Apple vs Banana: పోషకాల పరంగా యాపిల్‌, అరటిపండులో తేడాలేంటి..?

Apple vs Banana: పోషకాల పరంగా యాపిల్‌, అరటిపండులో తేడాలేంటి..?

Update: 2022-11-17 05:54 GMT

Apple vs Banana: పోషకాల పరంగా యాపిల్‌, అరటిపండులో తేడాలేంటి..?

Apple vs Banana: చలికాలంలో యాపిల్‌, అరటిపండ్లు ఎక్కువగా లభిస్తాయి. అయితే ఈ రెండు పండ్ల మధ్య ఉన్న తేడా గురించి ఈ రోజు తెలుసుకుందాం. చలిలో అరటిపండుని తక్కువగా తింటారు. ఎందుకంటే జలుబుకి భయపడి ప్రజలు దీనిని తినరు. కానీ అరటిపండులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఆపిల్ కూడా చాలా పోషకమైన పండు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఆపిల్‌లో అత్యంత ప్రసిద్ధ రకం రెడ్ యాపిల్. ఇది చాలా తీపిగా ఉంటుంది. కాబట్టి రెండింటి ప్రయోజనాల గురించి ఒక్కసారి భేరిజు వేద్దాం.

అరటిపండును అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. వాటిని పచ్చిగా తినవచ్చు. జ్యూస్‌లలో ఉపయోగించవచ్చు. బేకింగ్ కోసం ఉపయోగించవచ్చు. అయితే అరటిపండ్ల కంటే యాపిల్స్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. యాపిల్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను తయారు చేయడంలో సహాయపడుతుంది.

అరటిపండు ఫైబర్‌కి మంచి మూలమని చెప్పవచ్చు. ఆపిల్ కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ అరటిపండులో పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఆపిల్, అరటిపండు రెండూ మంచి స్నాక్స్‌గా చెప్పవచ్చు. అయితే చక్కెరను నియంత్రించాలనుకుంటే యాపిల్ తినాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News