Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-02 00:56 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 02 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పూర్ణిమ (ఉ. 9-31 వరకు) తదుపరి పాడ్యమి శతభిష నక్షత్రం (సా. 6-25 వరకు) తదుపరి పూర్వాభాద్ర, అమృత ఘడియలు (ఉ. 10-46 నుంచి 12-28 వరకు) వర్జ్యం (రా. 1-19 నుంచి 3-03 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-35 నుంచి 12-25 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-12

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-02 09:39 GMT

తూర్పుగోదావరిజిల్లా. జగ్గంపేట

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో విన్నూత్న కార్యక్రమాలు

నియోజకవర్గంలో ప్రతిఇంటికి జనసేన వనరక్షణ ద్వారా నేటికీ 50వేలు జామమొక్కలుపంపిణీ

నియోజకవర్గంలో ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ

నేటితో 50వేల ఆకుకూరలు విత్తనాలు పంపిణీ.

పలు గ్రామాల్లో కరోనా రోగులకు ఇమ్యూనిటీ పుడ్, వృద్దులకు దుప్పట్లు పంపిణీ

2020-09-02 09:39 GMT

పశ్చిమ గోదావరి జిల్లా

వేలేరుపాడు,కుక్కునూరు వరదముంపు ప్రాంతాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు.

👉 గోదావరి వరదలు పట్టిన ప్రతి ఇంటికి 10వేలు,పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేలు ఇవ్వాలి.

👉సీఎం జగన్ ను కలిసి హామీ ఇచ్చిన ప్రకారం ప్రతినిర్వాసితకుటుంబానికి రూ.10లక్షలు ,లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతికుటుంబానికి రూ.7500లు,50కేజీల బియ్యం ఇవ్వాలని,వరదల వల్ల ఇళ్లు ,ఆస్తులు కోల్పోయిన వారిని వెంటనే ఆదుకోవాలని రిప్రజెంటేషన్ సీఎం కు ఇస్తామని మధు తెలిపారు.

2020-09-02 09:38 GMT

కర్నూల్

ఎమ్మిగనూరు లోని తసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు

తసీల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వనీదే పనులు జరగడం లేదనే ఆరోపణలు అధికంగా ఉన్నాయంటూ బాధితుల ఫిర్యాదులు

రేషన్ డీలర్లను, రైతులను, ప్రజలను విచారణ చేస్తున్న ఏసిబి అధికారులు

2020-09-02 09:38 GMT

తూర్పుగోదావరి :

కాకినాడ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిసి కామెంట్స్..

ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ 70 వ జన్మదినోత్సవ వేడుకలు..

సేవా సప్తాహ్ (వారోత్సవాలు) పేరుతో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం..

మోడీ 70వ పుట్టినరోజు సందర్భంగా గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు ప్రతీ ప్రాంతంలో 70 మంది వికలాంగులకు పరికరాలు పంపిణీ..

అవసరమున్న 70 మందికి కళ్ళజోళ్ళ పంపిణీ.. ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేపడతాం..

70 కోవిడ్ బాధితులకు ప్లాస్మా దానం.. యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదానం..

గ్రామాల్లో మొక్కలు నాటడం మొదలు ప్లాస్టిక్ నివారణ.. నిషేధంపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయిస్తాము..

70 ప్రాంతాలలో మేధావులతో సదస్సు ఏర్పాటు చేస్తాం..

ప్రధాన మంత్రి జీవన గమనంలో ని పోషించిన పాత్ర పై 70 ఫోటో ప్రదర్శన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము..

2020-09-02 08:24 GMT

గుంటూరు ః.......

-మంగళగిరి మండలం నవులూరు కు చెందిన పారబత్తిన సీతారామాంజనేయులు హత్య కేసును చేదించిన పోలీసులు.

-అక్రమ సంబంధం నేపద్యం లో మృతుని భార్య, సోదరుడే హత్య .

-మృతుని భార్య లక్ష్మి , మృతుని అన్న దుర్గా ప్రసన్న కు అక్రమ సంబంధం .

