Lemon Juice: ఎండాకాలం నిమ్మరసానికి మించిన జ్యూస్ మరొకటి లేదు.. ఎందుకంటే..?
Lemon Juice: ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి.
Lemon Juice: ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. ఇది శరీరంలోని లవణాలు, పోషకాల లోపాన్ని తీరుస్తుంది. నిమ్మరసంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఎండాకాలం శరీరాన్ని చల్లబరుస్తుంది. దాహాన్ని తీరుస్తుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. మీకు విపరీతమైన దాహం ఉన్నట్లయితే ఒక గ్లాసు నీటిలో సగం లేదా ఒక నిమ్మకాయను పిండండి. 3 టీస్పూన్ల పంచదార, పావు టీస్పూన్ ఉప్పు కలిపి తాగితే సమస్య పరిష్కారమవుతుంది.
అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి పావు టీస్పూన్ ఉప్పు వేసి, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని కలపాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు తాగవచ్చు. ఇది శరీరంలో నీరు, పోషకాల కొరతను తీరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా తేనె కలపాలి. ఈ జ్యూస్‌ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
సగం నిమ్మకాయను తీసుకుని అందులో నల్ల ఉప్పు కలిపి తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆహారం తిన్న తర్వాత వికారం, వాంతుల సమస్య ఉంటే తాజా నిమ్మరసం రెండు చెంచాలు తాగితే చాలు. తక్షణ ప్రభావం చూపుతుంది. నిమ్మ ఆకులను మెత్తగా నూరి వాటి రసం 2 టీస్పూన్లు తాగితే కడుపులోని పురుగులు పూర్తిగా నశిస్తాయి. నిమ్మరసం రోజుకు 3 నుంచి 4 సార్లు తీసుకుంటే అతిసారం నయమవుతుంది. దోసకాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మూత్రంలో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. కట్ చేసిన దోసకాయలో బ్లాక్ సాల్ట్, నిమ్మరసం మిక్స్ చేసి తింటే శరీరానికి మేలు జరుగుతుంది.