World Sleep Day 2021: సుఖ నిద్రకు ఏ పొజిషన్ మంచిదో తెలుసుకోండి..

World Sleep Day 2021: మన శరీరానికి నిద్ర చాలా అవసరం. కానీ మనలో చాలామంది లేట్ గా నిద్రపోతూ.. లైట్ గా తీసుకుంటారు.

Update: 2021-03-19 12:02 GMT

సుఖ నిద్రకు బెటర్ పొజిషన్ తెలుసుకోండి (ఫొటో హన్స్ ఇండియా)

World Sleep Day 2021: మన శరీరానికి నిద్ర చాలా అవసరం. కానీ మనలో చాలామంది లేట్ గా నిద్రపోతూ.. నిద్రను చాలా లైట్ గా తీసుకుంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే చక్కని నిద్ర చాలా ముఖ్యం. ఈరోజు ప్రశా‌ంతంగా నిద్రపోతే.. మరుసటి రోజు యాక్టివ్ గా ఉంచేందుకు నిద్ర మన బాడీని రిపేర్ చేసి ఫిట్ గా ఉంచుతుంది. అప్పుడే మనం రోజూ వారి పనులను సక్రమంగా చేయగలం.

మంచి నిద్రతో లాభాలు

మంచి నిద్రతో మన బరువును కూడా కంట్రోల్ గా ఉంచుకోవచ్చు. అలాగే గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. మరి మంచి నిద్ర పోవాలంటే.. బెటర్ పొజిషన్ కావాలి. మరి అలాంటి కొన్ని పొజిషన్స్ ను ఇక్కడ అందిస్తున్నాం..

1. Fetal Position (గర్భస్థ శిశువులా)


లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వారికి అలాగే ప్రెగ్నెంట్ తో ఉన్న మహిళలకు ఫేటల్ పొజిషన్ చాలా మంచిది. ఈ స్థానంలో మీరు పడుకుంటే గురకను చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్‌లో ఒక పక్కకి పడుకొని నిద్రపోతూ.. మన కాళ్ళని మోకాళ్ళ వరకు ముడుచుకుని పొట్టకి దగ్గరగా పెట్టుకుంటారు. చాలామంది చిన్నపిల్లలు కూడా ఇదే తరహాలో నిద్రిస్తారు. కాబట్టి ఈ పొజిషన్‌కి బేబీ పొజిషన్ అని కూడా పేరొచ్చింది.

2. Lying on your Stomach (స్టమక్ స్లీపింగ్ పొజిషన్)


‌బె‌డ పైన బోర్లా పడుకొని.. మొత్తం మన శరీర బరువుని మన ఉదార భాగం పైనే కేంద్రీకరించే పొజిషన్‌‌ని స్టమక్ స్లీపింగ్ పొజిషన్ అని అంటారు. దీని వలన మన తల ఒక వైపు లేదా మరో వైపు పూర్తిగా తిరిగి ఉంటుంది. అయితే కొంతమందికి మెడ పట్టేయడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే నడుము నొప్పి కూడా కొందరికి కలించవచ్చు.

3. Sleeping on your Side ( లాగ్ స్లీపింగ్ పొజిషన్ )


దీనిని లాగ్ స్లీపింగ్ పొజిషన్ లేదా సోల్జర్ స్లీపింగ్ పొజిషన్ అని కూడా అంటారు. నిద్రపోయే సమయంలో.. ఎడమ లేదా కుడి వైపు మాత్రమే పడుకుంటారు. మన బరువుని కేవలం మన భుజం పైనే వేస్తూ చేతులని కూడా సమాంతరంగా ఉంచే పొజిషన్. ఈ పొజిషన్ లో గుండె మంటను తగ్గించుకోవచ్చు. అలాగే గురకను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటు జీర్ణక్రియలో గ్యాస్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. మంచి పిల్లోని వాడి మెడపై భారం పడకుండా చూసుకోవాలి. సైనికులు ఎక్కువమంది ఇలానే పడుకోవడానికి అలవాటు పడతారు. కాబట్టి దీనికి ఆ పేరు కూడా వచ్చింది.

4. Freefall Sleeping Position (ఫ్రీఫాల్ స్లీపింగ్ పొజిషన్)

మనం బెడ్ పైన బోర్లా పడుకుని.. అలాగే మన రెండు చేతులు పిల్లో పైకి వేసి చాలా ఫ్రీగా నిద్రపోతే దానిని ఫ్రీఫాల్ స్లీపింగ్ పొజిషన్ అంటారు. మనలో చాలా మంది ఇలానే పడుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి పొజిషన్‌లో మన శరీరం చాలా రిలాక్స్ అవుతుంది.

5. Star Fish Sleeping Position (స్టార్ ఫిష్ స్లీపింగ్ పొజిషన్)

ఈ స్టార్ ఫిష్ స్లీపింగ్ పొజిషన్ ప్రకారం, మనం బెడ్ పైన వెల్లకిలా పడుకుని మన చేతులని పిల్లోపై ఉంచి నిద్రపోతాం. ఈ పొజిషన్‌లో చాలా తక్కువమంది నిద్రిస్తుంటారు. దీంతో మెడనొప్పి కంట్రోల్ అవుతుంది. అలాగే మన చర్మం చాలా ఫ్రెస్ గా కనిపిస్తుంది.

ఈ పైన పేర్కొన్న స్లీపింగ్ పొజిషన్స్‌ తో ప్రయోజనాలతో పాటుగా.. కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే మీకు ఉన్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని.. సరైన పొజిషన్ ను ఎంచుకుని, మంచి ఫలితాలను పొందవచ్చు.

ఏ స్లీపింగ్ పొజిషన్‌లో పడుకుంటే నడుము నొప్పి (Back Pain) తగ్గుతుంది?

మనం ప్రయాణాలు చేయడం లేదా కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేయడం వల్ల ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ (నడుము నొప్పి) వస్తుంటుంది. నడుము నొప్పిని తగ్గించుకోవాలంటే, మనం బ్యాక్ పొజిషన్‌‌‌ను ఎంచుకోవాలి.

ఈ పొజిషన్‌లో పడుకునే సమయంలో.. మన నడుము భాగంలో ఒక పిల్లోని సపోర్ట్‌గా పెట్టుకోవడం ద్వారా నడుము నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. లేదా ఎటువంటి బెడ్ లేకుండా నేల పైన బ్యాక్ పొజిషన్‌లో పడుకోవడం ద్వారా కూడా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మంచి నిద్ర కావాలంటే ఒక మంచి బెడ్ కూడా తప్పనిసరి. అందుకే ఒక బెడ్‌ని కొనే ముందు.. చూడాల్సిన అంశాలు తెలుసుకుందాం..

* బెడ్ మొత్తం ఒకే ఆకారంలో ఎత్తు పల్లాలు లేకుండా చూసుకోవాలి.

* అలాగే బెడ్ తయారీలో ఎటువంటి మెటీరియల్‌ని ఉపయోగించారన్నది కూడా ముఖ్యం.

* అలాగే బెడ్ కొలతలు కూడా మన ఎత్తుతో సరి చూసుకోవాలి.

* నడుము నొప్పి లేదా ఇతరత్రా సమస్యలుంటే... ప్రత్యేకంగా తయారుచేసిన బెడ్స్‌ని కొనుగోలు చేయాలి.

Tags:    

Similar News