-తోడేటి నాగారాజు, పసుపులేటి హరికృష్ణ లతో కలిసి హత్య .

-నవులూరి క్రికెట్ స్టేడియం వెనుక హత్య చేసి చెట్టుకు వేలాడదీత.

-ఈ విచారణ లో వెలుగు లోకి వచ్చిన మరో హత్య కేసు,

-పిడుగురాళ్ల కు చెందిన చిన్నా అనే వ్యక్తి ని హత్య చేసిన తోడేటి నాగరాజు

-గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో ఓ గదిలో కొట్టి చంపిన నాగరాజు.

-ఒకే విచారణలో రెండు హత్య కేసులు వెలుగు లోకి.

2020-09-02 08:19 GMT

అమరావతి...

-ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

-పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

-భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను..

2020-09-02 08:16 GMT

గుంటూరు ః....

-రాజుపాలెం మండలం తహశీల్దార్ కార్యాలయం లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు ..

-తహశీల్దార్ పై ఇనిమెట్ల రైతులు ఫిర్యాదులు.

-పట్టదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా తహాశీల్దార్ వేదిస్తుందని ఫిర్యాదు.

-రైతులు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.

2020-09-02 08:06 GMT

అమరావతి:

-మధ్యాన్నం 1గంటకు హైదరాబాద్ నుంచి అమరావతి కి బయలుదేరనున్న చంద్రబాబు

-విజయవాడలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర నివాసాలకు వెళ్లనున్న చంద్రబాబు

-బైయిల్ పై వచ్చిన ఇరువురి నేతలను పరామర్శించనున్న చంద్రబాబు

2020-09-02 08:00 GMT

తూర్పుగోదావరి :

-జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కరప లో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర   అధ్యక్షుడు సోము వీర్రాజు..

-సోము వీర్రాజు కామెంట్స్..

-పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి..

-పవన్ కళ్యాణ్ ఈ మధ్య దేశ భక్తి గురించి ఎక్కువగా చెబుతున్నారు..

-బిజెపి జాతీయ వాదం ప్రాతిపదికగా ఏర్పాటు చేసిన పార్టీ..

-ఈ బాబు అయినా ఆ బాబు అయినా వారి సొమ్ము కాదు కాబట్టి వారి ఇష్టం వచ్చినట్టు పంచుతున్నారు..

-చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో సొమ్ములు పంచారు..

-చంద్రబాబు ఆయన చెందిన ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ను ఆయినా ఉచితంగా ఇచ్చాడా..

-ఇప్పుడున్న బాబు ఆయనకున్న ఆస్తిలో సెంటు భూమి అమ్మి ఇవ్వగలడా..

-ఇది జాతీయ వాదానికి మంచిది కాదు..

2020-09-02 07:53 GMT

శ్రీకాకుళం జిల్లా..

-శ్రీకాకుళంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి..

-పాల్గొన్న మాజీమంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, వైసిపి శ్రేణులు..

-జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ధర్మాన..

-ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..

-ముఖ్యమంత్రిగా తన పాలనలో అట్టడుగుస్థాయి ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి..

-ప్రజాస్వామ్య పరిపాలనను అన్నీ వర్గాల ప్రజలకు కుల మతాలకు అతీతంగా అందించారు..

-బీద కుటుంబ అవసరాలను తీర్చడానికి వైఎస్ చేసిన ప్రయత్నాలు అనేక రాష్ట్రాలు అనుసరించి ఆదారశంగా తీసుకున్నాయి..

-రాజశేఖర్ రెడ్డిని శ్రీకాకుళం ప్రజలు ఎప్పటికీ మారువలేరు..

-వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా పైలట్ ప్రాజెక్టు గా జిల్లా నుంచే ప్రారంభించేవారు..

-వెనుక బడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళంకు వైఎస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు..

-జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు..

-వైఎస్ పాలనను జిల్లా ప్రజలు ఒక స్వర్ణ యుగంలా చెప్పుకుంటారు..

Tags:    

Similar News