Diabetes Patients: ఉదయం రక్తంలో చక్కెర శాతం ఎందుకు పెరుగుతుంది.. ఇవే కారణాలు..!
Diabetes Patients: డయాబెటిక్ పేషెంట్లు డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఉదయం బ్లడ్ షుగర్ టెస్ట్ రిపోర్టు తీసుకురావాలని చెబుతారు.
Diabetes Patients: డయాబెటిక్ పేషెంట్లు డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఉదయం బ్లడ్ షుగర్ టెస్ట్ రిపోర్టు తీసుకురావాలని చెబుతారు. దీని వెనుక కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? వైద్యులు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలాంటి టెస్ట్‌లు చేయరు.. నిజానికి ఉదయం పూట రక్తంకలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇది శరీరంలో జరిగే సాధారణ ప్రక్రియ. వాస్తవానికి అర్థరాత్రి, తెల్లవారుజామున శరీరంలో ఏం జరుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం.
ఉదయాన్నే శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పులు జరుగుతాయి. మధుమేహం ఉన్నా లేకపోయినా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. డయాబెటిస్‌తో బాధపడనప్పుడు శరీరం అనేక విషయాలను సమతుల్యం చేయడానికి ఎక్కువ ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. మీకు మధుమేహం ఉంటే మీరు ఎంత కఠినమైన డైట్ చార్ట్‌ని అనుసరించినా రాత్రి భోజనం, అల్పాహారం మధ్య చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ రోగుల శరీరంలో ఇన్సులిన్ సాధారణంగా పని చేయదు. రాత్రిపూట విడుదలయ్యే ఎపినెఫ్రిన్, గ్లూకాగాన్, కార్టిసాల్ వంటి గ్రోత్ హార్మోన్లు శరీరం ఇన్సులిన్ నిరోధకతను బలపరుస్తాయి. ఇది ఖచ్చితంగా చక్కెర స్థాయినిపెంచుతుంది.
ఉదయం చక్కెర స్థాయి పెరగడానికి 3 పెద్ద కారణాలు
1. మీరు ఎక్కువ లేదా తక్కువ ఔషధం తీసుకోవడం.
2. రాత్రికి ముందు శరీరంలో ఇన్సులిన్ తగినంత మొత్తంలో లేకపోవడం
3. మీరు నిద్రపోయే ముందు కొన్ని తీపి పదార్థాలు తింటూ ఉండడం
రక్తంలో చక్కెర నియంత్రించడానికి ఏం చేయాలి.. ?
రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే అజాగ్రత్తగా ఉండవద్దు. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.
1. సాయంత్రం లైట్ ఫుడ్ తినాలి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య భోజనం చేయాలి.
2. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు. బదులుగా నడవడానికి ప్రయత్నించాలి.
3. డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవద్దు. ఎందుకంటే ఏ ఔషధం వల్ల షుగర్ పెరుగుతుందో తెలియకపోవచ్చు.
4. రాత్రిపూట ఏదైనా తీపి తినకూడదు. ఇది చాలా హానికరం.