Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-01 01:30 GMT
Live Updates - Page 2
2020-10-01 12:03 GMT

Bhadradri Kothagudem district updates: రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం: వనమా వెంకటేశ్వరరావు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

కొత్తగూడెం....

-రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ

-సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం

-కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు....

-నాయకులగూడెం గ్రామం నుండి కొత్తగూడెం వరకు ఐదు వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ.

2020-10-01 12:00 GMT

Uttam Kumar Reddy Comments: మోడీ ప్రభుత్వం రైతాంగానికి తీవ్రంగా నష్టపరుస్తుంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి..టీపీసీసీ అధ్యక్షులడు..

-కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా చట్టాలు రూపొందించారు

-రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యాక్రమాలు ..

-కిసాన్, మాజ్దూర్ బచావో దివస్ గా కార్యక్రమాలు జరపాలి..

-కలెక్టరేట్ దగ్గర కానీ, గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు

-మద్దతు ధరకే పంట కొనుగోలు చేయాలని చట్టంలో ఎందుకు పొందుపరచడం లేదు

-కేసీఆర్ రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి

-తెలంగాణ రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది

-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో గ్రాడ్యుయేట్స్ ని ఓటర్లుగా చేర్పించాలి

-దుబ్బాక అభ్యర్థి ని రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తాం .

-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సబ్ కమిటీని రేపు ప్రకటిస్తాం

2020-10-01 11:52 GMT

Rewanth Reddy: సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

-ఈ నెల ఆరున అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించండి

-రాజకీయ దురుద్ధేశంతో ఈ స్కీంను మీరు అటకెక్కించారు

-ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన ఈ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు

-రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని కేఆర్ఎంబీ నా లేఖకు స్పందనగా ప్రత్యుత్తరమిచ్చింది.

-జలాల కేటాయింపులో ఏడేళ్లుగా మోడీ ఉలకకపోయినా... బీజేపీ ప్రయోజనాల కోసం మీరు పలుకుతూనే ఉన్నారుగా.

-ఏపీ కయ్యానికి కాలుదువ్వుతోందంటోన్న మీకు... ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు?

-ఉత్తుత్తి హూంకరింపులు, గాండ్రింపులు పక్కన పెట్టండి

2020-10-01 11:47 GMT

Telangana Jana Samithi: నూతన కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం ...

టీజేఏస్: 

-టీజేఏస్ పార్టీ రాష్ట్ర యూత్ విభాగం నూతన కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం ...

-ఆశప్ప - రాష్ట్ర అధ్యక్షులు - సంగారెడ్డి జిల్లా

-సయ్యద్ సలీంపాష - రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ - భువనగిరి యాదాద్రి జిల్లా

-కొత్త రవి - రాష్ట్ర ఉపాధ్యక్షులు - రంగారెడ్డి జిల్లా

-గొంగారెడ్డి వెంకట్ రెడ్డి - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - సూర్యాపేట జిల్లా

2020-10-01 03:54 GMT

Hyderabad updates: ఈ రోజు జిహెచ్ఎంసి కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్..

 హైదరాబాద్.. 

-ఉన్నతాధికారుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణ ,సాంకేతిక పరిజ్ఞానం పై చర్చించనున్న అధికారులు

-జిహెచ్ఎంసి కార్యాలయంలో వార్డ్ ల విభజన, ఓటర్ ల జాబితా, తదితర అంశాలపై చర్చ

-కరోనా నేపథ్యంలో పోలింగ్ వంటి అంశాలపై చర్చించనున్న జిహెచ్ఎంసి అధికారులు.

2020-10-01 03:48 GMT

Graduates Elections: తెలంగాణ లో డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు..

-ఇవాళ్టి నుండి ఉమ్మడి మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం ,వరంగల్,నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు కు నోటిఫికేషన్   విడుదల

-నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ నమోదు కు దరఖాస్తుల స్వీకరణ

-గతంలో ఓటరైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.

-డిసెంబర్ 1 న ఓటర్ ల జాబితా ముసాయిదా విడుదల

-డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరణ

-జనవరి 2021 12 వ తేదీ వరకు అభ్యంతరాలు పరిష్కరణ

-జనవరి18 ఓటర్ తుది జాబితా విడుదల

-నవంబర్ 1 వ తేదీ వరకు డిగ్రీ పూర్తి అయి మూడు సంవత్సరాలు అయి ఉండాలి.

2020-10-01 03:16 GMT

Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్ళీ పెరిగిన వరద..

నిజామాబాద్..

-ఇన్ ఫ్లో 86943 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 86943 క్యూసెక్కులు

-16 గేట్లు ఎత్తేసిన అధికారులు

-జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 259 టీఎంసీలు

-144 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

-జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి వచ్చిన 256 టీఎంసీలు

-142 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

Tags:    

Similar News