Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-01 00:44 GMT
Live Updates - Page 3
2020-09-01 07:23 GMT

Jangaon district updates:పాలకుర్తి మండలం కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అంబులెన్సును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ..

జనగామ జిల్లా..

-పాలకుర్తి మండలం కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అంబులెన్సును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ

-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు అప్పగించారు.

2020-09-01 07:17 GMT

Mahabubabad district updates: తొర్రూర్ డివిజన్ కేంద్రంలోమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ శాఖ..

మహబూబాబాద్ జిల్లా..

-తొర్రూర్ డివిజన్ కేంద్రంలోమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ శాఖ..

-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబులెన్సును ప్రారంభించి తొర్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు అప్పగించారు.

2020-09-01 05:08 GMT

Khammam district updates: హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో కిందిస్థాయి సిబ్బంది ఇష్టా రాజ్యం..

ఖమ్మం....

-ఖమ్మం హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో కిందిస్థాయి సిబ్బంది ఇష్టా రాజ్యం..

-మార్కెట్ సిబ్బంది అక్రమ వసూళ్ళు భరించలేక గేటు ముందు వాహనాలు అడ్డుపెట్టి ధర్నాకు దిగిన వాహనదారులు..

-కూరగాయలు మార్కెట్లో వాహనా దారులనుండి సెజ్ పేరుతో అక్రమ వసూళ్ళు..

-గడిచిన పదిరోజుల్లో పలు మార్లు రేట్లు పెంపు..

-వాహనాలు బట్టి ఒక్కొరేటు వసూళ్ళు...మార్కెట్ బిల్ ఇస్తే ఓరేటు...లేకుంటే మరో రేట్..

-వాహన దారులకు బిల్ ఇవ్వకుండానే వసూళ్ళు చేస్తున్న సిబ్బంది..

-మార్కెట్ కమిటీ చెర్మెన్ రమణ హామీతో ధర్నా విరమించిన వాహనదారులు..

2020-09-01 05:01 GMT

Telangana Corona updates: తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల..

-తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల..

-గడిచిన 24 గంటల్లో 2734 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు

-మొత్తం ఇప్పటి రాష్ట్రంలో 1 27 697 కొరొనా కేసులు నమోదు

-కొత్తగా 9 మరణాలు 836 కి చేరిన మరణాల సంఖ్య

-మొత్తం ఆక్టీవ్ కేసులు 31 699 కొరొనా కేసులు

-గడిచిన 24 గంటల్లో 38 351 శాంపిల్స్ కలెక్ట్ చేయగా 878 పెండింగ్ లో ఉన్నాయి

2020-09-01 04:59 GMT

Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద....

నిజామాబాద్....

-శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

-ఇన్ ఫ్లో 18650 వేల క్యుసెక్కులు

-ఔట్ ఫ్లో 6636 క్యూసెక్కుల

-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

-ప్రస్తుత నీటి మట్టం 1089.8 అడుగులు

-నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు

-ప్రస్తుతం 83.772 టిఎంసీలు

2020-09-01 04:56 GMT

Jayashankar Bhupalpally updates: కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

-మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద పెరుగుతున్న గోదావరి నది వరద ఉదృతి

-స్నాన ఘట్టాల వద్ద 32వ మెట్టు పైకి చేరిన వరద.

-11.87 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి నది.

-నిండుకుండను తలపిస్తున్న గోదావరి.

2020-09-01 03:37 GMT

Telangana latest updates: నేడు గణేష్ నిమజ్జనానికి పోలీస్ శాఖ అలర్ట్....

-నేడు గణేష్ నిమజ్జనానికి పోలీస్ శాఖ అలర్ట్....

-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందితో బందోబస్తు ఏర్పాటు...

-కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపు కోవాలని సూచించిన పోలీస్ శాఖ..

-నిబంధనలు ఉల్లగిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవు అంటున్న పోలీసులు..

-మూడు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ల ద్వారా నిమాజ్జన వేడుకల్ని పరీశీలించనున్న అధికారులు..

-నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచిన పోలీసులు..

-హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ప్రాంతాల్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసులు.

-భక్తులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు,పోలీసులకు సహకరించాలంటున్న పోలీసులు.

2020-09-01 01:53 GMT

Hyderabad Latest News: బాలాపూర్ గణేష్ లడ్డు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం అయ్యింది..

-బాలాపూర్ గణేష్ లడ్డు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం అయ్యింది..

-ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా ఊర్లో ఊరేగింపు జరుపుతున్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు

-ఈ సంవత్సరం కరోనా కారణంగా లడ్డు వేలం పాట వెయ్యని సభ్యులు

-ఉచితంగా లడ్డు ని పంపిణీ చేస్తామంటున్న ఉత్సవ కమిటీ సభ్యులు

-బాలాపూర్ గణేష్ నిమార్జనానికి, దర్శనానికి భక్తులని అనుమతించని పోలీసులు

2020-09-01 01:21 GMT

Nizamabad updates: నేడు నగరం లో గణేష్ నిమజ్జనం.

నిజామాబాద్ :

-నేడు నగరం లో గణేష్ నిమజ్జనం.

-నగర పాలక సంస్థ తరపున ఏర్పాట్లు.

-దుబ్బ ప్రాంతం నుంచి ప్రధాన వీధుల మీదుగా వినాయకుల బావి వరకు కొనసాగనున్న గణేష్ శోభాయాత్ర

-గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్.

2020-09-01 01:18 GMT

Nizamabad updates: నేటి నుంచి డిజిటల్ తరగతుల నిర్వహణ కు విద్యాశాఖ ఏర్పాట్లు..

నిజామాబాద్ :

-నేటి నుంచి డిజిటల్ తరగతుల నిర్వహణ కు విద్యాశాఖ ఏర్పాట్లు..

-1 నుంచి 14 తేదీ వరకు పాఠ్య ప్రణాళిక ను విడుదల చేసిన అధికారులు.

-మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు పాఠాలు వినేలా ఏర్పాట్లు.

Tags:    

Similar News