Health Tips: వివాహిత పురుషులకి ఈ గింజలు దివ్య ఔషధం.. ఈ సమస్య నుంచి బయటపడుతారు..!
Health Tips: ఆధునిక కాలంలో చాలామంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పురుషులు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల తండ్రి కాలేకపోతున్నారు.
Health Tips: ఆధునిక కాలంలో చాలామంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పురుషులు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల తండ్రి కాలేకపోతున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకోవడం, ధూమపానం చేయడం, ఇతర చెడు అలవాట్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమయంలో రోజువారీ డైట్‌లో కొన్ని మార్పులు చేయాలి. ముఖ్యంగా ఒక పండు గింజలని ప్రతిరోజు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
పుచ్చకాయ గింజలు
వేసవి కాలంలో మనం తరచుగా పుచ్చకాయ తింటాం. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. కానీ ఇందులో ఉండే నల్ల గింజల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పురుషులకి చాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపడుతుంది. సంతానం లేనివ్యక్తులు ప్రతిరోజు వీటిని తినడం అలవాటు చేసుకోవాలి. మంచి ఫలితాలు ఉంటాయి.
పుచ్చకాయ గింజలలో పోషకాలు
పుచ్చకాయ గింజలలో ప్రోటీన్, సెలీనియం, జింక్, పొటాషియం, రాగి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ గింజలు తినడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పుచ్చకాయ గింజలలో ఉండే సిట్రులిన్ రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు అవసరమైన జింక్ లభిస్తుంది. అంతేకాదు గ్లూటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ లభిస్తాయి. ఇవి పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.
పుచ్చకాయ గింజలు తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి పెరగడమే కాకుండా జీర్ణక్రియ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పుచ్చకాయ గింజలను నేరుగా తినవచ్చు. లేదంటే వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయమే ఎండలో ఆరబెట్టిన తర్వాత తినవచ్చు. ఈ గింజలు రుచిగా ఉండాలంటే వేయించిన తర్వాత తింటే బాగుంటాయి.