Neck Pain: నిద్ర లేవగానే మెడ పట్టేసిందా.. చిటికెలో ఇలా తొలగించుకోండి..!

Neck Pain: కొంతమంది ఉదయాన్నే నిద్ర లేవగానే మెడ నొప్పులతో ఇబ్బంది పడుతారు...

Update: 2022-03-20 06:36 GMT

Neck Pain: నిద్ర లేవగానే మెడ పట్టేసిందా.. చిటికెలో ఇలా తొలగించుకోండి..!

Neck Pain: కొంతమంది ఉదయాన్నే నిద్ర లేవగానే మెడ నొప్పులతో ఇబ్బంది పడుతారు. దీని కారణంగా వారు తమ మెడను సరిగ్గా వంచలేరు కదిలించలేరు. ఇది కాకుండా కొంతమంది తలనొప్పి సమస్యను కూడా అనుభవిస్తారు. దీంతో వారు రోజు మొత్తం డిస్ట్రబ్‌గా ఉంటారు. దీనికి కారణం వారు సరైన మార్గంలో నిద్రించకపోవడమే. అంతేకాదు దిండును తప్పుగా ఉపయోగించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.

ఈ పరిస్థితిలో కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించడం ద్వారా మెడ నొప్పులని తొలగించవచ్చు. మీకు మెడ నొప్పిగా అనిపిస్తే ప్రభావిత ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా చల్లని నీటితో కడగండి.ఇలా చేయడం వల్ల మెడ కండరాల వాపులు తొలగిపోతాయి. మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు మీరు హీట్ ప్యాక్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల మంచి ఉపశమనం ఉంటుంది.

తేలికపాటి చేతులతో మెడకు మసాజ్ చేయడం వల్ల మెడ బిగుతుగా ఉండటమే కాకుండా కండరాల నొప్పులు కూడా దూరమవుతాయి. ఈ పరిస్థితిలో మీరు మసాజ్ కోసం ఆవాల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు.మెడ నొప్పిని నివారించడానికి కడుపుపై పడుకోవడం మానుకోండి. ఒక వైపునకు తిరిగి పడుకుంటే మంచిది.

కూర్చున్నప్పుడు గానీ, నిల్చున్నప్పుడు కానీ లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ మెడను నిటారుగానే ఉంచాలి. మెడనొప్పి ఉన్నప్పుడు మెడను ఎట్టిపరిస్థితుల్లో గుండ్రంగా తిప్పకూడదు. మెడ నొప్పి పెరుగుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నిద్ర వల్ల మెడ నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా నొప్పులు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News