అమరావతి:
గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైయస్.జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్‌కు ఫోన్‌చేసిన సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నానంటూ సీఎం అన్నారు.
అమరావతి:
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎస్ఈసీ.
ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ.
రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుంది.
గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నా.
శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించా.
బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియ చేశాం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసిపి ఎమ్మెల్యే రోజా..
తిరుమల :
రక్తం పంచుకు పుట్టకపోయినా, రాఖీ కట్డకపోయినా రాష్ట్రంలోని ఆడపడచులకు జగన్ మోహన్ రెడ్డి అన్నగా అండగా నిలుస్తున్నారు..
ఆడపిల్లల ఇబ్బందులను గుర్తించి ఈ రక్షాబంధన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు..
మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత జగన్ గారికే దక్కుతుంది..
వికేంద్రికరణతో రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు..
దోచుకున్న డబ్బు, ఆస్తులు పోతున్నాయని చంద్రబాబు ఏడిస్తే అర్థముంది, ఇతర పార్టీలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు..
దుర్మార్గమైన రాజకీయాలు చేయాలని చూస్తే ఉన్న 23 మంది కూడా జీరోకు వస్తారు..
అమరావతి మాత్రమే రాజదానిగా ఉండాలన్న సెంటిమెంట్ ఉందన్న నమ్మకం ఉంటే టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలు వెళ్ళి నిరూపించండి..
శానిటైజర్ తాగి ముగ్గురు మృతి...
కడప :
కడప జిలలా పెండ్లిమర్రి లో విషాదం...
శానిటైజర్ తాగి ముగ్గురు మృతి...
మృతులు ఓబులేసు, భీమయ్య, చెన్నకేశవులుగా గుర్తింపు....
శానిటైజర్ వ్యవహారం బయటకు రాకుండా రహస్యంగా ఉంచిన బంధువులు ...
చెన్నకేశవులు నిన్న మృతి చెందడంతొ సమాచారం బయటకు రానివ్వకుండా ఖననం చేసిన బంధువులు...
ఓ వ్యక్తి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ..
మరో వ్యక్తి ఆయన ఇంట్లోనే మృతి చెందగా... పోస్టు మార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలింపు....
ఘటన పై విచారణ చేపట్టిన పెండ్లిమర్రి పోలీసులు...
3 రాజధానులు గెజిట్ నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు
అమరావతి
హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్
గెజిట్ ప్రకటనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటన చేయాలని కోరిన పిటిషనర్
వీటి అమలు పై స్టే కోరిన పిటిషనర్
రాజ్ భవన్, సీఎం కార్యాలయం, విభాగదిపతులు, సచివాలయం అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్
జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలన్న పిటిదనర్
రేపు విచారించనున్న ధర్మాసనం
శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న వరద ప్రవాహం
కర్నూలు జిల్లా
- ఇన్ ఫ్లో : 24,661 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 38,140 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 851.50 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు
- ప్రస్తుతం : 83.5278. టిఎంసీలు
ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
శ్రీకాకుళం జిల్లా..
- జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీదిరి అప్పలరాజు..
- ఉదయం 11 గంటలకు కరోనా పై జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష..
- అనంతరం కోవిడ్ ఆసుపత్రులను పరిశీలించనున్న మంత్రి..
శ్రీకాకుళం జిల్లా..
- జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభం కానున్న సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్ కార్యక్రమం
- సిఐడి విభాగం మరియు సైబర్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై మహిళలకు, బాలబాలికలకు అవగాహన
- నేటి నుండి ఈనెలాఖరు వరకు ఏపీ పోలీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్న పోలీసులు