Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-03 00:42 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-03 14:25 GMT

చిత్తూరు

*రూ.1.17 కోట్లు కాజేసిన 7 మంది అరెస్ట్.

*ఏటీఎంలలో టెక్నికల్ లోపాలను అలుసుగా తీసుకొని నగదు అపహరణ

*జల్సాలు, స్వంత ఖర్చులకు బ్యాంకు సొమ్మును వాడుకున్నా వైనం

*19 ఏటీఎంలలో డబ్బులు లూఠీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.

*నిందితుల నుంచి రూ.40 లక్షలు స్వాధీనం

2020-11-03 14:21 GMT

 తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట

- జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రెస్ కామెంట్స్....

- ఇసుకపాలసిలో 8 నెలలు పాటు 16 లక్షల మందికి అన్నం లేకుండా చేశారు.

- దఫా, దఫాలు మద్యం నిషేధం పేరుతో తమ కంపెనీల మద్యాన్ని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

- ఇళ్ల స్థలాలు ఇస్తామని వాయిదాలు వేసుకొస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవ్వాలి

- గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది... నెహ్రు

- రండి కలిసి కేంద్రంపై పోలవరం ప్రాజెక్టు నిధులకై ఒత్తిడి తెద్దాం.. నెహ్రు

2020-11-03 14:13 GMT

 గుంటూరు ః

- సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు

- తొలి నుంచి బిసిలు టిడిపి కి అండగా నిలిచారు.

- వైఎస్ మరణాంతరం బిసిలు జగన్ కు అండగా నిలిచారు.

- జగన్ బిసిలపై చూపిస్తున్న ప్రేమ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

- తమిళనాడు లో సీఎం పశనీస్వామీ ని బిసి లు నిలదీశారు.

- జగన్ బిసి లకు ఇస్తున్న ప్రాధాన్యత మీరెందుకు ఇవ్వరని నిలదీసే పరిస్థితి వచ్చింది.

- అన్ని కులాలు దూరమయ్యాక చివరకు టిడిపి లో మిగిలేది అమరావతి బినామిలే

2020-11-03 14:08 GMT

గుంటూరు ః

-వైసిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

-జగన్ తీసుకున్న ఏ నిర్ణయం భవిష్యత్ లో ఏ సీఎం కదిలించలేరు.

-ఎన్టీఆర్ పరిపాలన మండల స్దాయి వరకు తీసుకెళ్తే , జగన్ పరిపాలనను గ్రామ స్థాయి కి తీసుకోచ్చారు.

-గ్రామ సచివాలయ వ్యవస్థ పై ఇతర రాష్టాల వారు ఆసక్తి చూపుతున్నారు.

-మూడు నెలల పాటు రాత్రింభవళ్ళు కష్టించి మ్యానిఫెస్టో రూపొందించాం.

-మనం ఇచ్చే ప్రతి హామీ మన బాధ్యత అని జగన్ బావించారు.

-బిసిలు రాష్ట్రానికి ఆర్దిక పరిపుష్టికి కావాలని జగన్ బావించారు.

-పరిపాలన సంస్కరణ లకు జగన్ నాంది పలికారు.

-కోర్టుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్న ప్రజల విషయంలో జగన్ వెనకడుగు వేయడం లేదు.

2020-11-03 13:58 GMT

అమరావతి

- విజయవాడలోని బీ ఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్ లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

- పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌తో పాటు, పలువురు    అధికారులు హాజరు.

2020-11-03 13:54 GMT

  గుంటూరు ః......

- చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ

- వైసిపి అధికారంలోకి వచ్చాక దేశం మొత్తం సీఎం జగన్ వైపు చూస్తుంది.

- బిసిల వెనుకబాటు తనాన్ని గుర్తించింది జగన్ మాత్రమే

- బిసిలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ గా జగన్ గుర్తించారు.

- బిసిలకే జగన్ బ్యాక్ బోన్ గా మేం బావిస్తున్నాం.

2020-11-03 13:43 GMT

 గుంటూరు...ః....

- హజరైన మంత్రులు సుచరిత, రంగనాధ్ రాజు, ఎంపీ మోపిదేవి , శ్రీకృష్ణ దేవరాయులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

- మంత్రి రంగనాధ్ రాజు కామెంట్స్...

