Steaming Benefits: ఆవిరిపడితే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Steaming Benefits: ఆవిరిపడితే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Update: 2022-10-19 16:00 GMT

Steaming Benefits: ఆవిరిపడితే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Steaming Benefits: జలుబు చేసినప్పుడు చాలామంది వేడి నీళ్ల ద్వారా ఆవిరిపడుతారు. దీనివల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఆవిరి పట్టేటప్పుడు కొందరు వేడి నీళ్లలో వేప, ఉప్పు, నిమ్మకాయ లాంటివి వేస్తారు. వీటివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆవిరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఆవిరి ప్రయోజనాలు

క్లెన్సింగ్

క్రమం తప్పకుండా ఆవిరి పడితే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది మురికిని, డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తో ఇబ్బంది పడే వారికి స్టీమింగ్ దివ్యౌషధం లాంటిది. ఇది ముఖాన్ని శుభ్రపరుస్తుంది. మీరు చర్మాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్నిసార్లు అది నిస్తేజంగా, నిర్జలీకరణంగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఫేస్ స్టీమింక్ సహాయం తీసుకుంటే మంచిది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

స్కిన్ హైడ్రేషన్

చాలా సార్లు నీరు లేకపోవడం వల్ల ముఖం మీద చర్మం డీహైడ్రేషన్ కు గురవుతుంది. చర్మం సామర్థ్యాన్ని పెంచడానికి మీరు ఫేస్ స్టీమింగ్ చేయాలి. తద్వారా ముఖం హైడ్రేషన్ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ముఖం మెరుస్తుంది.

చర్మం యవ్వనంగా

ఆవిరిని తీసుకోవడం వల్ల ముఖంపై కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా ముఖం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సాధారణంగా చర్మ సంరక్షణ నిపుణులు వారానికి మూడుసార్లు ఆవిరి పట్టాలని సిఫార్సు చేస్తారు.

Tags:    

Similar News