Health Tips: హెల్మెట్​కి బట్టతలకి ఉన్న సంబంధం ఏంటి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Health Tips: చాలామంది ట్రాఫిక్​ పోలీసుల బాధ తట్టుకోలేక భారంగా తలకి హెల్మెట్​ పెట్టుకుంటారు. ఇంకొందరు హెల్మెట్​ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుందని ప్రచారం చేస్తున్నారు.

Update: 2023-09-23 14:00 GMT

Health Tips: హెల్మెట్​కి బట్టతలకి ఉన్న సంబంధం ఏంటి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Health Tips: చాలామంది ట్రాఫిక్​ పోలీసుల బాధ తట్టుకోలేక భారంగా తలకి హెల్మెట్​ పెట్టుకుంటారు. ఇంకొందరు హెల్మెట్​ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి హెల్మెట్​ ధరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్​ ధరించాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయినా, బండి స్కిడ్ అయి పడిపోయినా ఇది మనల్ని కాపాడుతుంది. మన బాడీలో తల అనేది అత్యంత కీలకం దీనికి ఏదైనా జరిగితే మనిషి బతికున్నా వేస్టే. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని, బట్ట తల వస్తుందని, స్కీన్ పాడవుతుందని ఇలా రక రకాల కారణాలు చెబుతారు. వీటిలో ఎంత వరకు వాస్తవం ఉందో ఈ రోజు తెలుసుకుందాం. 

హెల్మెట్ ధరించడం వల్ల దుమ్మూ, ధూళి పడకుండా ఉంటుంది. దీనివల్ల ఫేస్ క్లీన్​గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బట్ట తలకు, హెల్మెట్ కు సంబంధం లేదని, చుండ్రు సమస్యలు అస్సలే రావని అంటున్నారు. చాలా మంది హెల్మెట్ తీశాక ఎక్కడ పడితే అక్కడ పెడుతారు. కానీ అలా చేయవద్దు. హెల్మెట్ ఎప్పుడూ గాలి తగిలే చోట పెడితే అందులో ఉండే చమట తడి ఆరిపోతుంది. ఎండలో పెట్టినా మంచిదే ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటే నశిస్తుంది.

ఒకరు వాడిన హెల్మెట్ ను మరొకరు ఎప్పుడు వాడ కూడదు. ఎందుకంటే ఒకరి తలలో ఉండే చుండ్రు మరొకరికి అంటుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే బాగా క్లీన్​ చేసుకొని వాడే ప్రయత్నం చేయాలి. అలాగే హెల్మెట్ ను ఎప్పుడూ నేరుగా ఉపయోగించ కూడదు. తలకు క్లాత్ కట్టిన తర్వాత హెల్మెట్ ను పెట్టుకోవాలి. ఇక హెల్మెట్​ నాణ్యత గురించి వస్తే చాలామంది పెద్ద తప్పు చేస్తుంటారు. ఏదో పేరుకు తక్కువ ధరలో ఉన్న హెల్మెట్లని కొని వాడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి మంచి నాణ్యత ఉన్న దానిని వాడాలి. అప్పుడే ఎలాంటి ప్రమాదంలోనైనా మీరు బయటపడుతారు.

Tags:    

Similar News