్ కలకలం..
నెల్లూరు జిల్లా..
-కొడవలూరు (మం) కొత్తవంగల్లులో
-మేకలు మేపుతున్న స్వర్ణ శ్రీనివాసులు కిడ్నాప్.
-మేకలు మేపుతున్న శ్రీనివాసులు ను నిన్న సాయింత్రం టాటా మ్యాజిక్ లో వచ్చి అపహరించుకు వెళ్ళిన దుండగులు.
-పోలీసుల కు ఫిర్యాదు చేసిన బాధితురాలు.
-గ్రామంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారమే కిడ్నాప్ కి కారణం అంటున్న కుటుంబం సభ్యులు.
Godavari floods: పోలవరంలో ఉదృతంగా గోదావరి
* కాపార్ డ్యాం వద్ద చేరిన వరద 23.28 మీటర్ల కి చేరిన వరద నీరు
* కొత్తూరు కాజు పై 12 అడుగులు చేరిన వరదనీరు
* 19 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
* గోదావరి వరద నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ముంపు గ్రామాలు
* మరోసారి వరద పెరగడంతో భయాందోళనలో ముంపు గ్రామాల ప్రజలు.
Godavari Floods: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద గోదావరి తగ్గుముఖం
- 8లక్షల 65వేల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి విడుదల
- ధవలేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 10.8 అడుగులు
- మొదటివార్నింగ్ వరకూ వెళ్ళి నెమ్మదిగా తగ్గుతున్న వరద
- ఊపిరిపీల్చుకుంటున్న కోనసీమ లంకవాసులు..
Anantapur updates: పాలిటెక్నిక్ విద్యార్థులకు పరీక్షలు
అనంతపురం:
- ఈ నెల 16 నుంచి పాలిటెక్నీక్ మూడో సంవత్సరం విద్యార్థుల కు పరీక్షలు
- ఉదయం9.30 గంటల నుంచి 12.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు బ్రాంచిల వారిగా రెండు విడతాలలో పరీక్షలు.
- వెల్లడించిన ప్రిన్సిపాల్ జయచంద్రరెడ్డి
Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
- ప్రస్తుతనీటి మట్టం:885 అడుగులు
- పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు
- ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
- ఇన్ ఫ్లో:55,232క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో:37,750 క్యూసెక్కులు
Weather updates: ఈరోజు వాతావరణం
- ఏపీలో ఈరోజు అక్కడక్కడా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
- దక్షిణ చత్తీస్ ఘడ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km నుండి 4.5 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
- దీని కారణంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ లో అక్కడ అక్కడ తేలికపాటి వర్షాలు