- గుంటూరు జిల్లాలో నలుగురిని బిసి కార్పోరేషన్ చైర్మన్ లుగా , 46 మందిన్ డైరెక్టర్ లుగా నియమించాం.

- చైర్మన్, డైరెక్టర్ లకు గౌరవ వేతనం ఇచ్చి బిసిల సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు చేపట్టాం.

- బిసి ల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది. 

2020-11-03 13:40 GMT

 గుంటూరు ః....

 ఎంపీ మోపిదేవి కామెంట్స్

* బిసి ల అభ్యున్వతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్దాయి లో చర్చ జరుగుతుంది.

* రాజకీయ ఆరంగ్రేటం నుంచి సీఎం వరకు ప్రతిది ఓ చరిత్ర.

* బిసి సామాజిక వర్గాలు ఇప్పటి వరకు ఓటు బ్యాంక్ గానే ఉన్నాయి.

* బిసిలకు పదవులు అంటే ముడు నాలుగు కులలాకే అందేవి.

* ఇప్పుడు అన్ని కులాలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం.

* సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

* మీకు వచ్చిన పదవులు విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుడదు.

* జగన్ ఆశయాలను విసృతంగా ప్రజల లోకి తీసుకెళ్ళాలి.

* వెనకబడిన కులాల్లో అభివృద్దే చెందేలా కార్పోరేషన్ లు పని చేయాలి....

2020-11-03 13:35 GMT

అమరావతి

* అవంతి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి కామెంట్స్:

* విశాఖ బీచ్ రోడ్డులో టూరిజం శాఖ తరపున కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం.

* ఆంధ్ర హెర్కుల స్ గా పేరొందిన కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తే యువతకు స్పూర్తిగా ఉంటుంది.

* 13 జిల్లాల్లో 13 అంతర్జాతీయ స్థాయి స్టేడియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం.

* పీపీపీ పద్దతిన అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం

* పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.

* పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని ప్రధానే అన్నారు.

* పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు తగవు.

* కేంద్రంపై ఒత్తిడి తేవడానికి చంద్రబాబు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది.

* బీసీలకు గుర్తింపునిస్తూ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తే బీసీలను విడగొడతున్నామని విమర్శలు చేస్తున్నారు.

* కులమంటే చంద్రబాబు కులమేనా..? బీసీలవి కులాలు కాదా..?

* కరోనా పేరు చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలకే ఏపీకి వస్తారు.

* విశాఖకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడలో రెస్టారెంట్ ప్రారంభించే ప్రతిపాదన.

* ఇప్పటికే విశాఖలో విమానం, సబ్ మెరైన్ వంటివి పర్యాటకంగా ఆకర్షిస్తున్నాయి.

* వీటితో పాటు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడను కూడా పర్యాటకానికి వినియోగించుకోవాలని భావిస్తున్నాం.

* బంగ్లాదేశ్ ఓడకు చెందిన యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం.

* విశాఖలో సీ-ప్లేన్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాం.

*  గత ప్రభుత్వం కృష్ణా నుంచి నాగార్జున సాగరుకు సీ-ప్లేన్ ప్రతిపాదనలు పంపింది.

* టూరిజం బోట్లను పూర్తి స్థాయిలో అనుమతించాలని నిర్ణయం.

* పాపికొండలు, ప్రకాశం బ్యారేజ్ మినహా అన్ని చోట్ల బోటింగుకు అనుమతిస్తున్నాం.

* రాష్ట్రంలో 13 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు.

* ఓబెరాయ్ వంటి ప్రముఖ హోటల్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.     

2020-11-03 13:29 GMT

 తూర్పుగోదావరి : పి.గన్నవరం.

- మూడు రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్న హైస్కూల్ లో మిడ్ డే మీల్ కుక్..

- రిపోర్ట్స్ కోసం వేచి ఉండకుండా నిన్న 25 మంది స్కూల్ పిల్లలకు భోజనం వండి పెట్టిన మహిళ..

- రాత్రి పాజిటివ్ నిర్దారణగా మెసేజ్ రావడంతో అవాక్కయిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు..

- అబ్జర్వేషన్ లో స్కూల్ విద్యార్ధులు..

- అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్న స్దానికులు, విద్యార్ధుల తల్లిదండ్రులు.. 

Tags:    

Similar News