Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-02 00:52 GMT
Live Updates - Page 2
2020-09-02 13:46 GMT

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

సాగు విస్తీర్ణం పెరగడంతో రాష్ట్రంలో ఇవాళ 10570 మెగా వాట్స్ విద్యుత్ డిమాండ్

గత నెలలో కూడా 12908 మెగా వాట్స్ విద్యుత్ డిమాండ్, గత సంవత్సరం కంటే 1000 మెగా వాట్స్ అధికంగా డిమాండ్.

13 వేల మెగా వాట్స్ డిమాండ్ వచ్చిన సరఫరా చేసేందుకు సిద్ధంగా ట్రాన్స్ కో

2020-09-02 13:43 GMT

Batti Vikramarka: వరంగల్ లో భట్టి విక్రమార్క పర్యటన.

వరంగల్ అర్బన్: వరంగల్ ఎంజీఎంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పర్యటన

కొవిడ్ వార్డును సందర్శించిన భట్టి

రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రతిపక్ష నేత

2020-09-02 09:37 GMT

వరంగల్ అర్బన్ జిల్లా:

భీమదేవరపల్లి మండలం వంగరలోని మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గృహంలో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ , వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు.

2020-09-02 09:37 GMT

తెలంగాణ జైళ్ల శాఖ రికార్డ్

2019 లో తెలంగాణ జైళ్ళ లో ఉన్న ఖైదీలు 600 కోట్ల రూపాయలు వస్తువులు ఉత్పత్తి.

దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ టాప్

దరిదాపుల్లో కూడా లేని మిగతా రాష్ట్రాలు.

రెండో స్థానంలో తమిళ్ నాడు జైల్ ఖైదీలు 72 కోట్ల ఉత్పత్తి

మూడో స్థానంలో మహారాష్ట్ర జైళ్ల ఖైదీలు 29 కోట్ల ఉత్పత్తి..

ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తువులను మార్కెట్ లో మంచి డిమాండ్.

ప్రస్తుత కరోనా సమయంలో ను మాస్క్ లు తయారీ చేసిన ఖైదీలు..

2020-09-02 09:37 GMT

తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజుల వసూలులో ప్రభుత్వ ఉత్తర్వులను విధిగా పాటించాలి

పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ టీచర్ లను కాపాడుకోవాలి

ట్రస్మా ప్రతినిధుల భేటీలో వినోద్ కుమార్ స్పష్టీకరణ

కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.ఆర్.టీ నంబర్. 46 అమలు చేయాలి

జీ.వో.46 ప్రకారం మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ప్రతి నెల ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు

2020-09-02 08:13 GMT

Telangana latest news: టీటీడీపీ మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్నా..

-టీటీడీపీ మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్నా..

-తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటుకు గవర్నర్ చొరవ తీసుకోవాలన్న టీటీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్నా...

-మహిళా కమిషన్ ఏర్పాటు చేయకపోతే.. అమరవీరుల స్థూపం వద్ద ప్రాణాలర్పిస్తాం..

-మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎస్, గవర్నర్ కు విజ్ఞప్తి చేశాం..

-తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు...

-తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి

-కేసీఆర్ సీఎం అయ్యాక మహిళా కమిషన్ ఉందన్న సంగతి మర్చిపోయారు

-ఉమ్మడి ఏపీలో వేసిన మహిళా కమిషన్ టర్మ్ 2018లోనే ముగిసింది

-దళిత మహిళలపై జరుగుతోన్న దాడులపై ప్రభుత్వం స్పందించాలి

-తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం

2020-09-02 08:11 GMT

Telangana updates: ఈఎస్ఐ స్కామ్ ఏసీబీ ధూకుడు....

-ఈఎస్ఐ స్కామ్ ఏసీబీ ధూకుడు....

-ఈఎస్ఐ స్కామ్ లో భారీగా బయట పడుతున్న మాజీ డైరెక్టర్ దేవికారాని ఆస్తుల చిట్టా..

-ఇప్పటి వరకు 35 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ..

-బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ...

-నిన్న నాలుగు కోట్ల పట్టుబడడం తో ఇతర ఆస్తుల పై ఆరా తీస్తున్న ఏసీబీ..

-ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచినట్లు గుర్తించిన ఏసీబీ..

-ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితులకు సంబంధించి వందల కోట్ల అస్తులను గుర్తించిన ఏసీబీ.

-విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల లో పెట్టు బడులు పై ఏసీబీ ఆరా...

-విచారణ కొనసాగుతుండగానే ఆస్తుకు, ఆభరణాలను పక్క దారి పట్టించారని అనుమానిస్తున్న ఏసీబీ....

2020-09-02 07:38 GMT

YSR Vardhanthi in Telangana: వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య..

-దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి, గాంధీభవన్ లోని చిత్రపటానికి పూలమాల వేసి     నివాలర్పించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య , జగ్గారెడ్డి ,నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్.

-జగ్గారెడ్డి... సంగారెడ్డి ఎమ్మెల్యే

-వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక రాజకీయా ప్రజా శక్తి...జగ్గారెడ్డి..

-రాజశేఖర్ రెడ్డి మరణించిన బ్రతికుండడానికి ఆరోగ్య శ్రీ పధకమే కారణం..

-ప్రతిపేద వాడికి వైద్యం ,విద్య అందేలా చేసిన ఘనత వైఎస్ ది

-కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 108 ,104 కనుమరుగైపోయ్యాయి..

-ఉమ్మడి రాష్ట్రం లో హైదరాబాద్ లో ఓ ఆర్ ఆర్ వేసి ట్రాఫిక్ లేకండ చేశారు..

-మెట్రో రైల్ పునదికి కారణం రాజశేఖర్ రెడ్డి.

-జలయజ్ఞం పేరుతో ప్రతి జిల్లాకి నీళ్లు వచ్చేలా చేశారు..

-రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది..

-అందుకే రాజశేఖర్ రెడ్డి రాజు నుండి మహారాజు అయ్యారు..

2020-09-02 03:52 GMT

Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ్-8 గేట్లు ఎత్తిన అధికారులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-సరస్వతి బ్యారేజ్

-8 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 10,600 క్యూసెక్కులు

2020-09-02 03:49 GMT

Jayashankar Bhupalpally updates: లక్ష్మీ బ్యారేజ్- 75 గేట్లు ఎత్తిన అధికారులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-లక్ష్మీ బ్యారేజ్

-75 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 97.40 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 8.938 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 9,69,300 క్యూసెక్కులు

Tags:    

Similar News