Cow Ghee vs Buffalo Ghee: ఆవు నెయ్యి గేదె నెయ్యిలలో ఏది బెస్ట్..!
Cow Ghee vs Buffalo Ghee: ఆవు నెయ్యి గేదె నెయ్యిలలో ఏది బెస్ట్..!
Cow Ghee vs Buffalo Ghee: ఆహారంలో నెయ్యి కలిసినప్పుడు ఆహారం రుచి మారుతుంది. నెయ్యిలో ఉండే కొవ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి. అనేక పోషకాల లోపాన్ని నెయ్యి తీరుస్తుంది. ఇది చర్మ కాంతిని పెంచుతుంది. నెయ్యిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. నెయ్యి జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఆవు, గేదె నెయ్యిలో ఏది మంచిదో ఈ రోజు తెలుసుకుందాం.
ఆవు నెయ్యి గేదె నెయ్యి కంటే కొంచెం పసుపు రంగులో ఉంటుంది. ఇందులో గేదె నెయ్యి కంటే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లతో పాటు ఎన్నో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, విటమిన్ల గురించి మాట్లాడితే ఇది ఆవునెయ్యి, గేదె నెయ్యి రెండింటిలో ఉంటుంది. శరీరంలో భాస్వరం, మెగ్నీషియం లోపం ఉంటే గేదె నెయ్యి మంచిది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి గేదె నెయ్యి కంటే ఆవు నెయ్యి ఉత్తమం. ఆవు నెయ్యిలో కరిగే ఆమ్లాలు ఉంటాయి. దీని కారణంగా ఇది పిల్లలకు, వృద్ధులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మీరు బరువు పెరగాలనుకుంటే గేదె నెయ్యి మంచిది. కానీ నెయ్యి తినేటప్పుడు నిర్ణీత పరిమాణంలో మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. అధిక మొత్తంలో నెయ్యి శరీరానికి హానికరం. గేదె నెయ్యిలో కొవ్వులు అధిక పరిమాణంలో ఉంటాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారికి ఇది మంచిది. కూర్చొని పనిచేసేవారికి ఇది అంత మంచిది కాదని చెప్పవచ్చు. వీరు ఆవునెయ్యిని వాడితే ఉత్తమం.